ETV Bharat / business

టాటా ట్రస్ట్స్​​ ఛైర్మన్​గా నోయెల్ టాటా నియామకం - TATA TRUSTS NEW CHAIRMAN

Noel Tata Appointed Chairman Of Tata Trusts : రతన్ టాటా మరణించిన నేపథ్యంలో టాటా ట్రస్ట్స్​​ ఛైర్మన్​గా నోయెల్ టాటా నియమితులయ్యారు.

Noel Tata
Noel Tata (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 2:01 PM IST

Updated : Oct 11, 2024, 2:28 PM IST

Noel Tata Appointed Chairman Of Tata Trusts : టాటా గ్రూప్​నకు చెందిన దాతృత్వ విభాగం టాటా ట్రస్ట్స్​ ఛైర్మన్​గా నోయెల్ టాటా నియమితులయ్యారు. అక్టోబర్​ 11న ముంబయిలో జరిగిన సమావేశంలో ఆయన నియామకం ఏకగ్రీవంగా జరిగిందని సమాచారం. రతన్ టాటా మరణించిన నేపథ్యంలో ఆయన టాటా ట్రస్ట్స్ పగ్గాలు చేపట్టారు.

ఘనమైన వారసత్వం
రతన్ టాటాకు నోయెల్ టాటా సవతి సోదరుడు అవుతారు. ఆయన 2014 నుంచి ట్రెంట్​ లిమిటెడ్​కు ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. ఆ రిటైల్ దుస్తుల వ్యాపారన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు కూడా. గత దశాబ్ద కాలంలో నోయెల్​ హయాంలో సదరు కంపెనీ షేర్ విలువ 6000 శాతం పెరిగింది. దీనిని బట్టి అతని వ్యాపార దక్షత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇప్పటి వరకు టాటా ట్రస్టులు అన్నింటినీ రతన్​ టాటానే చూసుకునేవారు. కానీ ఆయన తన తరువాత ఎవరు వీటిని నడపాలో చెప్పకుండానే 86 ఏళ్ల వయస్సులో మరణించారు. దీనితో రతన్​ టాటా ఎప్పుడూ చెప్పే 'ముందుకు వెళ్తూనే ఉండాలి' (Moving On) విధానాన్ని అనుసరించి, టాటా గ్రూప్​ నోయెల్ టాటాను టాటా ట్రస్టులకు ఛైర్మన్​గా నియమించింది.​

నోయెల్ ప్రస్థానం

నోయెల్ టాటా 2010 నుంచి 2021 వరకు టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్​కు నాయకత్వం వహించారు. ఆ సమయంలో సదరు కమోడిటీ ట్రేడింగ్ సంస్థ ఆదాయం 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు పెరిగింది.

టాటా ట్రస్ట్స్ వైబ్​సైట్ ప్రకారం, నోయెల్ టాటా - టాటా స్టీల్ లిమిటెడ్​, వోల్టాస్ లిమిడెడ్​ సహా అనేక లిస్టెడ్​ టాటా సంస్థల బోర్డుల్లో మెంబర్​గా ఉన్నారు. అంతేకాదు ఆయన పిల్లలు - మాయ, నెవిల్లే, లేహ్ కూడా టాటాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలకు ధర్మకర్తలుగా ఉన్నారు.

నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. ఒక భార్య కుమారుడు రతన్ టాటా, సిమోన్ టాటా. మరో భార్య కుమారుడు నోయెల్ టాటా. ఈ విధంగా రతన్​ టాటాకు నోయెల్ టాటా సవతి సోదరుడు అవుతారు. ఇప్పటికే ఆయన రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్టు బోర్డుల్లో సభ్యునిగా ఉన్నారు. ఇప్పుడు వాటికి కూడా ఛైర్మన్ అయ్యారు.

Last Updated : Oct 11, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.