ETV Bharat / business

బ్యాంక్​ నుంచి లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Things to Check Before Taking Loan

Important Things To Know Before Taking Loan In Telugu : మీరు వ్యక్తిగత అవసరాల కోసం లేదా ఇళ్లు, వాహనాల కోసం బ్యాంక్​ లోన్స్​ తీసుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకుంటే మీపై వడ్డీ భారం పెరుగుతుంది. పైగా సకాలంలో రుణం చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయంటే?

Personal Loan Tips
Important Things to Know Before Taking Loan
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 12:12 PM IST

Important Things To Know Before Taking Loan : ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. వ్యక్తిగత అవసరాల కోసం, ఇల్లు, వాహనాల కోసం చాలా మంది రుణాలు తీసుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే, నేడు తేలిగ్గానే బ్యాంక్ లోన్స్ లభిస్తున్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే!
బ్యాంక్ లోన్స్ తీసుకునే ముందు, దానిని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందా? లేదా? అనేది అంచనా వేసుకోవాలి. మీ ప్రస్తుత ఆదాయం, దైనందిన ఖర్చులు, అత్యవసర ఖర్చులు, బాధ్యతలు మొదలైన వాటిని ఆధారంగా చేసుకొని, మీరు సకాలంలో రుణాలను తీర్చగలరా? లేదా? అనేది చూసుకోవాలి.

సాధారణంగా మనకు వచ్చే నికర ఆదాయంలో 40-50 శాతం మన దైనందిన, అత్యవసర ఖర్చుల కోసం అయిపోతుంది. ఇలా ఉంటే, మన ఆర్థిక పరిస్థితి బాగున్నట్టే లెక్క. అందువల్ల బ్యాంకులు మన రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలు ఉంటాయి. కనుక, బ్యాంక్​ లోన్​ కోసం అప్లై చేసే ముందు, మన ఖర్చులు 40 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.

క్రెడిట్ స్కోర్ పెంచుకోవాల్సిందే!
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్స్ ఇచ్చే ముందు, రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరును కచ్చితంగా చూస్తాయి. ముఖ్యంగా మీ క్రెడిట్‌ రిపోర్టులోని క్రెడిట్‌ స్కోరు, ఇప్పటికే కొనసాగుతున్న రుణ ఖాతాలు, పొదుపు ఖాతాలు, సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తాయి. ఒక వేళ మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, రుణాలు మంజూరు చేయడానికి ఇష్టపడవు. అందువల్ల బ్యాంక్​ లోన్​కు అప్లై చేసేముందు, మీ క్రెడిట్ స్కోర్​ను చెక్ చేసుకోవడం మంచిది.

నేడు చాలా సంస్థలు ఉచితంగా నెలవారీ క్రెడిట్‌ రిపోర్టును అందిస్తున్నాయి. ఒక వేళ మీకు క్రెడిట్ హిస్టరీ లేకపోతే, కొత్త క్రెడిట్ కార్డు తీసుకుని, దాన్ని నిర్మించుకోవచ్చు. కనీసం రెండు, మూడేళ్లపాటు క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లిస్తూ ఉంటే, మంచి క్రెడిట్ స్కోర్​ సాధించడానికి వీలవుతుంది. సాధారణంగా క్రెడిట్​ స్కోర్ 750 పాయింట్లు కంటే ఎక్కువ ఉంటే, సులువుగా రుణాలు లభించే వీలుంటుంది

అవసరం కోసం మాత్రమే!
మీరు అత్యవసరం అయితేనే బ్యాంకు లోన్​ కోసం అప్లై చేయాలి. అలాగే తక్కువ వడ్డీ రేటుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ఇచ్చే బ్యాంకుల గురించి తెలుసుకోవాలి. అలాగే రుణ వాయిదాల విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే సంస్థలను ఎంచుకోవాలి. అప్పుడే మీకు ఆర్థికంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది.

చాలా మంది హోమ్​ లోన్​ కోసం కేవలం బ్యాంకులను మాత్రమే ఆశ్రయిస్తుంటారు. కానీ గృహరుణ సంస్థలు, బ్యాంకింగేతర రుణ సంస్థలు తక్కువ వడ్డీతో, మంచి ప్రయోజనాలతో లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక, వాటిపైనా దృష్టి పెట్టాలి.

అవసరానికి మించి వద్దు!
చాలా మంది తమకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. మీకు ఎంత అవసరం ఉంటుందో, అంత వరకే రుణం తీసుకోవడం మంచిది. ఎందుకంటే అప్పు తీసుకున్నపుడు, దానికి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఏ లక్ష్యం లేకుండా అప్పు తీసుకుంటే, అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది తప్ప, ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు.

షరతులు చూసుకోవాలి!
బ్యాంక్​ లోన్ తీసుకునే ముందు, అవి విధించే షరతులు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. లేకుంటే తరువాత ఇబ్బందిపడాల్సి వస్తుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ విచక్షణ మేరకు ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి. సాధారణంగా రుణగ్రహీత వయస్సు, నికర ఆదాయం, ఆస్తులు, ఆర్థిక స్థితిగతులు మొదలైన అంశాలను చూస్తాయి. ఒక వేళ మీకు రుణం తీర్చే సామర్థ్యం లేదని భావిస్తే, లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. కనుక ఈ విషయాలను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.

రూ.15 వేలలోపు బ్రాండెడ్‌ సైకిళ్లు ఇవే - ఓ లుక్కేయండి!

మీ ఫాస్టాగ్​ KYC అయిందో లేదో డౌటా? ఇలా చెక్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.