ETV Bharat / business

మారుతీ సుజుకీ స్విఫ్ట్ బుకింగ్స్ షురూ- భారత్​లో లాంఛ్ ఎప్పుడంటే? - maruti suzuki swift new model 2024

Maruti Suzuki Swift 2024 Launch : మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ కారు ప్రీ బుకింగ్స్​ మొదలయ్యాయి. మరికొద్ది రోజుల్లో లాంఛ్ కానున్న ఈ కారు టోకెన్​ అమౌంట్ సహా ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Swift Booking :
Maruti Suzuki Swift Booking :
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 6:45 PM IST

Maruti Suzuki Swift 2024 Launch : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ స్విఫ్ట్​ నూతన మోడల్​ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోడల్​పై ఇప్పటికే చాలా బజ్​ ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ 2024 మోడల్ కారు లాంఛ్​కు ముందే ప్రీ బుకింగ్​ను ప్రారంభించింది. రూ.11 వేల టోకెన్​ అమౌంట్​తో ఆన్​లైన్​లో లేదా మారుతీ సుజుకీ ఎరీనా డీలర్​షిప్ షోరూమ్స్​లో ముందస్తు బుకింగ్​ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కాగా, ఈ మోడల్ కారు మే 9న మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు ఫీచర్లు, తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ కారును మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందిన ఒక ఐకానిక్ బ్రాండ్​గా అభివర్ణించారు ఆ కంపెనీ ఇండియా విభాగం మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ. 'మారుతీ సుజుకీ స్విఫ్ట్​కు 29 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ కారు అనేక అవార్డులు, ప్రశంసలు అందుకుంది. స్విఫ్ట్ 2024 మోడల్ కారు స్పోర్టీ లుక్​లో ఉంటుంది. ఇది తక్కువ ఉద్గారాలను విడుదల చేసి పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. స్విఫ్ట్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్​లో కొత్త బెంచ్‌ మార్క్​లను సెట్ చేస్తుంది' అని తెలిపారు.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 కారు ఫీచర్లు
మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ కారు అనేక రకాల వేరియంట్లతో పాటు పలు కలర్ ఆప్షన్లలో వస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ సరికొత్త హ్యాచ్​బ్యాక్ కొత్త గ్రిల్, బంపర్స్, అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటీనాతో పాటు మెరుగైన ఫ్రంట్ డిజైన్​​ను కలిగి ఉంటుంది. సీ-పిల్లర్​ పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్ ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్​ మోడల్​లోనూ కనిపిస్తాయి. కారు క్యాబిన్ లోపల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్​ బ్యాక్ ​1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సీఎన్​జీ వేరియంట్‌ సహా ఏఎమ్​టీ గేర్‌బాక్స్, మాన్యువల్​గా అందుబాటులో ఉంటుంది.

రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Bikes In 2024

సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనాలా? ఈ లాభ, నష్టాల గురించి తెలుసుకోండి! - Second Hand Luxury Car Buying Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.