ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments - CREDIT CARDS FOR UPI PAYMENTS

How To Use Credit Cards For UPI Payments : మీరు తరచూ యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారా? ఇందు కోసం మీ యూపీఐ యాప్​నకు డెబిట్ కార్డ్​ను లింక్ చేశారా? అయితే ఇది మీ కోసమే. వాస్తవానికి మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి కూడా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Cards For UPI Payments
How to use credit cards for UPI payments
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 4:44 PM IST

How To Use Credit Cards For UPI Payments : యూపీఐ పేమెంట్స్​ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులభమైపోయాయి. సమయానికి మన చేతిలో డబ్బులు లేకపోయినా, షాప్​ వద్ద ఉన్న క్యూఆర్​ కోడ్ స్కాన్​ చేసి, చాలా ఈజీగా బిల్లు చెల్లించేస్తున్నాం. అలాగే యూపీఐ యాప్స్​ ద్వారా ఆన్​లైన్ షాపింగ్ చేయగలుగుతున్నాం.

సాధారణంగా యూపీఐ యాప్స్​కు డెబిట్​ కార్డులను లింక్ చేస్తూ ఉంటాం. కానీ క్రెడిట్​ కార్డులను కూడా జత చేయవచ్చని మీకు తెలుసా? మీరు చదువుతున్నది నిజమే. క్రెడిట్​ కార్డ్​ను లింక్​ చేసుకుని యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

రూపే క్రెడిట్ కార్డ్స్​తో యూపీఐ పేమెంట్స్​!
ఇంతకు ముందు యూపీఐ ప్లాట్​ఫామ్​తో వీసా, మాస్టర్​ కార్డులను మాత్రమే జతచేయడానికి వీలయ్యేది. కానీ రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 జూన్ 8 తరువాత రూపే క్రెడిట్ కార్డులను కూడా యూపీఐ ప్లాట్​ఫామ్​లకు లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కనుక మీరు యూపీఐ యాప్స్​కు రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని, పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Make UPI Payments Using Credit Card :

  • ముందుగా మీకు నచ్చిన యూపీఐ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోండి.
  • ఉదాహరణకు Gpay, ఫోన్​పే, పేటీఎం లాంటి యాప్స్​ డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • తరువాత సదరు యూపీఐ యాప్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత మీ బ్యాంక్​ అకౌంట్​, ఫోన్ నంబర్​లను లింక్ చేయాలి.
  • వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి.
  • ఇవన్నీ పూర్తి చేసిన తరువాత యూపీఐ యాప్​లోని మీ ప్రొఫైల్ లేదా​ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • Set up payment methods లేదా add a payment methodపై క్లిక్ చేయాలి.
  • మీ క్రెడిట్ కార్డ్ వివరాలు దానిలో నమోదు చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి.
  • అంతే సింపుల్​! ఇకపై మీ క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసేయవచ్చు. ఎలా అంటే?
  • మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే, పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి అమౌంట్ ఎంటర్ చేయగానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • మీరు క్రెడిట్ కార్డ్​పై క్లిక్ చేస్తే, యూపీఐ పేమెంట్ జరిగిపోతుంది.

ఏయే క్రెడిట్ కార్డ్స్ వాడవచ్చు!
ఈ కింద ఇచ్చిన లిస్ట్​లోని బ్యాంకులు అందించే రూపే క్రెడిట్ కార్డులను మీరు యూపీఐ పేమెంట్స్ కోసం వాడవచ్చు.

1. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

3. ఇండియన్ బ్యాంక్​

4. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

5. యాక్సిస్ బ్యాంక్​

6. కోటక్ మహీంద్రా

7. కెనరా బ్యాంక్

8. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

9. యెస్​ బ్యాంక్​

10. BOB ఫైనాల్సియల్​ సొల్యూషన్స్​ లిమిటెడ్​

క్రెడిట్ కార్డులను సపోర్ట్ చేసే యూపీఐ యాప్స్​ ఇవే!

  • భీమ్​ యాప్​ (BHIM)
  • భీమ్ పీఎన్​బీ
  • క్రెడ్​ (CRED)
  • కెనరా ఏ1
  • గోకివి (Gokiwi)
  • గూగుల్ పే
  • పేజ్​యాప్​ (PayZapp)
  • ఫోన్​పే
  • మొబిక్విక్​
  • పేటీఎం
  • స్లైస్​

గూగుల్ పే వెబ్​సైట్​ ప్రకారం - వీసా, మాస్టర్​ కార్డ్​ యూజర్లు కూడా యూపీఐ యాప్స్​తో వివిధ బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులను లింక్ చేసుకోవచ్చు. ఆ బ్యాంకులు ఏవంటే?

యాక్సిస్ బ్యాంక్​, ఎస్​బీఐ, ఎస్​బీఐ కార్డ్​, కోటక్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్​, ఆర్​బీఎల్ బ్యాంక్, హెచ్​ఎస్​బీసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, వన్​కార్డ్ (వీసా క్రెడిట్ కార్డ్​).

జియో సరికొత్త ప్లాన్​ - అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ! - Jio 857 Prepaid Plan

మారుతి, టాటా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.50 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In April 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.