How To Use Reward Points To Pay Credit Card Bill : బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు తాము జారీ చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లు అందిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రివార్డు పాయింట్లు వివిధ రకాలుగా ఉంటాయి. కస్టమర్లు తాము సంపాందించిన ఈ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. వోచర్స్, క్యాష్ బ్యాక్స్, ఎయిర్ మైల్స్‌గా వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని సంస్థలు ఈ రివార్డ్ పాయింట్లను నేరుగా క్యాష్‌గా మార్చుకునే అవకాశం కల్పిస్తాయి. ఈ నగదును మీరు నేరుగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.
రివార్డ్ పాయింట్లతో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయండిలా!
మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లు అయితే, దానిలో రివార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చుకునే ఫీచర్ ఉందో, లేదో చెక్ చేసుకోండి. ఒక వేళ అది రివార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చుకునే అవకాశం కల్పిస్తూ ఉంటే, దానిని జారీ చేసిన బ్యాంక్ లేదా సంస్థకు చెందిన రిడంప్షన్ పోర్టల్‌లోకి వెళ్లండి. మీ రివార్డ్ పాయింట్లను క్యాష్ రూపంలోకి మార్చుకోండి. ఈ నగదుతో తరువాతి నెలలో మీరు చెల్లించాల్సిన క్రెడిట్ బిల్లును తీర్చేయండి. అంతే సింపుల్!
రివార్డ్ పాయింట్లను ఎలా లెక్కిస్తారు?
బ్యాంకులు లేదా కార్డు జారీ సంస్థలు తాము అందించే క్రెడిట్ కార్డులపై భిన్నమైన రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌లు అమలు చేస్తూ ఉంటాయి. కనుక అవి అందించే రివార్డ్ పాయింట్లలో చాలా తేడాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బ్యాంకు రెండు రకాల ట్రావెల్ కార్డులు జారీ చేసింది అనుకుందాం. అప్పుడు ఒక రకమైన కార్డుపై మీరు చేసిన ఖర్చుపై 2 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. మరో కార్డుపై కేవలం 1 రివార్డ్ పాయింట్ మాత్రమే అందిస్తుంది. ఇది సదరు బ్యాంక్ ఇష్టం. కనుక మీరు క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందే ఎక్కువ రివార్డ్ పాయింట్లు, అదనపు బెనిఫిట్స్ ఇచ్చే కార్డును ఎంచుకోవడం మంచిది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కనుక సకాలంలోనే వాటిని ఉపయోగించుకోవాలి.
- క్రెడిట్ కార్డు రివార్డ్‌లను కేవలం బోనస్‌గానే చూడాలి. అంతేకాని రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ఖర్చులు చేయకూడదు.
- మీరు రివార్డ్ పాయింట్లతో వస్తువులను కొనాలని అనుకుంటే, ఆన్లైన్లో వాటి ధరలను పోల్చి చూడండి. ఒకవేళ రివార్డ్ పాయింట్లతో, చాలా తక్కువ ధరకు లభిస్తేనే దానిని కొనండి. లేకుండా రివార్డ్ పాయింట్లను వేస్ట్ చేయవద్దు.
- ఒక వేళ రివార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చుకునే అవకాశం ఉంటే, దానిని కచ్చితంగా నగదుగా మార్చుకోండి. దీని వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
- క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. దీని వల్ల మీపై ఎలాంటి పెనాల్టీలు, అదనపు రుసుముల భారం పడకుండా ఉంటుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. భవిష్యత్‌లో తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం రివార్డ్ పాయింట్ల కోసమే అనవసర ఖర్చులు చేస్తే, మీరు అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
ఆరోగ్య బీమా క్లెయిమ్ రూల్స్ ఛేంజ్ - వెయిటింగ్ పీరియడ్ తగ్గింపు! - Health Insurance New Rules