ETV Bharat / business

క్రెడిట్ స్కోర్ మోసాలకు చెక్​ పెట్టండిలా! లేదంటే మీ అకౌంట్​ బ్యాలెన్స్​ మాయం! - Howto Avoid Credit Score Scams - HOWTO AVOID CREDIT SCORE SCAMS

Howto Avoid Credit Score Scams : బ్యాంకులు లేదా రుణ సంస్థలు లోన్స్​ ఇచ్చే ముందు కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్​ను పరిశీలిస్తాయి. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతోనే రుణాలు ఇస్తాయి. క్రెడిట్ స్కోరు తక్కువ ఉన్నవారి లోన్ దరఖాస్తును తిరస్కరించొచ్చు. లేదంటే రుణంపై అధిక వడ్డీ వేస్తాయి. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ స్కామ్​లు పెరిగిపోయాయి. వాటి నుంచి బయటపడడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Howto Avoid Credit Score Scams
Howto Avoid Credit Score Scams (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 8:11 PM IST

Howto Avoid Credit Score Scams : ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణాలు పొందాలంటే, క్రెడిట్ స్కోర్ తప్పనిసరి అయిపోయింది. బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులను, రుణం తీర్చే సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క వేస్తున్నాయి. అందువల్ల బ్యాంకులు మీకు సులువుగా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. పైగా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తాయి. అదే మీకు మంచి క్రెడిట్ స్కోర్ లేకపోతే, మీ దరఖాస్తును తిరస్కరిస్తాయి. లేదంటే ఎక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని ఇస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ స్కామ్‌లు పెరిగిపోయాయి. వాటిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ స్కామ్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ బ్యాంకు అకౌంట్​లోని నగదును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవరికిపడితే వారికి ఇవ్వకూడదు. ఊదాహరణకు : అజయ్ అనే వ్యక్తి క్రెడిట్ స్కోర్ 550 ఉందనుకోండి. అతడు హోమ్ లోన్ కోసం ప్లాన్ చేస్తుండడం వల్ల తన పేలవమైన క్రెడిట్ స్కోరును మెరుగుపర్చుకోవాలని ఆలోచిస్తాడు. అప్పుడు మూడు నెలల్లోనే 200 పాయింట్ల క్రెడిట్ స్కోర్ పెరిగేలా చేస్తామనే హామీతో కొన్ని బోగస్ సంస్థల నుంచి లింక్ రావొచ్చు. అందుకు అడ్వాన్స్ గా రూ.20 వేలు చెల్లించమని ఆ లింక్​లో అడుగుతారు. అప్పుడు క్రెడిట్ స్కోరు పెరుగుతుందని వారు అడిగిన మొత్తంలో కడితే మోసపోయినట్లే. ఎందుకంటే క్రెడిట్ స్కోరు అనేది మీరు చేసే ఆర్థిక లావాదేవీల ఆధారంగా పెరుగుతుంది. సకాలంలో లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం వంటి వాటి వల్ల మెరుగుపడుతుంది. ఇలా బోగస్ సంస్థలకు డబ్బులు కడితే క్రెడిట్ స్కోరు పెరగదనే విషయం గుర్తుంచుకోవాలి.

క్రెడిట్ స్కోర్ స్కామ్‌ లను నివారించడానికి మార్గాలు :

అధికారిక ఛానెల్‌
క్రెడిట్ స్కోరును పొందడం కోసం సిబిల్, ఈక్వాఫిక్స్, ఎక్స్ పీరియన్ వంటి అధీకృత క్రెడిట్ బ్యూరోల అధికారిక ఛానెల్ ఆశ్రయించండి. ఈ ఏజెన్సీలు చట్టబద్ధమైన, కచ్చితమైన క్రెడిట్ నివేదికలను అందిస్తాయి.

ఆ ఆఫర్ల పట్ల జాగ్రత్త సుమా
క్రెడిట్ స్కోర్ మెరుగుపరుస్తామని ఇచ్చే అయాచిత ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫోన్ కాల్స్, ఈ-మెయిల్, మెసేజ్ పంపినా స్పందించొద్దు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు.

మీ క్రెడిట్ రిపోర్ట్​ను చేక్ చేసుకోండి
ఏవైనా అనధికార లావాదేవీలు, మోసాలను గుర్తించడానికి మీరు మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. మీరు ఏడాదికొకసారి ప్రధాన క్రెడిట్ బ్యూరోల నుంచి ఉచిత క్రెడిట్ నివేదికకు తీసుకోండి.

ఆ హామీని నమ్మొద్దు
మీ క్రెడిట్ స్కోర్​ను వెంటనే మెరుగుపరుస్తామని హామీ ఇచ్చే కంపెనీలకు దూరంగా ఉండండి. మీ క్రెడిట్ హిస్టరీ ఆధారంగానే మీ స్కోరు మెరుగుపడుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి.

అప్డేట్​గా ఉండండి
క్రెడిట్ స్కోర్ స్కామ్​ల కోసం సైబర్ నేరగాళ్లు ఉపయోగించే కొత్త వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ సమాచారాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.

పర్సనల్ డేటా జాగ్రత్త
బ్యాంకు, యూపీఐ వంటివాటికి బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ లను పెట్టుకోండి. అపరిచిత వ్యక్తులతో మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దు.

వెంటనే ఫిర్యాదు చేయండి
మీరు క్రెడిట్ స్కోర్ స్కామ్‌ కు గురైనట్లు గుర్తించితే వెంటనే ఏజెన్సీకి ఫిర్యాదు చేయండి.

తరచుగా క్రెడిట్ నివేదికను తనిఖీ చేయడం మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందా?
తరచుగా క్రెడిట్ స్కోరును చేసినా క్రెడిట్ స్కోరుపై ఎటువంటి ప్రభావం చూపదు. నిజానికి ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్‌ ని చెక్ చేసుకోవడం మంచిది.

మీ క్రెడిట్ స్కోర్‌ ను ఎలా మెరుగుపరచుకోవచ్చు?
సకాలంలో చెల్లింపులు చేయడం, బాకీ ఉన్న రుణాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో(CUR)ని మెయింటెన్ చేస్తే క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.