ETV Bharat / business

నిరుద్యోగులు కూడా మంచి క్రెడిట్ స్కోర్​ మెయింటెన్ చేయొచ్చు! ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ!

నిరుద్యోగులు మంచి క్రెడిట్ స్కోర్​ను మెయింటెన్ చేయడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే!

How To Maintain Credit Score During Unemployment
How To Maintain Credit Score During Unemployment (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How To Maintain Credit Score During Unemployment : బ్యాంకులు లేదా రుణదాత లోన్స్​ ఇచ్చే ముందు కచ్చితంగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్​​​ను పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారి లోన్ దరఖాస్తును తిరస్కరించొచ్చు. లేదంటే రుణంపై అధిక వడ్డీ వేస్తాయి. అందుకే లోన్లు ఈజీగా, తక్కువ వడ్డీ రేటుతో మంజూరు అవ్వాలంటే క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. అప్పుడే మీరు రుణదాతతో లోన్ వడ్డీ రేట్ల విషయంలో మాట్లాడగలరు. ఈ క్రమంలో నిరుద్యోగులు మంచి క్రెడిట్ స్కోరును మెయింటెన్ చేయాలంటే పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

నిరుద్యోగులకూ ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆ సమయంలో కొందరు బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డుపై రుణాలు తీసుకుంటారు. అయితే క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐను సకాలంలో చెల్లించడంలో విఫలమవుతారు. అప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది.

నిరుద్యోగం క్రెడిట్ స్కోర్​ను ప్రభావితం చేస్తుందా?
నిరుద్యోగం నేరుగా మీ క్రెడిట్ స్కోర్​ను ప్రభావితం చేయదు. క్రెడిట్ బ్యూరోలు మీ ఉద్యోగం, ఆదాయానికి బదులుగా మీ ఆర్థిక ప్రవర్తన ఆధారంగా క్రెడిట్ స్కోర్​ను నిర్ణయిస్తాయి. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐ కట్టకపోతే మాత్రం క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. తర్వాత లోన్ల మంజూరు కష్టమైపోతుంది. అందుకే ఉద్యోగం లేనప్పుడు ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి.

మీ క్రెడిట్ నివేదికను సమీక్షించండి
మీరు ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవాలి. చెల్లని ఆలస్య చెల్లింపులు, మీకు చెందని ఖాతాలు నుంచి ఏవైనా బిల్లులు కట్టినట్లు గుర్తిస్తే వెంటనే రుణదాతలకు విషయం తెలియజేయాలి. లేదంటే ఆలస్య చెల్లింపులు వంటివి మీ క్రెడిట్ హిస్టరీలో యాడ్ అయిపోతాయి. దీంతో క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.

సకాలంలో బిల్లులు కట్టేయండి
మీ పేమెంట్ హిస్టరీ క్రెడిట్ స్కోర్​ను ప్రభావితం చేస్తుందనే విషయం మర్చిపోవద్దు. క్రెడిట్ కార్డు, రుణాలపై కనీస చెల్లింపులు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. లేదంటే ఆలస్య చెల్లింపులు వల్ల క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.

అప్పులు విషయంలో జాగ్రత్త
ఆదాయం పరిమితంగా ఉన్నప్పుడు మీ నెలవారీ బిల్లులు, రుణ చెల్లింపులను ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించండి. గృహ రుణాలు, అద్దె, క్రెడిట్ కార్డు బకాయిలను ముందుగా చెల్లించండి.

కొత్త అప్పులు వద్దు
ఆర్థిక ఒత్తిడి సమయంలో క్రెడిట్ కార్డులను విపరీతంగా కొందరు వాడేస్తుంటారు. మరికొందరు లోన్లు తీసుకుంటారు. ఆ తర్వాత వీటి బిల్లులు సకాలంలో కట్టలేక ఆర్థిక ఊబిలో కూరుకుపోతారు. అప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డును అవసరమైన ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి.

క్రెడిట్ హిస్టరీ
మీకు పేలవమైన క్రెడిట్ హిస్టరీ ఉంటే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. అందుకే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను వాడండి.

రుణదాతతో కమ్యూనికేషన్
మీరు సకాలంలో బిల్లులు కట్టకపోతే ముందుగానే రుణదాతను సంప్రదించండి. కొన్ని సంస్థలు నిరుద్యోగులకు వాయిదా చెల్లింపులు, తక్కువ ఈఎంఐ వంటి ఆర్థిక సహాయ కార్యక్రమాలను అందించవచ్చు. రుణదాతలతో పారదర్శకతగా ఉండడం వల్ల మీ క్రెడిట్ స్కోర్​ను రక్షించడం సహా పెనాల్టీలు పడకుండా చూసుకోవచ్చు.

ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
నిరుద్యోగులకు అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్​ను ఉపయోగించుకోండి. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ ఫండ్​ను పొదుపు చేసుకోవచచ్చు.

నిరుద్యోగులు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ వర్క్ లేదా పార్ట్ టైమ్ జాబ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంత ఆర్థిక కష్టాలు తీరుతాయి. అలాగే అనవసరమైన ఖర్చులను పెట్టవద్దు. తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కొంత డబ్బును తాత్కాలికంగా సాయం చేయమని కోరండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.