ETV Bharat / business

వరుసగా రెండోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర- ఎంతంటే? - LPG Cylinder Price Hiked Today

LPG Cylinder Price Hiked Today : ఎల్​పీజీ సిలిండర్ ధర స్పల్పంగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్​పై రూ.39 పెంచుతున్నట్లు చమురు మార్గెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

LPG Cylinder Price Hiked Today
LPG Cylinder Price Hiked Today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 7:00 AM IST

Updated : Sep 1, 2024, 9:01 AM IST

LPG Cylinder Price Hiked Today : కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ వినియోగదారులకు బ్యాడ్​ న్యూస్​! వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ ఆయిల్‌ మార్కెటింగ్​ కంపెనీలు నిర్ణయం తీసుకు‌న్నాయి. హోటల్స్​, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.39 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.

గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన నేపథ్యంలో, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.39 పెరిగి రూ.1691.50కు చేరుకుంది. అంతకుముందు ఆగస్టులో గ్యాస్ బండ ధరను రూ.6.5 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర అప్పుడు దిల్లీలో రూ.1,652.50గా మారింది. ఇప్పుడు మరో రూ.39 పెరగడం వల్ల రూ.1691.50కు చేరింది.

వ్యాపారులతోపాటు వాణిజ్య సంస్థలకు ఉపశమనం కల్పించేందుకు జులై 1న సిలిండర్ ధర రూ.30 తగ్గించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు, జున్ 1వ తేదీన రూ.69.50, మే1వ తేదీన రూ.19 తగ్గించాయి. అలా మూడు నెలలు కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించగా, ఇప్పుడు వరుసగా రెండు నెలల పాటు స్పల్పంగా పెంచాయి. అయితే ధరల పెంపు వెనుక కారణాలను చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించలేదు.

డొమెస్టిక్ గ్యాస్​ సిలిండర్​ ధరల్లో మార్పు లేదు
అయితే కొన్ని నెలలుగా ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయడం లేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50; హైదరాబాద్​లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ఉంది.

ఎల్​పీజీ సిలిండర్​ ధరలను ఎలా, ఎక్కడ చెక్​ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్​పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే, ఇండియన్ ఆయిల్​ అధికారిక వెబ్​సైట్​​ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్​సైట్​లో ఎల్​పీజీ ధరలతోపాటు, జెట్​ ఫ్యూయెల్​, ఆటో గ్యాస్​, కిరోసిన్​ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.

Last Updated : Sep 1, 2024, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.