ETV Bharat / business

సుకన్య సమృద్ధి యోజన Vs ఈక్విటీ ఫండ్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్​! - Investment Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 12:06 PM IST

Investment Tips In Telugu : మీ కుమార్తె భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడులు పెడితే సరిపోతుందా? లేదా ఈక్విటీ ఫండ్లలోనూ ఇన్వెస్ట్ చేయాలా? ఈ రెండింట్లో దేనిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Equity Funds
Sukanya Samriddhi yojana (ETV Bharat)

Investment Tips In Telugu : పెట్టుబడులు పెట్టేవారు మంచి రాబడిని కోరుకుంటుంటారు. అయితే అన్నింట్లోనూ మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పలేం. అందుకే మీ పిల్లల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులు పెడితే సరిపోతుందా? లేదంటే ఈక్విటీ ఫండ్స్​లోనూ ఇన్వెస్ట్ చేయాలా? సుకన్య సమృద్ధి యోజన స్కీమ్​లో ఎంత మెచ్యూరిటీ వస్తుంది? ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెడితే ఎంత రాబడి పొందొచ్చు? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రిస్క్ లేని ఇన్వెస్ట్​మెంట్​
సుకన్య సమృద్ధి యోజన పథకంలో 10 ఏళ్ల లోపు వ‌య‌సున్న ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. దీంట్లో ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ ప‌థ‌కంలో 15 ఏళ్ల పాటు పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. 21 ఏళ్ల తరువాత అది మెచ్యూరిటీ అవుతుంది. 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత‌, పాప ఉన్న‌త చ‌దువుల కోసం సుకన్య సమృద్ధి యోజన నిధి నుంచి 50 శాతం మొత్తాన్ని విత్​డ్రా చేసుకోవ‌చ్చు. ఉదాహరణకు మీరు ఏడాదికి రూ.1.50 లక్షలు చొప్పున డిపాజిట్ చేశారనుకుందాం. 15 ఏళ్ల తర్వాత రూ.45 లక్షల కార్పస్ ఏర్పడుతుంది. అదే 21 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత అయితే 8.2శాతం వడ్డీ రేటుతో అది రూ.69లక్షలు-రూ.70 లక్షలు అవుతుంది. ప్రస్తుతానికి ఇది చాలా పెద్ద మొత్తంగా అనిపించివచ్చు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, భవిష్యత్​లో ఇది మీ అమ్మాయి ఆర్థిక అవసరాలకు సరిపడకపోవచ్చు.

ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే!
రాబోయే 15 ఏళ్లలో భారత్​లో ద్రవ్యోల్బణం 8-10 శాతం ఉంటుందని ఓ అంచనా. కానీ సుకన్య సమృద్ధి యోజన పథకంపై వచ్చే రాబడి 8 శాతం మాత్రమే. అందువల్ల ద్రవ్యోల్బణం ప్రభావం మీపై పడుతుంది. అందుకే సుకన్య సమృద్ధి స్కీమ్​తోపాటు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే కనీసం 12శాతం వరకు రాబడిని పొందొచ్చు! సుకన్య సమృద్ధి యోజనలో ఏడాదికి రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయడం వల్ల 15 ఏళ్ల తరువాత రూ.45 లక్షల కార్పస్ ఏర్పడుతుంది. అదే ఈక్విటీ ఫండ్లలో నెలవారీ సిప్ రూ.12,500 (ఏడాదికి రూ.1.50 లక్షలు) ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత 12 శాతం రాబడితో రూ.63 లక్షల నిధి ఏర్పడుతుంది.

ఏది బెటర్?
సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వ పథకం కనుక మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. పైగా పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. కనుక దీనిలో కచ్చితంగా మదుపు చేయాలి. అదే సమయంలో భవిష్యత్ ఆర్థిక అవసరాలు, రాబడి కోసం, ద్రవ్యోల్బణం బారిన పడకుండా ఉండడం కోసం, ఈక్వీటీ ఫండ్లలోనూ కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలి. అంటే మీ పోర్ట్​ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే 75 శాతం వరకు ఈక్విటీ ఫండ్లలో, మిగిలిన 25 శాతాన్ని సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయాలి. మీరు బ్యాలెన్సెడ్ ఇన్వెస్టర్ అయితే రెండింట్లోనూ సమానంగా పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. మీరు సాంప్రదాయ పెట్టుబడిదారు అయితే రిస్క్ లేని సుకన్య సమృద్ధిలో ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టాలి. ఇలా మీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేసుకొని, మీ పాపకు మంచి ఆర్థిక భరోసా కల్పించవచ్చు.

నెలకు రూ.5వేలు పెట్టుబడితో రూ.42లక్షల ఆదాయం - PPF స్పెషల్ స్కీమ్​! - PPF Special Scheme

ఎలాంటి గొడవలు లేకుండా ఆస్తులు పంచిపెట్టాలా? వీలునామా రాయండిలా! - How To Prepare Will Deed

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.