ETV Bharat / business

వ్యాపారుల కోసం స్పెషల్ గవర్నమెంట్​ స్కీమ్ - హామీ లేకుండానే రుణం - అప్లై చేసుకోండిలా! - pm svanidhi scheme loan amount

PM Svanidhi Scheme Benefits : కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా పీఎం స్వనిధి స్కీమ్​ను తీసుకువచ్చింది. దీని ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండానే రుణాలు మంజూరు చేస్తోంది. దీనికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? తదితర పూర్తి వివరాలు మీ కోసం.

PM Svanidhi Scheme l
PM Svanidhi Scheme Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 1:30 PM IST

PM Svanidhi Scheme Benefits : కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా స్ట్రీట్ వెండర్​ ఆత్మనిర్భర్​ నిధి (పీఎం స్వనిధి) స్కీమ్​ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా రూ.10,000 రుణం అందిస్తోంది.

పీఎం స్వనిధి బెనిఫిట్స్​
ఈ పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్​ తీసుకున్నవారు నిర్ణీత సమయంలోనే రుణాన్ని తిరిగి చెల్లిస్తే, వారికి అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వడ్డీ రేటులో 7% వరకు సబ్సిడీ లభిస్తుంది. డిజిటల్​ ట్రాన్సాక్షన్స్ ద్వారా పేమెంట్స్​ చేస్తే, ఏడాదిలో రూ.1200 వరకు క్యాష్​బ్యాక్​ వస్తుంది. అంటే వడ్డీ రాయితీ, క్యాష్​బ్యాక్​ రెండూ కలిపి చూస్తే, ఏకంగా రూ.1602 వరకు ఆదా అవుతుంది. సకాలంలో రుణాలు తీర్చిన వారికి, మరలా రుణం పొందేందుకు అర్హత లభిస్తుంది. అప్పుడు రెండోసారి రూ.20 వేల వరకు రుణం తీసుకోవచ్చు.

చేయూత
కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ఈ పీఎం స్వనిధి స్కీమ్​ను తీసుకువచ్చింది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అందిస్తోంది. కనుక అర్హత కలిగిన వారు ఈ స్కీమ్ కింద రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. అందుకుగాను ఎలాంటి స్థిరచరాస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. మొదటిసారిగా అప్లై చేసినవారికి రూ.10 వేలు రుణం అందిస్తారు. అయితే ఒక ఏడాదిలోగా ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

రుణార్హతలు
వీధి వ్యాపారులు మాత్రమే ఈ స్కీమ్ కింద రుణం పొందడానికి అర్హులు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, గుడ్లు అమ్మేవారు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు నడిపేవారు, బార్బర్ షాప్ నిర్వహించే వారందరూ ఈ వీధివ్యాపారుల కేటగిరీ కిందకే వస్తారు.

కావాల్సిన పత్రాలు
పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్​ అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు :

  • ఆధార్ కార్డు
  • ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్
  • వెండింగ్​​ సర్టిఫికెట్/ అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసిన ఐడెంటిటీ కార్డ్​
  • ఒకవేళ ఐడీ కార్డు లేకపోతే టౌన్ వెండింగ్​​ కమిటీ లేదా అర్బన్ లోకల్ బాడీస్ నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకోవచ్చు.

లోన్ కోసం అప్లై చేయండిలా!
మీరు నేరుగా ఆన్​లైన్​లోనే పీఎం స్వనిధి స్కీమ్ లోన్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా రుణం కోసం అప్లై చేయవచ్చు. కనుక మీకు నచ్చిన మార్గాన్ని అనుసరించండి. ఇప్పుడు మనం ఆన్​లైన్​లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

  • ముందుగా మీరు పీఎం స్వనిధి వెబ్‌సైట్‌ https://pmsvanidhi.mohua.gov.in/ ఓపెన్ చేయాలి.
  • అక్కడ మీకు రూ.10,000 లోన్, రూ.20,000 లోన్, లోన్ స్టేటస్​ లాంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మొదటిసారిగా అప్లై చేసేవారు రూ.10,000 లోన్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • రెండోసారి అప్లై చేసేవారు రూ.20,000 లోన్ ఆప్షన్​పై క్లిక్ చేయవచ్చు.
  • అప్పుడు ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ ఆధార్ నంబర్​/ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్​ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా వెండర్ ఐడీ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఒకసారి చెక్​చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.

6కోట్ల మంది ఉద్యోగులకు గుడ్​న్యూస్​- EPF వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు

LIC ఇండెక్స్ ప్లస్​ పాలసీతో డబుల్ బెనిఫిట్స్​ - జీవిత బీమా + సంపద వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.