ETV Bharat / business

జీవిత బీమా తీసుకున్నారా? పరిహారం ఇవ్వకపోతే ఏం చేయాలో తెలుసా? - Life Insurance Claim Settlement - LIFE INSURANCE CLAIM SETTLEMENT

Life Insurance Claim Settlement Process : అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి జీవిత బీమా పాలసీలు కుటుంబాన్ని ఆదుకుంటాయి. అందుకే జీవిత బీమా లాంటి పాలసీ తీసుకునేందుకు ముందుకు వస్తారు. అయితే ఈ బీమా పాలసీలు తీసుకునే ముందు కంపెనీల క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ గురించి తెలుకోవడం మంచిది. బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో బీమా క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ ముఖ్యమైనది. క్లెయిం సెటిల్‌మెంట్స్‌ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Life Insurance Claim Settlement time
Life Insurance Claim Settlement Process
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 3:44 PM IST

Life Insurance Claim Settlement Process : జీవితం అనూహ్యమైంది. ఎప్పుడు ఏమి జరగుతుందో తెలియని పరిస్థితి. ఇలా ఊహించని ఘటనలు జరిగినప్పడు కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా మంది బీమా పాలసీలను కొనుగోలు చేస్తారు. పాలసీదారుడు మరణించినప్పుడు, అతని కుటుంబానికి లేదా నామినీలకు పరిహారం అందుతుంది. అయితే, జీవిత బీమా క్లెయిం సెటిల్‌మెంట్‌ అనేది బీమా కంపెనీ తన వినియోగదారులకు అందించే అత్యంత ముఖ్యమైన సేవలలో కీలకమైంది. వినియోగదారుల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత బీమా కంపెనీలకు ఉంటుంది. జీవిత బీమాయే కాకుండా ఏ బీమా విషయంలోనైనా పాలసీని కొనుగోలు చేసే ముందు, అధిక క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం మంచిది.

క్లెయిం ఎలా చేసుకోవాలి
ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే, నామినీ జీవిత బీమాకు సంబంధించిన అన్ని పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించాలి. అప్పుడు హామీ మొత్తం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ బీమా సంస్థ క్లెయిం మొత్తాన్ని పరిష్కరించలేకపోతే, అందుకు గల కారణాలను రాతపూర్వకంగా పాలసీదారులకు/నామినీలకు తెలియజేస్తుంది.

పాలసీదారుడు మరణిస్తే, ఆ విషయాన్ని వీలైనంత త్వరగా బీమా సంస్థకు తెలియజేయాలి. తరువాత పరిహారం కోసం, నామినీగా ఉన్న వ్యక్తి జీవిత బీమా సంస్థ సమీప బ్రాంచ్‌ను సందర్శించి క్లెయిల్ ఫారాన్ని తీసుకోవాలి. లేదా సదరు బీమా సంస్థ వెబ్‌సైట్​లో క్లెయిం ఫారాన్ని డౌన్​లోడ్ చేసుకోవాలి. నామినీ క్లెయిమ్​ దరఖాస్తులో పాలసీ నంబర్‌, పాలసీదారుని పేరు, మరణించిన తేదీ, స్థలం, లబ్దిదారుడి పేరు మొదలైన వివరాలను నమోదు చేయాలి. అలాగే పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా దాఖలు చేయాలి. ఒక వేళ పాలసీదారుడి మరణం పోలీసుల విచారణలో ఉన్నట్లయితే, దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, అధికారులు జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రం, పోస్ట్‌మార్టం నివేదిక కూడా అందించాలి.

బీమా పాలసీ తీసుకున్న 3 ఏళ్ల లోపునే, పరిహారం కోసం క్లెయిమ్​ చేస్తే, అది నిజమైన క్లెయిమ్​ అవునో, కాదో నిర్ధరించడానికి బీమా సంస్థ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుంది. అన్నీ క్లియర్​గా ఉంటే, పరిహారం చెల్లిస్తుంది. పాలసీదారుడు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం పరిహారం అందించదు.

క్లెయిం సెటిల్‌మెంట్‌ సమయం
క్లెయిం సెటిల్‌మెంట్‌ అనేది ఏ పాలసీదారుడు/నామినీకైనా చాలా ముఖ్యమైనది. పత్రాల సమర్పణ, సమాచారానికి సంబంధించిన కచ్చితత్వం, మరణానికి కారణం, క్లెయిం హామీ వంటి వివిధ అంశాల ఆధారంగా బీమా క్లెయింను సెటిల్‌ చేయడానికి 30 రోజుల నుంచి 180 రోజులు వరకు పట్టవచ్చు. IRDAI (పాలసీ హోల్డర్స్‌ ఇంట్రెస్ట్‌) 2002 రెగ్యులేషన్‌ 8 ప్రకారం, నామినీ నుంచి అన్ని డాక్యుమెంట్‌లను స్వీకరించిన తర్వాత, బీమా సంస్థ 30 రోజులలోపు క్లెయిమ్​ను పరిష్కరించాలి. కొన్ని సందర్భాల్లో మాత్రమే జీవిత బీమా సంస్థ విచారణ చేయవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు నామినీ రాతపూర్వకంగా క్లెయిమ్ చేసిన తరువాత, ఆరు నెలలలోపు బీమా సంస్థ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. బీమా ప్రొవైడర్‌ సమయ పరిమితిని పాటించడంలో విఫలమైతే, ఆలస్యమైన కాలానికి కూడా క్లెయిం మొత్తంపై వడ్డీని చెల్లించాలి.

సరైన అవగాహన ఉండాలి
చాలా సందర్భాల్లో ఆలస్యంగా క్లెయిమ్ చేయడం లేదా సరైన పత్రాలు సమర్పించకపోవడం వల్ల జీవిత బీమా క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు క్లెయిం సెటిల్ చేసే ముందు విచారణ చేస్తాయి. దాని వల్ల సెటిల్​మెంట్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకే బీమా పాలసీలు తీసుకునే ముందు కచ్చితంగా ప్రతి ఒక్కరూ క్లెయిం ప్రాసెస్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

హాట్ సమ్మర్​లో కూల్​గా కార్ డ్రైవ్ చేయాలా? ఈ టాప్​-5 AC మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే! - Car AC Maintenance Tips

ఫుల్​ ట్రాఫిక్​లో నీతాకు ముకేశ్​ అంబానీ లవ్​ ప్రపోజల్​- 'సమాధానం ఇస్తేనే కార్​ స్టార్ట్ చేస్తా' - Love Story

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.