ETV Bharat / business

'కైనెటిక్ ఇ-లూనా'కు గట్టి పోటీ ఇస్తున్న టాప్​-2 వెహికల్స్ ఇవే! - Kinetic E Luna Vs Rivals Comparison

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 3:12 PM IST

Kinetic E-Luna : భారతదేశంలో కమర్షియల్​ వెహికల్స్​లో కైనెటిక్ ఇ-లూనాకు ఎదురులేదనే చెప్పవచ్చు. అయితే తాజాగా దీనికి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. ఒకినావా డ్యూయల్-100, ఒడిస్సే ట్రోట్​లు కూడా ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మరి ఈ మూడు బండ్లలో ఏది బెస్ట్ ఛాయిస్ అవుతుందో చూద్దామా?

Kinetic E-Luna Vs Okinawa Dual-100 And Odysse Trot
Kinetic E-Luna vs rivals comparison

Kinetic E-Luna : ఇండియన్​ ఎలక్ట్రిక్ వెహికల్​ మార్కెట్లో కైనెటిక్ ఇ-లూనాకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది చాలా సింపుల్​ లుక్​తో ఉంటుంది. కానీ ఎక్కువ వస్తువులను, అధిక బరువులను సులువుగా మోసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. అందుకే చిరు వ్యాపారులు ఎక్కువగా ఈ కైనెటిక్ ఇ-లూనాను కొనేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అందుకే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్​లో దీనికి తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం దీనికి ఒకినావా డ్యూయల్-100, ఒడిస్సే ట్రోట్​ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ఈ మూడింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో చూద్దామా?

డిజైన్​, డైమెన్షన్​
Kinetic E-Luna Vs Rivals : Design And Dimension
కైనటిక్ ఇ-లూనా, ఒకినావా డ్యూయెల్​-100, ఒడిస్సే ట్రోట్​ల డిజైన్ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ వీడి మోపెడ్​లు చాలా భిన్నంగా ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్స్, స్ప్లిట్ సీట్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్రమ్ బ్రేక్స్​తో, చిరు వ్యాపారులు ఉపయోగించుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి.

డైమెన్షన్ఇ-లూనాడ్యూయల్-100ట్రోట్
పొడవు1985 mm1788 mm1820 mm
వెడల్పు735 mm700 mm700 mm
ఎత్తు1036 mm1120 mm1100 mm
గ్రౌండ్ క్లియరెన్స్170 mm205 mm180 mm
లోడింగ్ కెపాసిటీ150 kg150 kg250 kg

Kinetic E-Luna Vs Rivals : Features
కైనెటిక్ ఇ-లూనాలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 16-ఇంఛ్​ వైర్-స్పోక్ వీల్స్, హాలోజన్ లైట్లు ఉంటాయి. ఒకినావా డ్యూయెల్​-100లో కూడా ఇదే విధమైన ఫీచర్లు ఉంటాయి. కానీ దీనిలో ఒడిస్సే ట్రోట్​లాగా అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అలాగే దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-ఇంఛ్​ వీల్స్ ఉంటాయి.

Kinetic E-Luna Vs Rivals : Battery Specifications
ఈ మూడు ఎలక్ట్రిక్ వెహికల్స్​లో వేర్వేరు సామర్థ్యాలు కలిగిన బ్యాటరీలు ఉన్నాయి. కనుక వీటి వేగం, డ్రైవింగ్ రేంజ్​ల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు బండ్లలో డ్యూయెల్-100లో పెద్ద బ్యాటరీ ప్యాక్​ ఉంది. అందువల్ల ఇది టాప్​ స్పీడ్​, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్​లను అందిస్తుంది. అయితే ఒడిస్సే ట్రోట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

మోడల్ఇ-లూనాడ్యూయల్-100ట్రోట్
బ్యాటరీ టైప్లిథియం-అయాన్లిథియం-అయాన్లిథియం-అయాన్
బ్యాటరీ కెపాసిటీ2 కిలోవాట్స్​3.12 కిలోవాట్స్​1.92 కిలోవాట్స్​
టాప్ స్పీడ్50 కి.మీ/గంట60 కి.మీ/గంట25 కి.మీ/గంట
రేంజ్110 కి.మీ129 కి.మీ75 కి.మీ
ఛార్జింగ్ టైమ్​ 4 గంటలు6 గంటలు3.5 గంటలు

Kinetic E-Luna Vs Rivals : Price

  • మార్కెట్లో కైనెటిక్ ఇ-లూనా ధర సుమారుగా రూ.69,990 నుంచి రూ.74,990 వరకు ఉంటుంది.
  • మార్కెట్లో ఒకినావా డ్యూయల్-100 ధర సుమారుగా రూ.1,19,085 ఉంటుంది.
  • మార్కెట్లో ఒడిస్సే ట్రోట్​ ధర సుమారుగా రూ.99,999 ఉంటుంది.

మీరు టూ-వీలర్స్​ నడుపుతుంటారా? ఈ టాప్​-10 రోడ్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే! - Road Safety Tips For Bike Riders

మీ కారు లైఫ్​​ టైమ్​​ పెరగాలా? అయితే ఈ సింపుల్ టిప్స్​ పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.