Mukesh Ambani Car Collection : ముకేశ్ అంబానీ - ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జియో, రిలయన్స్ లాంటి పేర్లు వింటే చాలా ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఆయన ఆస్తి, వ్యాపారాలు, జీవిత విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మరి ఈ ఇండియన్ బిలియనీర్ గరాజ్ (Garage)లో ఉన్న కార్లు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?
ముకేశ్ అంబానీ చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు. ముంబయిలో అంబానీ నివాసముండే ఇల్లు 'యాంటిలియా' విలువ దాదాపు 2 బిలియన్ల డాలర్లు వరకు ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో అయితే చెప్పాలంటే సుమారు రూ.200 కోట్లు. అందులో అన్ని సౌకర్యాలూ ఉంటాయి. ఇంక కార్ల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరి బిలీనియర్స్ లాగే, అంబానీ అండ్ ఫ్యామిలీ కూడా లగ్జరీ కార్లను చాలా ఇష్టపడుతుంది, ఉపయోగిస్తుంది. సూపర్ కార్లను ప్రత్యేకంగా కలెక్ట్ చేస్తుంది కూడా.
స్పెషల్ కలెక్షన్
అంబానీ కారు కలెక్షన్స్‌లో సుమారు 170 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కలెక్షన్‌ను ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. వీటిని పార్క్ చేయడానికి తన 27 అంతస్తుల భవనంలో ప్రత్యేకంగా ఒక గరాజ్ కూడా ఉంది. ఆటోమొబైల్ ఔత్సాహికులు ఈ గరాజ్ను తరచుగా 'జియో గ్యారేజ్' అని పిలుస్తారు. ఇది ఇండియాలోనే అతి పెద్ద కార్ కలెక్షన్ రూమ్. ఇందులో ఉన్నన్ని కార్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దగ్గర కూడా లేవంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి.
జియో గరాజ్ ముంబయిలోని అంబానీ కుటుంబానికి చెందిన 27 అంతస్తుల నివాసంలో ఆరో అంతస్తులో ఉంది. ఇందులో అనేక రోల్స్ రాయల్స్, లంబోర్గినీ, బెంట్లీ, ఫెరారీ లాంటి విలాసవంతమైన కార్లతో పాటు, ఇండియాలో తయారైన కార్లు కూడా ఉన్నాయి. అంతెందుకు అంబానీ ఫ్యామిలీ భద్రతా సిబ్బందే నాలుగు మెర్సిడెస్-AMG G63 కార్లను ఉపయోగిస్తుంటారు. ఇవి అంబానీ కార్ల కాన్వాయ్‌లో తరచూ కనిపిస్తూ ఉంటాయి.
ముకేశ్ అంబానీ సూపర్ కార్ కలెక్షన్ :
1. మెర్సిడీస్ - మేబ్యాక్ బెంజ్ ఎస్660 గార్డ్
2. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే
3. ఫెరారీ SF90 స్ట్రాడేల్
4. మెర్సిడెస్-మేబ్యాక్ 62
5. ఆస్టన్ మార్టిన్ రాపిడ్
6. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్
7. లంబోర్గిని ఉరుస్
8. బెంట్లీ బెంటయ్గా
9. ఆర్మర్డ్ BMW 760Li సెక్యూరిటీ
హస్బెండ్ ఆఫ్ ది ఇయర్
గతేడాది ముకేశ్ అంబానీ తన భార్యకు విలాసవంతమైన 'రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్' కారును బహుమతిగా ఇచ్చారు. ఇప్పటి వరకు ఇండియాలోని ఒక భర్త తన భార్యకు ఇచ్చిన అత్యంత ఖరీదైన కారు ఇదే కావడం విశేషం. ఈ విధంగా ఆయన ప్రజల చేత హస్బెండ్ ఆఫ్ ది ఇయర్‌గా మన్ననలు అందుకున్నారు.
మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్-10 ఫీచర్స్ మస్ట్! - Car Buying Guide
త్వరలో విడుదల కానున్న టాప్-8 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes