How To Reset UPI Pin : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) అంటే పేమెంట్స్. పేమెంట్స్ అంటే యూపీఐ అనే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అంతలా ప్రజానీకం యూపీఐని వాడేస్తున్నారు. ఈ పేమెంట్ టెక్నాలజీ వల్ల ప్రధానంగా చిల్లర సమస్య తీరిపోయింది. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు చిటికెలో నగదును ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనిపై సురక్షితంగా ఉండేలా జాగ్రత్తపడటం మనందరి వ్యక్తిగత బాధ్యత. లేదంటే చాలా నష్టపోయే రిస్క్ కూడా ఉంటుంది. ప్రత్యేకించి యూపీఐ పిన్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తరుచుగా యూపీఐ పిన్‌ను మారుస్తుండటం మంచిది. లేదంటే హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా యూపీఐ పిన్‌ను మర్చిపోయినా, హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే ఎలా మార్చుకోవాలో చూద్దాం.
ఇవి తప్పనిసరి
యూపీఐ పిన్‌ను మార్చే విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. అదేదో పెద్ద పని అని భావిస్తుంటారు. కొన్నిస్టెప్స్ తెలిస్తే చాలు యూపీఐ పిన్‌ను మార్చడం చాలా ఈజీ అని ప్రతి ఒక్కరు చెప్పి తీరుతారు. యూపీఐ పిన్‌ను మార్చడానికి ముందు మనం కొంత సమాచారాన్ని రెడీ చేసుకోవాలి. మన డెబిట్ కార్డులోని చివరి ఆరు అంకెలు, కార్డుపై ఉండే గడువు తేదీ వివరాలను రెడీగా ఉంచుకోవాలి. మన ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంటుతో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఇవన్నీ రెడీగా ఉంటే మనం ఇక యూపీఐ పిన్‌ను మార్చే ప్రక్రియను మొదలు పెట్టేయొచ్చు. కింద స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఈ యూపీఐ పిన్‌ను ఈజీగా మార్చుకోవచ్చు.
- మీ మొబైల్ ఫోన్‌లోని యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి మెనూ నుంచి "బ్యాంక్ ఖాతా" అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
- "UPI PINని రీసెట్ చేయి" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
- కొత్త UPI పిన్‌ను క్రియేట్ చేసేందుకు మన డెబిట్ కార్డుకు సంబంధించిన చివరి ఆరు అంకెలు, గడువు, ముగింపు తేదీని నమోదు చేయాలి.
- ఆ తర్వాత యూపీఐ యాప్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని యాప్‌లో ఎంటర్ చేయాలి.
- తర్వాత మనకు ఇష్టమైన యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలి.
- మనం కొత్తగా సెట్ చేసుకున్న యూపీఐ పిన్‌ను రెండోసారి కూడా ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఇలా సులభంగా యూపీఐ పిన్‌ను మార్చుకోవచ్చు.
అంబానీ పెళ్లికి సర్వం సిద్ధం- జియో సెంటర్లో అతిధుల మధ్య గ్రాండ్‌గా వివాహం - Anant Ambani Wedding