ETV Bharat / business

ఓటీటీ లవర్స్​కు గుడ్ న్యూస్​ - రూ.299కే జియో సినిమా ప్రీమియం​ - 4కె స్ట్రీమింగ్ + నో యాడ్స్​! - JioCinema 299 Plan - JIOCINEMA 299 PLAN

JioCinema 299 Premium Annual Plan : ఓటీటీ లవర్స్​కు గుడ్ న్యూస్. రిలయన్స్ జియో రూ.299లకే యాన్యువల్ ప్రీమియం ప్లాన్​ను అందిస్తోంది. దీనిని సబ్​స్క్రైబ్ చేసుకున్నవాళ్లు 4కె రిజల్యూషన్​తో, ఎలాంటి యాడ్స్​ లేకుండా ప్రీమియం కంటెంట్​ను ఆస్వాదించవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

JioCinema New Premium Annual Plan
JioCinema 299 Premium Annual Plan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 3:40 PM IST

JioCinema 299 Premium Annual Plan : ఓటీటీ లవర్స్​కు గుడ్ న్యూస్. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో ఓటీటీ లవర్స్​ కోసం ఓ సరికొత్త ప్రీమియం యాన్యువల్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను తీసుకువచ్చింది. గతంలో రూ.999 ప్రైస్​తో అందించిన యాన్యువల్ ప్లాన్​ మాదిరి బెనిఫిట్సే ఈ నయా ప్లాన్​లోనూ ఉంటాయి.

JioCinema 299 Plan Benefits
ఈ ప్లాన్ ద్వారా యాడ్ ఫ్రీ ప్రీమియం కంటెంట్​ను ఆస్వాదించవచ్చు. స్పోర్ట్స్​, లైవ్ ప్రోగ్రామ్​ల్లో మాత్రం ప్రకటనలు వస్తాయి. ఈ ప్లాన్ సబ్​స్క్రైబ్ చేసుకున్నవారు ఒక డివైజ్​లో 4కె రిజల్యూషన్​లో వీడియోలు చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్​ను ప్రత్యేక తగ్గింపు ధరతో అందిస్తున్నారు. త్వరలో దీని ధరను రూ.599కు పెంచే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అది రూ.999 కంటే తక్కువగానే ఉండనుంది.

జియో సినిమా వెబ్​సైట్ ప్రకారం, ఈ రూ.299 ప్రీమియం ప్లాన్ తీసుకున్నవారు, తమకు నచ్చిన ప్రీమియం కంటెంట్​ను డౌన్​లోడ్ చేసుకుని, వీలునప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతం జియో సినిమా ప్రీమియంలో హెచ్​బీఓ, పీకాక్​, వార్నర్స్​ బ్రదర్స్​, పారమౌంట్​లకు చెందిన ప్రీమియం సినిమాలు, వెబ్​సిరీస్​లు అందుబాటులో ఉంటాయి.

స్పోర్ట్స్​, లైవ్ ప్రోగ్రామ్​ల పరిస్థితి ఏమిటి?
ఈ రూ.299 ప్రీమియం ప్లాన్ తీసుకున్నవారు స్పోర్ట్స్​, లైవ్ ప్రోగ్రామ్​లు ఆస్వాదించవచ్చు. కానీ అందులో ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఇంత డబ్బులు పెట్టలేకపోతే, రూ.29లకే నెలవారీ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. దీనిని రెన్యువల్ చేసుకున్నప్పుడు మాత్రం రూ.59లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా రూ.299 చెల్లించి యాన్యువల్ ప్రీమియం ప్లాన్ తీసుకోవడమే బెటర్​.

ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు!
JioCinema Family Plan : జియోసినిమాలో ఒక మంత్లీ ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంది. దీని ధర కేవలం రూ.89 మాత్రమే. ఈ ప్లాన్ తీసుకున్నవాళ్లు ఒకేసారి 4 డివైజ్​ల్లో ప్రీమియం కంటెంట్​ను చూడవచ్చు. ప్రస్తుతానికి నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్​ స్టార్​లు అందిస్తున్న ప్లాన్స్ కంటే, జియోసినిమా ప్రైమ్ అందించే ప్లాన్స్​ చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

లార్జ్​ క్యాప్ Vs మిడ్​ క్యాప్ Vs స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Different Mutual Funds

ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్​ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.