Next-Gen Maruti Swift Updates : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి త్వరలో నెక్ట్స్-జెన్ స్విఫ్ట్ కారును లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి ఈ కారును YED అనే కోడ్ నేమ్‌తో పిలుస్తోంది. ఈ అప్‌కమింగ్ స్విఫ్ట్ కారులో పలు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
Next-gen Maruti Swift Features : గ్లోబర్-స్పెక్ మారుతి స్విఫ్ట్ కారులోని ఫీచర్లు ఇవే!
- ఎల్ఈడీ హెడ్‌లైట్స్ & టెయిల్ లైట్స్
- ఎల్ఈడీ డీఆర్ఎల్స్
- 16 అంగుళాల అల్లాయ్ వీల్స్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్
- ఆటో హెడ్‌ల్యాంప్స్
- 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
- వైర్లెస్ యాపిల్ కార్ప్లే
- ఆండ్రాయిడ్ ఆటో
Next-gen Maruti Swift Safety Features : ఈ నెక్ట్స్-జెన్ మారుతి స్విఫ్ట్ కారులో చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే?
- 6-ఎయిర్ బ్యాగ్స్
- టైర్ ప్రెజర్ మోనిటర్
- ఏబీఎస్ విత్ ఈబీడీ
- బ్రేక్ అసిస్ట్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
- హిల్ హోల్డ్ కంట్రోల్
ADAS Features :
- లేన్ కీపింగ్ అసిస్ట్
- బ్లైండ్ స్పాట్ మోనిటర్
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
- లేన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ ప్రివెన్షన్. అయితే ఈ ADAS ఫీచర్స్ అన్నీ ఇండియన్-స్పెక్లో ఉంటాయా? లేదా? అనేది చూడాలి.
మోడ్రన్ స్టైలిష్ లుక్
Next-gen Maruti Swift Design : మారుతి సుజుకి కంపెనీ ఇప్పటికే జపాన్, యూరోప్‌ల్లో ఈ నెక్ట్స్-జెన్ సిఫ్ట్ కారును విడుదల చేసింది. దీనిని బట్టి ఇండియన్-స్పెక్ మోడల్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. విదేశాల్లో విడుదల చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్ కారును చూస్తే, డిజైన్‌లో విప్లవాత్మకమైన మార్పులు ఏమీ చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీని డిజైన్ ఫిలాసఫీలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మోడ్రన్ లుక్ వచ్చేలా తీర్చిదిద్దారు.
ఈ అప్‌కమింగ్ స్విఫ్ట్ కారు పాత మోడల్ కంటే 15 mm పొడవుగా, 40 mm ఇరుకుగా , 30mm ఎత్తుగా ఉంటుంది. దీని వీల్ బేస్ మాత్రం 2450 mm గానే ఉంది.
Next-gen Maruti Swift Launch Date : మారుతి సుజుకి కంపెనీ ఈ కొత్త తరం స్విఫ్ట్ కారును మరికొద్ది నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ మాత్రం లాంఛ్ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే కనుక విడుదలైతే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగోలకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.
Next-gen Maruti Swift Price : ప్రస్తుతం మారుతి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంది. అయితే అప్‌కమింగ్ హ్యాచ్‌బ్యాక్ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
రూ.6 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-5 మోడల్స్ ఇవే! - Best Cars Under 6 Lakh
రూ.70వేలు బడ్జెట్లో మంచి టూ-వీలర్ కొనాలా? టాప్-10 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Bikes Under 70000