ETV Bharat / business

పోస్టాఫీస్​ సూపర్ స్కీమ్ - రోజూ రూ.95 పెట్టుబడితో రూ.14 లక్షలు మీ సొంతం! - Ggram sumangal yojana scheme - GGRAM SUMANGAL YOJANA SCHEME

Post Office Gram Sumangal Yojana : రిస్క్‌ లేకుండా డబ్బులను పొదుపు చేయాలనుకునే వారికి భారతీయ తపాలా శాఖ ఉత్తమ ఎంపిక. ఇక్కడ ఎన్నో స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ మొత్తంలోనే డబ్బు పొదుపు చేస్తూ.. మెచ్యూరిటీ సమయంలో లక్షలు అందుకునే ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

Gram Sumangal Yojana
Post Office Gram Sumangal Yojana (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 3:31 PM IST

Post Office Gram Sumangal Yojana : ప్రస్తుత కాలంలో చాలా మంది పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ఇందుకోసం ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఎలాంటి రిస్కూ లేకుండా ఉండాలి, అదే సమయంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఎక్కువ రాబడి పొందాలని కోరుకునే వారికి పోస్టాఫీస్​ చిన్న మొత్తాల స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటే.. "గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్". ఇది రాబడితోపాటు బీమా కూడా కల్పించే పథకం! మరి.. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎంత పొదుపు చేయాలి ?
గ్రామ్‌ సుమంగల్‌ స్కీమ్‌లో చేరిన వారు రోజుకు కేవలం రూ.95 పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ సమయంలో రూ.14 లక్షలను పొందవచ్చు. అంటే.. నెలకు మీరు రూ.2,850 పొదుపు చేస్తే సరిపోతుంది. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే.. నామినీకి రూ.10 లక్షలను చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు బతికి ఉంటే రూ. 14 లక్షలు అందజేస్తారు.

రోజు రూ.18 పొదుపుతో - రూ.3 లక్షల బెనిఫిట్ ​- చిన్నారుల కోసం సూపర్​ స్కీమ్​! - Bal Jeevan Bima Yojana Scheme

ఈ ఫథకానికి ఎవరు అర్హులు?
గ్రామ్‌ సుమంగల్‌ పథకంలో భాగం కావడానికి గ్రామీణ ప్రాంతంలో నివసించే మహిళలు, పురుషులు అందరూ అర్హులు. ఈ స్కీమ్‌లో చేరడానికి వయసు 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు గ్రామ్ సుమంగల్‌ స్కీమ్‌లో 15 ఏళ్లు లేదా 20 వరకు డబ్బులను పొదుపు చేయవచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు డబ్బులను పొదుపు చేస్తే.. 6, 9, 12 సంవత్సరాలలో ప్రతిసారీ 20 శాతం డబ్బులు చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం డబ్బు మెచ్యూరిటీ తర్వాత చెల్లిస్తారు. అలాగే మీరు 20 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే స్కీమ్‌లో డబ్బులను ఇన్వెస్ట్‌ చేస్తే.. 8, 12, 16 ఏళ్లలో ప్రతిసారీ 20 శాతం డబ్బు చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం డబ్బు మెచ్యూరిటీ తర్వాత అందజేస్తారు.

ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి?
మీ సమీపంలోని పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఈ పథకం గురించి అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత సంబంధిత అప్లికేషన్‌ ఫారమ్‌ నింపి, అవసరమైన పత్రాలను జతచేసి అధికారులకు ఇస్తే సరిపోతుంది.

Note : పైన తెలిపిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వాణిజ్య రంగ నిపుణులు సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఈ ప్లాన్​లో పెట్టుబడి పెట్టేముందు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్​ చేయడం మంచిది.

10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు - పోస్టాఫీసు సూపర్​ స్కీమ్​! - Post Office RD Scheme

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ - రోజుకు రూ.50 పొదుపు చేస్తే చేతికి రూ.30లక్షలు! - Gram Suraksha Yojana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.