NPCI New Rules For IMPS Transfer : మనం రోజూ జరిపే ఆర్థిక లావాదేవీలను ఆన్లైన్ పేమెంట్స్ వ్యవస్థ ఎంతో సులభతరం చేసింది. 24/7 అందుబాటులో ఉండే ఈ సిస్టమ్‌తో క్షణాల్లో పనులను చక్కబెట్టుకుంటున్న వారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ చెల్లింపులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), ఐఎంపీఎస్ విధానంలో ఇటీవల కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపే ప్రతిఒక్కరూ ఈ నిబంధనలను తప్పక తెలుసుకోవాలి.
తప్పనున్న తిప్పలు!
ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) విధానంలో కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలతో కేవలం రిసీవర్ మొబైల్ నంబర్‌తో పాటు అతడికి ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో ఆ బ్యాంకు పేరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డిస్ప్లే అవుతాయి. దీంతో కేవలం రెండే రెండు వివరాలతో మీకు కావాల్సిన వ్యక్తికి డబ్బును పంపుకోవచ్చు.
UPI New Guidelines 2024 : అంతకుముందు ఈ రకంగా నగదును బదిలీ చేసేందుకు ఎన్నో రకాల వివరాలు ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్ వివరాలతోపాటు ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను ఎంటర్ చేయడం వంటి సుదీర్ఘమైన ప్రక్రియ విధానం ఉండేది. అలాగే మొబైల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించే వినియోగదారులు మొబైల్ మనీ ఐడెంటీఫయర్ (బ్యాంకుల కస్టమర్లకు ఇచ్చే 7 అంకెల సంఖ్య)తో పాటు రిసీవర్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి వచ్చేది. అప్పుడే నగదు బదిలీ జరిగేది. ఇక వచ్చేనెల నుంచి రానున్న కొత్త రూల్స్‌తో ఈ ప్రాసెస్ లేకుండానే కేవలం మొబైల్ నంబర్, బ్యాంక్ పేరుతో మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.
ఇలా పనిచేస్తుంది!
ఇలా సులువుగా నగదును బదిలీ చేసేకన్నా ముందు ఎవరైతే డబ్బును పంపాలని అనుకుంటున్నారో వారి బ్యాంకు డిఫాల్ట్ ఎమ్ఎమ్ఐడీ(మొబైల్ మనీ ఐడెంటీఫయర్) సాయంతో అవతలి వ్యక్తి బ్యాంకుకు మ్యాప్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో కేవలం మొబైల్ నంబర్, బ్యాంక్ పేరును ఉపయోగించి నగదును స్వీకరించే వ్యక్తికి సంబంధించిన ధ్రువీకరణ సులభం అవుతుంది. ఇందుకోసం అవసరమైన UI/UX పునరుద్ధరణ వంటి చర్యలను తీసుకోవాలని ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవస్థ మొత్తం గడువులోగా వినియోగదారులు ఉపయోగించే మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ఛానల్స్‌లో అందుబాటులోకి రావాలని ఎన్పీసీఐ బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు ఆయా బ్యాంకులు ఫిబ్రవరి 1నుంచి అందిరికీ ఈ విధానం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాయి. దీంతో మరో రెండు రోజుల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.
అలా చేయకపోతే రిజెక్ట్ చేస్తారు!
ఒకవేళ మనం నగదు పంపాలనుకుంటున్న వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఒకే మొబైల్ నంబర్‌కి లింక్ అయి ఉంటే అన్న ప్రశ్నకు కూడా ఎన్పీసీఐ సమాధానం ఇచ్చింది. అప్పుడు రిసీవర్-ఎవరికైతే డబ్బును క్రెడిట్ చేయాలనుకుంటున్నామో వారి ప్రైమరీ లేదా డిఫాల్ట్ ఖాతాలోకి ఈ నగదు ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఈ డిఫాల్ట్ లేదా ప్రైమరీ ఖాతాను రిసీవర్ ముందుగా డిఫాల్ట్ బ్యాంక్‌గా దేన్నైతే ఎంచుకుంటాడో దాని ఆధారంగా దీనిని గుర్తిస్తారు. ఒకవేళ అతడు ఏదీ సెలెక్ట్ చేసుకోకపోతే లావాదేవీ రద్దవుతుంది. అంటే రిజెక్ట్ లేదా ఫెయిల్ అవుతుంది.
How To Transfer Money Through IMPS : IMPS ద్వారా డబ్బు బదిలీ చేయడం ఇలా!
- ముందుగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- మెయిన్ పేజీలో 'ఫండ్ ట్రాన్స్ఫర్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఫండ్ ట్రాన్స్ఫర్ కోసం 'IMPS' విధానాన్ని ఎంచుకోండి.
- లబ్ధిదారుడి లేదా రిసీవర్స్కి చెందిన మొబైల్ మనీ ఐడెంటీఫయర్(MMID)తో పాటు మీ మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్(MPIN)ను ఎంటర్ చేయండి.
- మీరు పంపాలనుకుంటున్న అమౌంట్‌ను టైప్ చేయండి.
- వివరాలన్నీ సమర్పించాక, 'Confirm'పై నొక్కండి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- దానిని ఎంటర్ చేయడంతో మీ లావాదేవీ విజయవంతంగా పూర్తవుతుంది.
గమనిక : IMPS ద్వారా మీరు గరిష్ఠంగా రూ.5లక్షల వరకు నగదును ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
క్రెడిట్ కార్డు మంచిదే అనడానికి 6 కారణాలు - మీకు తెలుసా?
స్కూటర్ కమ్ ఆటో రిక్షా- నిమిషాల్లోనే 2వీలర్ నుంచి 3వీలర్‌గా ఛేంజ్