ETV Bharat / business

ఎన్నికల ముందు బడ్జెట్​లో వరాల జల్లు! మోదీ సర్కార్​ ప్లాన్​ ఏంటి? - 2024 budget tax deduction

Interim Budget 2024 Expectations In Telugu : 2024 ఏప్రిల్​-మే నెలల్లో లోక్​సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్​పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం పలు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

nirmala sitharaman Interim Budget
Interim Budget 2024 expectations
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 1:32 PM IST

Updated : Jan 26, 2024, 1:38 PM IST

Interim Budget 2024 Expectations : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు, ఈ మధ్యంతర బడ్జెట్లో వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎలక్షన్​ కమిషన్​ మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి పథకాలను మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టకూడదు. కానీ మోదీ ప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు, కచ్చితంగా కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కాస్త ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం ఉంది.
  2. 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడమే లక్ష్యమని మోదీ ప్రభుత్వం చెప్పవచ్చు.
  3. ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తూనే, పన్నుల భారం తగ్గించడానికి, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలను, వాటికి కావాల్సిన నిధులను కేటాయించవచ్చు.
  4. మౌలిక సదుపాయాల కల్పన కోసం మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్​, విద్యుత్ వాహనాలు, బ్రాడ్​బ్యాండ్​ విస్తరణ మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చు.
  5. మోదీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆహారం, ఎరువుల సబ్సిడీ కోసం రూ.4 లక్షల కోట్లు కేటాయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది! మధ్యంతర బడ్జెట్​లో ఈ కేటాయింపులు చేయకపోయినప్పటికీ, తమ లక్ష్యం ఇదేనని చెప్పే అవకాశం ఉంది.
  6. పేదలకు తక్కువ ధరలో గృహ వసతి కల్పించేందుకు, మోదీ ప్రభుత్వం బడ్జెట్లో 15 శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. బహుశా దీని కోసం మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలు వరకు కేటాయించవచ్చు.
  7. మోదీ సర్కార్​ ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.510 బిలియన్స్ సమీకరించాలని భావిస్తోంది. దీనిని కూడా బడ్జెట్లో పొందుపరిచే అవకాశం ఉంది.

సామాన్యులు ఏం కోరుకుంటున్నారు?

పన్ను తగ్గింపు : ప్రస్తుత పన్ను స్లాబ్‌ల ప్రకారం, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఇన్​కం టాక్స్​ రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. అయితే ఈ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు ఆశిస్తున్నారు.

ప్రామాణిక తగ్గింపు : పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను తట్టుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక మినహాయింపు పరిమితి (స్టాండర్డ్​ డిడక్షన్​)ను రెట్టింపు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000 ఉంది. దీనిని రూ.1 లక్ష వరకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు.

ఆర్థిక లోటు తగ్గింపు : భారతదేశ ఆర్థిక లోటును 50.7 బేసిస్ పాయింట్ల వరకు అంటే సుమారుగా రూ.9.07 లక్షల కోట్లకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇది మధ్యంతర ఉత్తర్వు కనుక, వీటికి తగినంత కేటాయింపులు చేస్తారో, లేదో చూడాలి.

ఆయుష్మాన్ భారత్​ : పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్​ హెల్త్ ఇన్సూరెన్స్​ స్కీమ్​ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. అయితే 2024 మధ్యంతర బడ్జెట్లో ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.

మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెడతారు?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్​న్యూస్- ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్

Last Updated : Jan 26, 2024, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.