ETV Bharat / business

40 ఏళ్లకే పెన్షన్ కావాలా? ఈ LIC పాలసీపై ఓ లుక్కేయండి! - LIC Saral Pension Plan - LIC SARAL PENSION PLAN

LIC Saral Pension Plan Benefits : మీరు భవిష్యత్ కోసం మదుపు చేద్దామని అనుకుంటున్నారా? మీకు 40 ఏళ్లు వచ్చిన వెంటనే పెన్షన్​ రావాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. 'ఎల్​ఐసీ సరళ్​ పెన్షన్' ప్లాన్​లో మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు. జీవితాంతం మీరు కోరుకున్నంత పెన్షన్ పొందవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

Investment tips
Investment tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 4:14 PM IST

LIC Saral Pension Plan Benefits : నేడు చాలా మంది ఎర్లీ రిటైర్​మెంట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు భవిష్యత్​లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించేందుకు మంచి పెట్టుబడి మార్గాలను వెదుకుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఎల్​ఐసీ ఒక అద్భుతమైన పెన్షన్​ ప్లాన్​ను తీసుకువచ్చింది. అదే ఎల్​ఐసీ సరళ్ పెన్షన్ యోజన.

సాధారణంగా ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చిన తరువాత మాత్రమే పింఛన్​ వస్తుంటుంది. కానీ ఈ ఎల్​ఐసీ సరళ్​ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి పెట్టినవారికి 40 ఏళ్లకే పెన్షన్ అందిస్తారు.

ప్రైవేట్ ఉద్యోగులకు వరం
రిటైర్మెంట్​ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఆందోళన చెందే ప్రైవేటు ఉద్యోగులకు ఈ ఎల్​ఐసీ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పెన్షన్‌ సౌకర్యం, ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఉండకపోవచ్చు. అందుకే ప్రైవేటు ఉద్యోగాలు చేసి రిటైర్‌ అయిన తర్వాత ఆదాయం లేక చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారి కోసమే ఈ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను డిజైన్‌ చేసింది ఎల్‌ఐసీ.

జీవితానికి పెన్షన్‌ ధీమా
ఎల్‌ఐసీ సరళ్​ పెన్షన్‌ యోజన​ ద్వారా గ్యారెంటీ పెన్షన్‌ పొందవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ఆదాయం వస్తుంది. పాలసీదారు మరణిస్తే, జీవిత భాగస్వామికి లేదా నామినీకి పూర్తి పరిహారం అందిస్తారు. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ స్కీమ్​లో చేరవచ్చు. మీ సౌలభ్యానికి తగ్గట్టు, ఎంత పెట్టుబడి పెట్టగలరో అంతమొత్తం పెట్టవచ్చు. పెట్టుబడులపై ఎలాంటి పరిమితులు లేవు. మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టు ప్లాన్‌ మార్చుకోవచ్చు.

రుణ సౌకర్యం
ఈ ప్లాన్‌ 40 నుంచి 80 ఏళ్ల వయసువారికి వర్తిస్తుంది. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలోనే ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించాలి. స‌ర‌ళ్ పెన్ష‌న్ ప్లాన్​తో పాల‌సీ జారీ అయిన వెంట‌నే పెన్ష‌న్ రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. పాలసీ ప్రారంభతేదీ నుంచి 6 నెలల తర్వాత సరెండర్ చేసుకోవచ్చు.

LIC Saral Pension Yojana Premium Chart : రెండు ర‌కాలుగా ఈ పాల‌సీని తీసుకోవ‌చ్చు. అందులో మొద‌టిది సింగిల్ లైఫ్ పాల‌సీ. దీనిలో పాల‌సీదారులు జీవించినంత కాలం వారికి పింఛ‌ను వ‌స్తుంది. వారు చ‌నిపోయిన త‌ర్వాత పరిహారం మొత్తాన్ని సంబంధిత నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. ఇక రెండోది జాయింట్ లైఫ్ పాల‌సీ. ఇది దంప‌తుల‌కు అనుకూలంగా ఉంటుంది. ఇందులోనూ పాల‌సీదారులు మరణించేవరకు పెన్ష‌న్ పొందుతారు. మ‌ర‌ణానంత‌రం వారి భాగ‌స్వామికి పింఛ‌ను వ‌స్తుంది. ఒక‌వేళ దంప‌తులిద్ద‌రూ మ‌ర‌ణిస్తే, డిపాజిట్ అమౌంట్​ను నామినీకి ఇస్తారు.

పెన్ష‌న్ ఆప్షన్స్​

  1. మినిమం పెన్ష‌న్ : ఈ ప‌థ‌కం కింద నెల‌కు క‌నీసం రూ.1000 పింఛ‌ను పొంద‌వ‌చ్చు.
  2. అపరిమిత పెన్ష‌న్ : ఈ ర‌కంలో పెన్ష‌న్ మొత్తానికి గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. పెట్టుబ‌డి మొత్తం మీద పింఛన్​ ఆధార‌ప‌డి ఉంటుంది. కనుక మీరు కోరుకున్నంత పెన్షన్ మీకు లభిస్తుంది.
  3. ఫ్రీక్వెన్సీ : మీరు నెల‌వారీగా లేదా 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చొప్పున పింఛను తీసుకోవచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 42 ఏళ్ల ఒక వ్య‌క్తి రూ.30 ల‌క్ష‌ల విలువైన యాన్యుటీ కొనుగోలు చేస్తే, అత‌ను నెల‌కు సుమారు రూ.12,500 పింఛ‌ను రూపంలో పొందుతాడు.

OPS Vs NPS Vs UPS- ఉద్యోగులకు ఈ మూడింట్లో ఏ పెన్షన్​ స్కీమ్ బెటర్? - Govt Pension Schemes

మీకు ఉద్యోగం లేదా? కానీ పెన్షన్ కావాలా? ఈ గవర్నమెంట్ స్కీమ్​పై ఓ లుక్కేయండి! - Atal Pension Yojana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.