ETV Bharat / business

క్రెడిట్ కార్డ్ రూల్స్ ఛేంజ్​ - జులై 1 నుంచే అమలు - ఇకపై ఆ బెనిఫిట్స్ లేనట్లే! - CREDIT CARD RULES CHANGE - CREDIT CARD RULES CHANGE

Credit Card Rules Change In July 2024 : క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక నిబంధనల్లో మార్పులు చేశాయి. వీటిలో రివార్డ్ పాయింట్ల తగ్గింపు నుంచి అదనపు ఛార్జీల వడ్డింపు వరకు ఎన్నో ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

credit card rule changes of big banks that will come into effect in July 2024
credit card rule changes in july 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 4:05 PM IST

Credit Card Rules Change In July 2024 : ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు నిత్యావసరంగా మారాయి. నేటి కాలంలో ట్రాన్సాక్షన్స్ చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు. అయితే ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చేశాయి. రివార్డు పాయింట్లలో, వాటి ప్రయోజనాల్లో సవరణలు చేశాయి. జులై నెలలోనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, సిటీ బ్యాంక్‌లు తమ క్రెడిట్​ కార్డ్​ రూల్స్​లో మార్పులు చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్​బీఐ కార్డ్​ : క్రెడిట్‌ కార్డు రివార్డ్స్ పాయింట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్​బీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే జులై 15 నుంచి ప్రభుత్వ లావాదేవీల కోసం ఉపయోగించే 22 రకాల ఎస్​బీఐ కార్డ్​ క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లు వర్తించవని తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ : ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విషయంలో కీలక నిబంధనలు తీసుకొచ్చింది. క్రెడిట్‌ కార్డు రీప్లేస్​మెంట్ ఛార్జీలను రూ.100 నుంచి రూ.200కు (ఎమరాల్డ్‌ కార్డు మినహా) పెంచింది. అదే సమయంలో చెక్‌/ క్యాష్‌ పికప్‌ ఫీజు, స్లిప్‌ రిక్వెస్ట్​పై చెరో రూ.100, డయల్‌-ఏ-డ్రాఫ్ట్‌ లావాదేవీ ఛార్జీ, ఔట్‌ స్టేషన్‌ చెక్‌ ప్రాసెసింగ్‌ ఫీజు, డూప్లికేట్ స్టేట్​మెంట్‌ రిక్వెస్ట్‌ వంటి వాటిపై ఛార్జీలను తొలగించింది. జులై 1 నుంచి ఈ క్రెడిట్ కార్డు నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

సిటీ బ్యాంక్‌ : సిటీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డులు త్వరలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలోకి రానున్నాయి. ముఖ్యంగా ఇవి జులై 15 నాటికి యాక్సిస్‌ బ్యాంక్​ ఆధీనంలోకి రానున్నాయి. అయితే కొత్త యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులు జారీ అయ్యేవరకు సిటీ బ్రాండ్‌ కార్డులు పనిచేస్తాయని యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అలాగే, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్​ల వచ్చిన రివార్డ్ పాయింట్లు ఎప్పటికీ ఎక్స్​పైర్‌ కావని, మైగ్రేషన్‌ తర్వాత మాత్రం మూడేళ్లకే రివార్డు పాయింట్లు ఎక్స్​పైర్‌ అవుతాయని యాక్సిస్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు : పేటీఎం, చెక్, మొబిక్విక్, క్రెడ్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్‌ల నుంచి చేసే రెంట్ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్​డీఎఫ్​సీ. రెంట్ పేమెంట్స్​పై ఒక శాతం చొప్పున ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ కొత్త ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఇకపై బ్యాంకులు పనిచేసేది 5 రోజులే! టైమింగ్స్ ఎలా ఉంటాయంటే? - Banks To Operate 5 Days A Week Soon

జియో Vs ఎయిర్‌టెల్‌ Vs వీఐ ప్లాన్స్ ధరలు పెంపు​ - ఇకపై వారికి మాత్రమే 5జీ! - JIO VS AIRTEL VS VI PLANS 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.