ETV Bharat / business

చేతిలో డబ్బులు లేవా? డోంట్ వర్రీ - 'క్యాష్​ లెస్ ట్రీట్​మెంట్' చేసే ఆసుపత్రులు ఇవే! - Importance Of Network Hospitals - IMPORTANCE OF NETWORK HOSPITALS

Importance Of Network Hospitals In Health Insurance : మీ చేతిలో ప్రస్తుతానికి డబ్బులు లేవా? కానీ అత్యవసరంగా వైద్య చికిత్స తీసుకోవాలా? అయితే ఇది మీ కోసమే. మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే నెట్​వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్​ లెస్​ ట్రీట్​మెంట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Importance of Network Hospitals
Health Insurance (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 12:59 PM IST

Importance Of Network Hospitals In Health Insurance : నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉండడం చాలా అవసరం. మారుతున్న జీవనశైలి కారణంగా ఊహించని వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. కొన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే వైద్య ఖర్చులను కవర్‌ చేయడానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా నెట్​వర్క్​ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న బీమా పాలసీని తీసుకోవాలి. దీని వల్ల సమయానికి చేతిలో డబ్బు లేకపోయినా, నెట్​వర్క్ హాస్పిటల్స్​లో నాణ్యమైన నగదు రహిత చికిత్సలు పొందడానికి వీలవుతుంది.

నగదు రహిత చికిత్స :
నెట్​వర్క్ హాస్పిటల్స్​ పాలసీదారులకు నగదు రహిత చికిత్సలను అందిస్తాయి. ఎందుకంటే, ఈ ఆస్పత్రులు బీమా కంపెనీలతో టై-అప్‌ అయి ఉంటాయి. అందువల్ల పాలసీదారులు బీమా క్లెయిమ్స్‌ చేసుకోవడం చాలా సులభం. ఎలా అంటే, పాలసీదారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే, పాలసీ నిబంధనలకు, షరతులకు లోబడి పేషెంట్‌ బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రికి చెల్లిస్తుంది. కనుక డబ్బు గురించి పాలసీదారులు భయపడాల్సిన అవసరం ఉండదు.

నాణ్యమైన వైద్య చికిత్స కోసం :
ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సంబంధించిన వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాస్తవానికి మీకు ఇచ్చిన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్​లో, బీమా సంస్థ వెబ్​సైట్​లో నెట్​వర్క్ ఆసుపత్రుల లిస్ట్ ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో నాణ్యమైన వైద్య చికిత్సను పొందే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ రోగాల చికిత్స కోసం హాస్పిటల్​లో చేరాల్సివస్తే, బెస్ట్ ట్రీట్​మెంట్ ఇచ్చే నెట్‌వర్క్‌ ఆసుపత్రిని ఎంపిక చేసుకునే వీలుంటుంది.

‘టీపీఏ’ ఫారం తప్పనిసరి :
నగదు రహిత చికిత్సను పొందేందుకు హాస్పిటల్​లో చేరిన రోగి ‘టీపీఏ’ (థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్​)కు ఒక ఫారం ఇవ్వాలి. ఆసుపత్రి కనుక మీ క్లెయిమ్​ను ధ్రువీకరిస్తే, మీరు నగదు రహిత చికిత్స పొందడానికి అర్హులు అవుతారు. అప్పుడు నిబంధనలకు లోబడి రోగి చికిత్స ఖర్చులన్నింటీనీ బీమా సంస్థనే చెల్లిస్తుంది. కనుక డిశ్చార్జ్‌ సమయంలో పాలసీదారులు ఎలాంటి బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే పాలసీ పత్రంలో కవర్‌ చేయని చికిత్సలు ఏమైనా చేసుకుంటే, వాటికైన అదనపు ఖర్చులను బీమా సంస్థ చెల్లించదు.

నాన్‌-నెట్‌వర్క్‌ హాస్పిటల్ :
నెట్​వర్క్ ఆసుపత్రుల లిస్ట్​లో లేని వాటన్నింటినీ ‘నాన్‌-నెట్‌వర్క్‌ హాస్పిటల్స్’ అంటారు. నెట్‌వర్క్‌ హాస్పిటల్​లో అనారోగ్యానికి సంబంధించిన చికిత్స సదుపాయం లేకపోయినప్పుడు, కచ్చితంగా ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఎమర్జెన్సీలో నాన్‌-నెట్‌వర్క్‌ హాస్పిటల్​లో జాయిన్ కావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో నాన్‌-నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో బిల్లులన్నీ ముందుగా పాలసీదారులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత బిల్లులకు సంబంధించిన పేపర్లు, డిశ్చార్జ్ సమ్మరి, తదితర పత్రాలను బీమా కంపెనీకి సమర్పించాలి. అప్పుడు బీమా కంపెనీ పాలసీదారులకు రీయింబర్స్​మెంట్ ఇస్తుంది. సరైన పేపర్స్ అందించకపోతే క్లెయిం తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు నెట్​వర్క్ హాస్పిటల్స్​లో చేరడమే మంచిది.

బెస్ట్ స్కీమ్​ - రోజుకు రూ.13 కడితే చాలు - జీవితాంతం నెలకు రూ.5000 పెన్షన్! - Atal Pension Yojana

బంగారు నగలు కొనాలా? ఆభరణాల ధరలను ఎలా లెక్కించాలో తెలుసుకోండిలా! - Gold Jewellery Cost Calculation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.