ETV Bharat / business

PMAY అర్బన్ 2.0 స్కీమ్ కింద కోటి ఇళ్లు మంజూరు​ - అర్హులెవరు? ప్రయోజనాలు ఏంటి? - Pradhan Mantri Awas Yojana

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 4:48 PM IST

PMAY-Urban 2.0 Scheme : పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) 2.0 పథకాన్ని తీసుకొచ్చింది. మరి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? వారి అర్హతలు ఏమిటి? ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

PMAY-Urban 2.0 Scheme
Pradhan Mantri Awas Yojana (ETV Bharat)

PMAY-Urban 2.0 Scheme : దేశంలోని పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్​ యోజన- అర్బన్ (పీఎంఏవై-యూ) 2.0. ఈ పథకం కింద కోటి ఇళ్లను మంజూరు చేసేందుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎవరు అర్హులు? ప్రభుత్వం నుంచి లభించే రాయితీలు ఏంటి? తదితర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పీఎంఏవై-యూ 2.0 అంటే ఏమిటి?
పట్టణాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలు సహేతుకమైన ధరలో ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా సరైన ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఆర్థిక సాయం అందించడమే పీఎంఏవై-యూ 2.0 పథకం ప్రధాన లక్ష్యం. దేశంలో పట్టణాల్లో నివసించే, సొంతిల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు క‌ట్టుకోవడం/కొనుగోలు చేయవచ్చు. దీని కోసం సబ్సిడీపై గృహ రుణాన్ని పొందవచ్చు.

పీఎంఏవై-యూ పథకం వల్ల ప్రయోజనం ఎవరికి?
మురికివాడల్లో నివసించేవారికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, వితంతువులు, దివ్యాంగులు, సమాజంలో వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు ఈ స్కీమ్​ మేలు చేకూరుస్తుంది. అలాగే సఫాయి కార్మికులు, వీధి వ్యాపారులు, చేతివృత్తులవారు, అంగన్‌ వాడీ వర్కర్స్ వంటివారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.

పీఎంఏవై-యూ పథకానికి అర్హతలేంటి?
ఆర్థిక బ‌ల‌హీన వ‌ర్గాలు (ఈడ‌బ్ల్యూఎస్‌), అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యస్థాయి ఆదాయ వర్గం(ఎంఐజీ) వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం సున్నా నుంచి రూ.3 లక్షల మ‌ధ్య ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ (ఆర్థిక బలహీన వర్గాలు) కేటగిరీ కిందకు వస్తారు. అలాగే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎల్ఐజీ కేటగిరీ కిందకు వస్తారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటే వారిని ఎంఐజీ కేటగిరీ వారిగా పరిగణిస్తారు.

బెనిఫిషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (BLC) : ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి సొంత స్థలం ఉంటే, వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. భూమి లేని లబ్ధిదారులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట పట్టా భూమి ఇస్తుంది.

అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్​షిప్ (AHP) : పబ్లిక్, ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించిన ఇల్లు కొనుగోలు చేసే ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన లబ్దిదారులకు ఏహెచ్​పీ కింద ఆర్థిక చేయూత అందిస్తారు.

అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ (ARH) : మహిళలు, పారిశ్రామిక కార్మికులు, పట్టణాలకు వచ్చిన వలసదారులు, నిరుపేదలు సహా ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఏఆర్​హెచ్ కింద తగిన అద్దె గృహాలను సమకూరుస్తారు. సొంతింటిని నిర్మించే/ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేనివారికి తక్కువ ధరకే అద్దె ఇల్లును సమకూర్చడం దీని లక్ష్యం.

గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం
ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు, అల్ప, మధ్య స్థాయి ఆదాయ వర్గాలవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హోమ్​ లోన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు మీరు రూ.35 లక్షల విలువ చేసే ప్రోపర్టీ కోసం, రూ.25 లక్షల వరకు బ్యాంకు రుణం తీసుకున్నారు అనుకుందాం. దీనిని 12 ఏళ్లలోపు తీర్చాలని మీరు నిర్ణయించుకుంటే, మీ మొత్తం లోన్​ అమౌంట్​లో రూ.8 లక్షల రుణంపై 4 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ లెక్కన 5 సంవత్సరాల వ్యవధిలో గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు.

మీ సోదరికి 'రాఖీ' కానుక ఇవ్వాలా? ఆర్థిక భరోసా ఇచ్చే ఈ గిఫ్ట్‌లు ట్రై చేయండి! - Financial Gifts For Raksha Bandhan

వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్‌ చేయాలా? 8-8-8 రూల్​ను ఫాలో అవ్వండి! - 8 8 8 Rule For Work Life Balance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.