ETV Bharat / business

ABS టూ TCS- కారులో మస్ట్​గా ఉండాల్సిన టాప్​ 10 సేఫ్టీ ఫీచర్స్ ఇవే! - IMPORTANT CAR SAFETY FEATURES

కారులో ఉండాల్సిన టాప్​-10 సేఫ్టీ ఫీచర్లు ఇవే!

Important Car Safety Features
Important Car Safety Features (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2024, 7:36 PM IST

Important Car Safety Features : కారులో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అంతా సురక్షితంగా ప్రయాణించగలరనేది నిజం. ఈ నేపథ్యంలో కారులో ఉండాల్సిన టాప్​ 10 సేఫ్టీ ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

  1. యాంటీ- లాక్​ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) :
    సడెన్​గా బ్రేక్స్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా 'యాంటీ-లాక్​ బ్రేకింగ్ సిస్టమ్​' (ఏబీఎస్​) అడ్డుపడుతుంది. దీని వల్ల డ్రైవర్​ స్టీరింగ్​ను ఈజీగా​ కంట్రోల్​ చేయడానికి వీలవుతుంది. వెహికల్ స్కిడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
  2. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) :
    ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ) అనేది వాహనం స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. మలుపులు తిరిగేటప్పుడు, జారుడుగా ఉన్న రోడ్లపై వెళ్లేటప్పుడు ఈఎస్​సీ కారుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది.
  3. ఎయిర్​ బ్యాగ్స్​ :
    కారుకు అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ ఎయిర్​బ్యాగ్స్​ డ్రైవర్​కు గాయాలు కాకుండా కాపాడతాయి. ఇప్పుడు దాదాపు అన్ని మోడల్ కార్లలో ఆరు ఎయిర్​ బ్యాగ్స్ ఉంటాయి. ఇవి కారు లోపల ఉన్న ప్రయాణికులకు రక్షణనిస్తాయి.
  4. సీట్​ బెల్ట్​ :
    మీరు కొనే కారులో కచ్చితంగా ప్రీటెన్షనర్స్​తో ఉన్న సీట్​ బెల్ట్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రీటెన్షనర్స్​ ఉన్న సీట్​ బెల్ట్​లు ఆటోమెటిక్​గా బిగుతుగా మారతాయి. ప్రయాణికులు కారు ముందు భాగాన్ని ఢీకొనే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
  5. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) :
    వీల్ స్పిన్​ కాకుండా 'ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్​' (టీసీఎస్​) కాపాడుతుంది.
  6. ఎలక్ట్రానిక్​ బ్రేక్​-ఫోర్స్​ డిస్ట్రిబ్యూషన్​ (EBD) :
    ఎలక్ట్రానిక్​ బ్రేక్​-ఫోర్స్​ డిస్ట్రిబ్యూషన్​ (ఈబీడీ) అనేది చక్రాల మధ్య బ్రేకింగ్ ఫోర్స్​ను పంపిణీ చేస్తుంది. దీని వల్ల కారు బ్రేకింగ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసి, బండి స్థిరంగా ఉండేలా చేస్తుంది.
  7. టైర్​ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) :
    కారు టైర్లలో సరిపోయినంత ప్రెషర్ లేనప్పుడు టైర్​ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​)​ వెంటనే డ్రైవర్​ను హెచ్చరిస్తుంది. దీని వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. వాహనం కూడా భద్రంగా ఉంటుంది.
  8. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్​/ కెమెరా :
    కాస్త ఇరుకైన ప్రదేశాల్లో కారు పార్కింగ్ చేసేటప్పుడు రివర్స్ పార్కింగ్ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాదచారులను లేదా అడ్డంకులను కారు ఢీకొనే ప్రమాదం తగ్గుతుంది.
  9. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEB) :
    ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ముందుగానే వాహనం ఢీకొనే ప్రమాదాన్ని గుర్తించి ఆటోమేటిక్​గా బ్రేక్​లు వేస్తుంది. దీంతో భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
  10. లేన్ డిపార్చర్​ వార్నింగ్ సిస్టమ్ (LDW) :
    మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా లేన్ నుంచి బయటకు వెళ్తే లేన్ డిపార్చర్​ వార్నింగ్ సిస్టమ్​ (ఎల్​డీడబ్ల్యూ) డ్రైవర్​ను అలర్ట్ చేస్తుంది. వాహన ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.