ETV Bharat / business

అయోధ్య యాత్రికులకు Paytm బంపర్ ఆఫర్​ - బస్, ఫ్లైట్​ బుకింగ్స్​పై 100% క్యాష్ బ్యాక్​!

Paytm Offer For Ayodhya Trip In Telugu : అయోధ్యలోని బాలరాముని దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా బస్సు, ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేసుకున్నవారికి 100 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు మీ కోసం.

paytm cashback offer for ayodhya trip
paytm offer for ayodhya trip
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 1:09 PM IST

Paytm Offer For Ayodhya Trip : ప్రముఖ పేమెంట్ ప్లాట్​ఫాం పేటీఎం అయోధ్య యాత్రికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా బస్సు, ఫ్లైట్​ టికెట్స్ బుక్​ చేస్తే గరిష్ఠంగా 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తామని స్పష్టం చేసింది. తక్కువ బడ్జెట్లో అయోధ్యకు వెళ్లిరావాలని ఆశించేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్ లిమిటెడ్ పేర్కొంది.

ప్రోమో కోడ్​ ఇదే!
అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకోవాలని ఆశించే భక్తులు పేటీఎం ద్వారా సులువుగా బస్సు, విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే బస్సు టికెట్లు బుక్ చేసేవారు BUSAYODHYA అనే ప్రోమోకోడ్​ ఉపయోగించాలి. విమానం టికెట్లు బుక్ చేసుకునేవారు FLYAYODHYA అనే ప్రోమోకోడ్ ఎంటర్ చేయాలి. బస్సు టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్టంగా రూ.1000 వరకు క్యాష్​బ్యాక్ వస్తుంది. ఫ్లైట్​ టికెట్స్ బుక్ చేసుకునేవారికి గరిష్ఠంగా రూ.5000 వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.

ఫ్రీ క్యాన్సిలేషన్​
అయోధ్యకు వెళ్లే యాత్రికులు పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను ఉచితంగా క్యాన్సిల్​ కూడా చేసుకోవచ్చు. దీనితో వారికి ఎలాంటి కోతలు లేకుండా 100 శాతం రిఫండ్ లభిస్తుందని పేటీఎం స్పష్టం చేసింది. అంతేకాదు వన్​-వే, రౌండ్-ట్రిప్ ఫ్లైట్​ బుకింగ్స్​ చేసుకునేవారికి మరింత తక్కువ ధరలకే విమానం టికెట్లు అందిస్తున్నట్లు పేర్కొంది.

లైవ్ ట్రాకింగ్​
అయోధ్యకు వెళ్లే యాత్రికులకు లైవ్ బస్ ట్రాకింగ్ ఫెసిలిటీ కల్పిస్తారు. దీనివల్ల తాము ఎక్కడ ఉన్నదీ వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సులువుగా తెలియజేయవచ్చు. ఇది ప్రయాణికులకు అదనపు భద్రతను కల్పిస్తుంది.

విరాళాలు
యాత్రికులు పేటీఎం యాప్​ ద్వారా ఈ అయోధ్య బస్​, ఫ్లైట్ టికెట్స్ బుక్​ చేసుకోవచ్చు. అంతేకాదు భక్తులు Paytm యాప్​ ద్వారా అయోధ్య రామమందిర ట్రస్టుకు విరాళాలు కూడా అందించవచ్చు అని పేటీఎం ప్రకటించింది.

భారీగా తరలివస్తున్న భక్తులు
అయోధ్యలో బాలరామునికి ప్రాణ ప్రతిష్ట చేసిన తరువాత, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తండోపతండాలుగా అయోధ్యను దర్శించుకుంటున్నారు. దీనితో బస్సు, ట్రైన్​, ఫ్లైట్స్ టికెట్స్​, హోటల్ బుకింగ్స్​ భారీ ఎత్తున జరుగుతున్నాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు చాలా ట్రావెల్ కంపెనీలు, యాప్​లు అయోధ్య యాత్రీకుల కోసం పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

టికెట్​ బుకింగ్​కు ఈమెయిల్​, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్​!- IRCTC కొత్త అప్డేట్

2024లో లాంఛ్​ కానున్న టాప్​-10 ఈవీ కార్స్ ఇవే! వీటి రేంజ్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.