How To Verify Tenant Aadhar Card : ప్రస్తుత కాలంలో అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా, స్కూల్, కాలేజీ అడ్మిషన్లు ఇలా ప్రతి విషయానికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన ఆధార్ కార్డులో బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సమాచారం ఉంటుంది. అందుకే ఇల్లును అద్దెకు ఇచ్చేవారు, భూముల రిజిస్ట్రేషన్ సమయంలో యజమానులు ఆధార్ కార్డు అడుగుతారు. అప్పుడు విక్రయదారులు ఇచ్చిన ఆధార్ కార్డు ఒరిజినల్ దో కాదో తెలుసుకోవడం ఎలాగో తెలుసా?
ఇంటి యజమానికి కొందరు నకిలీ ఆధార్ కార్డును ఇస్తారు. మరికొందరు డూప్లికేట్ కార్డులను సృష్టించి మోసం చేస్తారు. ఇలాంటివి అరికట్టాలంటే వారు ఇచ్చిన ఆధార్ కార్డు అసలైనదో కాదో తెలుసుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను పడాల్సి ఉంటుంది. అందుకే మీ మొబైల్ లోన్ మీ ఇంట్లో అద్దెకు ఉండేవారు ఇచ్చిన ఆధార్ కార్డు ఒర్జినల్ దా కాదా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటంటే?
- మొదట మీ ఫోన్ లో యూఐడీఏఐ అభివృద్ధి చేసిన mAadhaar యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఆధార్ సంబంధిత సేవలను పొందడానికి ఉపయోగపడుతుంది.
- ఆ తర్వాత ఆధార్ కార్డును వెరిఫై చేయడానికి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా, మరొకటి ఆధార్ నంబర్‌ను మాన్యువల్‌గా నమోదు చేయడం ద్వారా వెరిఫై చేసుకోవచ్చు.
- ఆధార్ కార్డ్‌ను ధ్రువీకరించడానికి అత్యంత సులువైన మార్గం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం. అందుకే యాప్ డ్యాష్ బోర్డ్ నుంచి QR కోడ్ స్కానర్ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు నిజమైనదా కాదా అని నిర్ధరిస్తూ దానికి సంబంధించిన వివరాలను చూపుతుంది.
- మీరు ఆధార్ నంబరును నేరుగా ధ్రువీకరించడానికి మొదట మీరు బ్రౌజర్లో UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత 12 అంకెల ప్రత్యేక సంఖ్యను ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డు వెరిఫై అవుతుంది.
ఈ దశలను అనుసరించడం ద్వారా, మీ ఇంట్లో అద్దెకు నివసించేవారు అందించిన ఆధార్ కార్డ్ నిజమైనదో కాదో తెలుసుకోవచ్చు. మోసాల నుంచి బయటపడొచ్చు.
అలర్ట్ - ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్కు మరో 2 రోజులే ఛాన్స్! - Aadhaar Card Free Update Deadline