Income Tax Return Filing : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఉన్న తుది గడువు 2024 జులై 31. అంటే ఐటీఆర్ దాఖలు చేయడానికి ఇంకా 45 రోజుల సమయం మాత్రమే ఉంది. పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం నిర్ణయించిన ట్యాక్స్ స్లాబ్ రేట్ల ప్రకారం ఆదాయపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాత ట్యాక్స్ రెజిమ్, కొత్త ట్యాక్స్ రెజిమ్ అనే రెండు రకాల పన్ను చెల్లింపు విధానాలు ఉన్నాయని ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు గుర్తుంచుకోవాలి. ఈ రెండింటికి వేర్వేరు ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి.
పాత పన్ను చెల్లింపు విధానానికి ప్రత్యామ్నాయంగా, కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1 (2020-2021 ఆర్థిక సంవత్సరం) నుంచి కొత్త ట్యాక్స్ రెజిమ్‌ను తీసుకొచ్చింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల(HUF)కు చెందిన పన్ను చెల్లింపుదారులు సులభంగా ట్యాక్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో, కొత్త పన్ను విధానాన్ని డీఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్గా ప్రకటించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.
కొత్త పన్ను విధానం
ఈ కొత్త పన్ను విధానం వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(HUFs), అసోషియేషన్ ఆఫ్ పర్సన్స్(AOPs) వంటి వారికి ఒకే విధంగా వర్తిస్తుంది. రెండు రకాల పన్ను విధానాలు ఉన్న నేపథ్యంలో, పన్ను చెల్లింపుదారులు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఆ విషయాన్ని తమ యాజమాన్యానికి తెలియజేయాలి. ఒక వేళ తమ యాజమాన్యానికి తెలపకపోతే, ఆటోమెటిక్‌గా కొత్త పన్ను విధానం ప్రకారంగా డిడక్షన్స్‌ను ప్రాసెస్ చేస్తారు. అయితే ఈ కొత్త పన్ను విధానానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. హెచ్ఆర్ఏ, ఎల్‌టీఏ సహా సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపులు ఉండవు. ఇవి పాత పన్ను విధానంలో మాత్రం ఉంటాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ స్లాబ్‌లు :
- రూ.3 లక్షల వరకు - ఎలాంటి పన్ను వర్తించదు
- రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు - రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 5% చెల్లించాలి.
- రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు - రూ.15,000 + రూ.6 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 10% చెల్లించాలి.
- రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు - రూ.45,000 + రూ.9లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 15% చెల్లించాలి.
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు - రూ.90,000 + రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 20% చెల్లించాలి.
- రూ.15 లక్షలకు మించి ఆదాయం ఉంటే - రూ.1,50,000 + రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను చెల్లించాలి.
కొత్త పన్ను విధానం మినహాయింపు జాబితా
- దివ్యాంగుల రవాణా అలవెన్సులు w.r.t.
- రవాణా భత్యం
- ప్రయాణం/ పర్యటనలు/ బదిలీ పరిహారం
- వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ మినహాయింపులు u/ సెక్షన్ 10(10C)
- గ్రాట్యుటీ మొత్తం u/ సెక్షన్ 10(10)
- లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ u/ సెక్షన్ 10(10AA)
- అగ్నివీర్ కార్పస్ ఫండ్ u/ సెక్షన్ 80CCH(2)లో డిపాజిట్లపై తగ్గింపులు
పాత పన్ను విధానం
పాత పన్ను విధానంలో హెచ్ఆర్ఏ, లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA)లపై, సెక్షన్‌లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) ప్రకారం ఇతర మినహాయింపులు ఉన్నాయి.
- రూ.2.5 లక్షల వరకు - ఎలాంటి పన్ను వర్తించదు.
- రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు - 5% పన్ను
- రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు - 20% పన్ను
- రూ.10 లక్షలకు మించి ఆదాయం ఉంటే - 30% పన్ను చెల్లించాలి.
రిస్క్ లేకుండా భారీ లాభాలు ఇచ్చే మార్కెట్ ఇదే! మీరూ ఓ లుక్కేయండి! - What Is Debt Market
రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh