ETV Bharat / business

'ITR ఫైలింగ్ గడువు పొడిగించలేదు - జులై 31లోగా రిటర్నులు సమర్పించాల్సిందే' - ఐటీ డిపార్ట్​మెంట్​ - ITR Filing Last Date 2024 - ITR FILING LAST DATE 2024

ITR Filing Last Date 2024 Not Extended : గత ఆర్థిక సంవత్సరానికిగాను (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ జులై 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల రోజుల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.

ITR filing last date 2024 not extended
ITR filing (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 10:51 AM IST

ITR Filing Last Date 2024 Not Extended : గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల(ITR)ను ఈ జులై 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కనుక ఇలాంటి తప్పుడు వార్తలను పన్ను చెల్లింపుదారులు నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొంది. గడువు తేదీ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో, పన్ను చెల్లింపుదారులు అందరూ సాధ్యమైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని సూచించింది. ట్యాక్స్​ పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని పేర్కొంది. ఒక వేళ గడువు తేదీలోగా ఐటీఆర్ సమర్పించకపోతే సెక్షన్‌ 234ఏ కింద వడ్డీతోపాటు, సెక్షన్‌ 234ఎఫ్‌ ప్రకారం అపరాధ రుసుము కూడా వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కూడా ట్యాక్స్ పేయర్స్​ కోల్పోతారని పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు 26ఏఎస్, ఏఐఎస్‌ (వార్షిక సమాచార నివేదిక)లను విధిగా తనిఖీ చేసుకోవాలని సూచించింది.

సందేశాలతో జాగ్రత్త : ఆదాయపు పన్ను రీఫండు కోసం ఎదురుచూస్తున్న వారికి, కొన్ని నకిలీ సందేశాలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. ఇలాంటి అనుమానాస్పద సందేశాలను నమ్మొద్దని సూచించింది. రీఫండు కోసం బ్యాంకు ఖాతా వివరాలు పేర్కొనాలని, ఓటీపీలు చెప్పాలని ఫోన్లు వస్తుంటాయని, వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఇ-వెరిఫై చేయండి : ఇప్పటికే దాదాపు 4.6 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ట్యాక్స్​ పోర్టల్‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో 4.2 కోట్ల మంది ఇప్పటికే తమ రిటర్నులను ఈ-వెరిఫై చేసుకున్నారు. 1.8 కోట్ల రిటర్నులను ప్రాసెస్‌ చేసినట్లు ఐటీ విభాగం పేర్కొంది.

ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా?
ITR filing process : మీరు మొదటిసారిగా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేద్దామని అనుకుంటే అందుకు ఒక ప్రొసీజర్​ ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​లో కచ్చితంగా రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పోర్టల్​లో​ మీ పేరు మీద ఒక అకౌంట్​ను క్రియేట్​ చేసుకోవాలి. తరువాత ఆదాయ పన్ను రిటర్నులను ఈ-ఫైలింగ్​ చేయాలి. అయితే 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఈ-ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది. వీళ్లు ఆఫ్​లైన్​లో ఐటీఆర్​ దాఖలు చేసుకోవచ్చు.

నిపుణుల సహాయం తీసుకోవచ్చు!
ఒక వేళ మీకు స్వయంగా ఐటీఆర్​ దాఖలు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే, ఛార్టర్డ్​ అకౌంటెంట్​ లేదా టాక్స్​ ఎక్స్​పర్ట్​ సహాయం తీసుకోవచ్చు. లేదా ప్రైవేట్​ టాక్స్​ ఫైలింగ్​ పోర్టల్స్​, మధ్యవర్తుల ద్వారా కూడా ఐటీఆర్​ ఫైల్​ చేసుకోవచ్చు.

ఐటీఆర్​ ఎవరు దాఖలు చేయాలి?
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, కచ్చితంగా ఐటీఆర్​ దాఖలు చేయాల్సిందే.

నష్టాలను కూడా రిపోర్ట్ చేయండి
ఒక వేళ ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఆర్థికంగా నష్టపోయినా కూడా కచ్చితంగా గడువు ముగిసే లోపు ఐటీఆర్​ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఈ సంవత్సరం వచ్చిన నష్టాలను, తదిపరి సంవత్సరాల్లో వచ్చే ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. మీ క్రెడిట్ కార్డు బిల్లులు, విదేశీ పర్యటనల ఖర్చు పరిమితికి మించి ఉన్నా కూడా ఐటీఆర్​ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నా, లేదా విదేశాల నుంచి ఆదాయాన్ని సంపాదించి ఉన్నా కూడా కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ-ఫైలింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి?
How to register ITR online : కొత్తగా ఐటీఆర్​ ఫైల్​ చేద్దామని అనుకునే వాళ్లు ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి.

  • స్టెప్​ 1 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​ https://www.incometax.gov.in/iec/foportal/ ను ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 2 : న్యూ యూజర్​ - రిజిస్టర్​ టాబ్​పై క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 3 : 10 అంకెల పర్మినెంట్​ అకౌంట్​ నంబర్​ (పాన్​) ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 4 : పాన్​ వెరిఫికేషన్​ అయిన తరువాత, 'వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు​'గా నిర్ధరణ చేసుకోవాలి.
  • స్టెప్​ 5 : పాన్​ కార్డులో ఉన్న విధంగా మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. మీ పేరు, ఇంటి పేరు, లింగం, చిరునామా తదితర వివరాలు ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 6 : మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్​ అడ్రస్​ ఎంటర్​ చేయాలి. వీటి ద్వారా వెరిఫికేషన్​ ప్రక్రియ జరుగుతుంది.
  • స్టెప్​ 7 : ఫోన్ నంబర్​, ఈ-మెయిల్​ ఇచ్చిన తరువాత 'పాస్​వర్డ్' సెట్​ చేసుకోమని అడుగుతుంది. ఇందుకోసం మీ మొబైల్​, ఈ-మెయిల్​కు రెండు ఓటీపీలు వస్తాయి. వీటిని సరిగ్గా ఎంటర్​ చేస్తే.. మీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి అవుతుంది.

