ETV Bharat / business

కొత్త ఇంజిన్- 13రంగులు- మారుతి స్విఫ్ట్ నయా మోడల్ ఫీచర్లు అదుర్స్!

Maruti Suzuki New Swift 2024 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త మోడల్​ త్వరలో భారతీయ మార్కెట్‌లో లాంఛ్ కానుంది. అయితే స్విఫ్ట్‌ ఫోర్త్ జనరేషన్‌ హ్యాచ్‌బ్యాక్‌ను అనేక మార్పులతో తీసుకొస్తున్నారు. అవేంటంటే?

Maruti Suzuki New Swift 2024
Maruti Suzuki New Swift 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 7:19 PM IST

Updated : Feb 14, 2024, 7:47 PM IST

Maruti Suzuki New Swift 2024 : మారుతి సుజుకి స్విఫ్ట్‌ భారత్‌ మార్కెట్‌లో అత్యధికంగా విక్రయాలు కలిగి ఉన్న కార్లలో ఒకటిగా ఉంది. తొలిసారిగా ఈ కారును 2005 సంవత్సరంలో భారత మార్కెట్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఫోర్త్ జనరేషన్​ స్విఫ్ట్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తున్నారు.

మారుతి సుజుకి కొత్త జనరేషన్‌ స్విఫ్ట్‌ కారును ఇటీవలే జపాన్‌లో ఆవిష్కరించింది. భారత్​లో ఈ హ్యాచ్‌బ్యాక్‌ రోడ్‌టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆ మధ్య వైరల్ అయింది. ఈ సంవత్సరంలోనే మారుతి సుజుకి స్విఫ్ట్‌ భారత్ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న స్విఫ్ట్‌ను 2018లో విడుదల చేశారు. అయితే స్విఫ్ట్‌ ఫోర్త్​ జనరేషన్‌ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులతో తీసుకొస్తున్నారు.

ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ 13 రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఆ రంగులు ఇవే!

  1. ప్యూర్‌ వైట్‌ పెర్ల్ మెటాలిక్
  2. ప్రాంటియర్‌ బ్లూ పెర్ల్ మెటాలిక్
  3. బర్నింగ్ రెడ్ పెర్ల్ మెటాలిక్
  4. కారవాన్‌ ఐవరీ మెటాలిక్
  5. కూల్‌ ఎల్లో మెటాలిక్
  6. ఫ్లేమ్ ఆరెంజ్‌ పెర్ల్ మెటాలిక్
  7. ప్రీమియం సిల్వర్‌ మెటాలిక్
  8. స్టార్‌ సిల్వర్‌ మెటాలిక్
  9. సూపర్‌ బ్లాక్‌ పెర్ల్

దీంతో పాటు నాలుగు డ్యూయల్‌ టోన్ కలర్‌ ఆప్షన్లు సైతం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. అవేంటంటే?

  1. బ్లాక్ రూఫ్​తో బర్నింగ్ రెడ్‌ పెర్ల్ మెటాలిక్,
  2. బ్లాక్ రూఫ్​తో ఫ్రాంటియర్‌ బ్లూ పెర్ల్ మెటాలిక్
  3. గన్ మెటాలిక్ రూఫ్​తో కూడిన కూల్ ఎల్లో మెటాలిక్
  4. గన్ మెటాలిక్ రూఫ్​తో ప్యూర్‌ వైట్‌

కొత్త ఇంజిన్​
1.2 లీటర్‌ పెట్రోల్ 3-సిలిండర్‌ ఇంజిన్‌, 1.2 లీటర్‌ 3-సిలిండర్‌ పెట్రోల్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ వేరియంట్లతో కొత్త స్విఫ్ట్ అందుబాటులో ఉండనుంది. 80bhp శక్తి, 108Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్లు 5-స్పీడ్‌ మాన్యువల్‌, CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. భద్రతా పరంగా ఈ కొత్త స్విఫ్ట్‌ ADAS - అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్‌ సిస్టమ్‌, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ కొత్త జనరేషన్‌ స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ 265 లీటర్ల బూట్‌ స్పేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రస్తుతం సగటు విక్రయాలు నెలకు 18000 యూనిట్లుగా ఉన్నాయట. కొత్త కార్లు మార్కెట్‌లోకి వచ్చాక విక్రయాలు మరింత జోరందుకుంటాయని సంస్థ భావిస్తోంది.

జోరు పెంచుతున్న మారుతి సుజుకి - వరుసగా 8 కార్ల లాంఛింగ్​కు సన్నాహాలు!

మారుతి సుజుకీ, హ్యూందాయ్​ కార్లపై భారీ డిస్కౌంట్స్.. అప్పటి వరకే ఛాన్స్!

Last Updated : Feb 14, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.