భద్రత కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్​ను ఏర్పాటు చేసుకోండి
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చాలా సున్నితమైన, ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మీ పాన్​, ఆధార్​ నంబర్లు, బ్యాంకు ఖాతా సమాచారం, టాక్స్​ మినహాయింపులు, గత ఆదాయ పన్ను రిటర్నులు మొదలైన విలువైన సమాచారం ఉంటుంది. వీటి వివరాలు ఇతరులకు తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి. అందుకే భద్రత కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్​ను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఈ-ఫైలింగ్​ వాల్ట్​ ఎనేబుల్​ చేసుకోవడం వలన అకౌంట్​లోకి లాగిన్ అయ్యే ప్రతిసారీ ఓటీపీ వస్తుంది. దీని వల్ల ఇతరులు ఎవ్వరూ అనధికారికంగా మన ఖాతాను యాక్సిస్​ చేయకుండా నిరోధించవచ్చు.

ఈ-వాల్ట్​ ఫెసిలిటీ ఎనేబుల్​ చేసుకోవడానికి ముందుగా 'ప్రొఫైల్​ సెట్టింగ్స్​'లోకి వెళ్లాలి. తరువాత 'ఈ-ఫైలింగ్ వాల్ట్​- హైయ్యర్​ సెక్యూరిటీ' ఆప్షన్​ను ఎంచుకోవాలి. మరింత భద్రత కోసం నెట్​ బ్యాంకింగ్​, డిజిటల్​ సిగ్నేచర్​ సర్టిఫికేట్​లను యాక్సెస్​ చేయడానికి ఆధార్​ లింకేజీతో ఓటీపీ జనరేట్ అయ్యే విధంగా ఆప్షన్​ ఎంచుకోవాలి.

అదనపు సమాచారం అప్​డేట్ చేసుకోవచ్చు
భద్రతా ప్రమాణాలు అన్నీ ఎనేబుల్​ చేసుకున్న తరువాత, 'యువర్ ప్రొఫైల్​' సెక్షన్​లోకి వచ్చి, మీ వ్యక్తిగత వివరాలు అన్నీ మళ్లీ సరిచూసుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త సమాచారం ఉన్నా దానిని అప్​డేట్​ చేసుకోవచ్చు. లేదా ఉన్న సమాచారాన్ని మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అలాగే ఆదాయ పన్ను శాఖ నుంచి మీకు వచ్చే రిఫండ్​ ఏ బ్యాంకు అకౌంట్​లో జమ చేయాలో కూడా మీరు ఇక్కడే నిర్ధరించవచ్చు.

  • ఆదాయ పన్ను శాఖ పోర్టల్​లో మీ డీమ్యాట్​ అకౌంట్ వివరాలు, డిజిటల్​ సిగ్నేచర్​ సర్టిఫికేట్ వివరాలు కూడా నమోదు చేసుకోవచ్చు. కానీ ఇలా నమోదు చేయడం తప్పనిసరేమీ కాదు.
  • ఒక వేళ మీరు ఐటీఆర్​ దాఖలు చేయడానికి ఛార్టర్డ్ అకౌంటెంట్​ లేదా మధ్యవర్తి సహాయం తీసుకోవాలని అనుకుంటే, వారి వివరాలు కూడా ఈ ఖాతాలో పొందుపరచవచ్చు.
  • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ ఖాతాను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి ఇతర వ్యక్తులను మీ ప్రతినిధులుగానూ చేర్చుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఇతరుల ఖాతాను పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు వారి అనుమతి కూడా పొందవచ్చు.

చాలా ఉపయోగాలు ఉన్నాయి
Benefits of ITR filing : ఆదాయపన్ను శాఖ వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐటీఆర్​ దాఖలు చేయడమే కాదు, మునుపటి పన్ను రిటర్నులు, ఫారమ్ 26ఏఎస్​, యాన్యువల్​ ఇన్ఫర్మేషన్​ స్టేట్​మెంట్​ (ఏఐఎస్​)లను కూడా డౌన్​లోడ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఐటీఆర్​/ఫారమ్​ల ధ్రువీకరణ, ఈ-ప్రొసీడింగులు, ఆధార్​ ద్వారా ఇన్​స్టంట్​​ పాన్​ (ఈ-పాన్​) పొందవచ్చు. అలాగే ఆదాయ పన్ను సంబంధిత సైబర్​ నేరాలపై ఫిర్యాదు చేసి, పరిష్కారం పొందవచ్చు. మరీ ముఖ్యంగా రీఫండ్​ ప్రాసెసింగ్​, లోపాల సవరణ, కరెక్షన్​ ఆఫ్​ డిమాండ్​, అప్పీల్​ ఆర్డర్స్​, పాన్​ సంబంధిత దరఖాస్తులు, అస్సెసింగ్​ ఆఫీసర్​ (ఏవో) వద్ద పెండింగ్​లో ఉన్న ఇతర దరఖాస్తుల సమస్యలను కూడా ఈ అకౌంట్​ ద్వారా పరిష్కరించుకోవచ్చు.

ఫారం-16 లేకుండా ITR దాఖలు చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To File ITR Without Form 16

ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​ కోసం రూ.లక్ష బడ్జెట్​లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.