ETV Bharat / business

"QR పాన్‌ కార్డ్" కావాలా? - ఇలా నిమిషాల్లో అడ్రస్​ అప్​డేట్​ చేసి కొత్త కార్డు పొందండిలా! - QR CODE PAN CARD

-కొత్తగా పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌ను చేపట్టిన కేంద్రం -మీరు అప్​డేట్​ చేసుకోండిలా..!

How to Get QR Code Pan Card
How to Get QR Code Pan Card (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 11:56 AM IST

How to Get QR Code Pan Card : ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధునికీకరించిన విషయం తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు, సాంకేతికంగా మార్పులు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పాన్ కార్డులు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌తో ఉంటాయి. అయితే, ప్రస్తుత పాన్‌ కార్డుదారులు వీటిని ఎలా పొందాలి ? ఏ విధంగా ఆన్​లైన్​లో అప్​డేట్​ చేసుకోవాలి ? అనేది ఈ స్టోరీలో చూద్దాం.

ఆన్‌లైన్‌లో చిరునామాను అప్‌డేట్‌ చేయడంతో క్యూఆర్‌ కోడ్‌ కలిగిన పాన్‌కార్డును పొందొచ్చు. ఆదాయపు పన్ను విభాగంతో నమోదైన పాత చిరునామాల స్థానంలో కొత్త చిరునామాలను పాన్‌ కార్డుదారులు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చని ఆదాయపు పన్ను విభాగం చెబుతోంది. అయితే, ఒకసారి ఇన్​కమ్​ ట్యాక్స్​ విభాగం రికార్డుల్లో చిరునామాను అప్‌డేట్‌ చేయగానే.. క్యూఆర్‌ కోడ్‌ కలిగిన ఇ-పాన్‌ను పన్ను చెల్లింపుదారు రిజిస్టర్డ్​ ఇ-మెయిల్‌ ఐడీకి పంపుతారు. రూ.50 ఫీజు పేమెంట్​ చేసి పాన్‌కార్డును ప్రింట్‌ చేసుకోవచ్చు.

సాధారణంగా పాన్‌కార్డుపై అడ్రస్​ ఉండదు. దీంతో ఎక్కువ మంది చిరునామాలను అప్‌డేట్‌ చేయకుండా వదిలేస్తున్నారు. పాన్‌కార్డుపై అడ్రస్​ లేనప్పటికీ.. ఆదాయపు పన్ను రికార్డుల్లో ప్రస్తుత అడ్రస్​ను ఇవ్వాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఆర్థిక సంస్థలు, పన్ను వర్గాలతో సంప్రదింపులు చేయడానికి సరైన అడ్రస్​ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో పొందడానికి, అలాగే పాన్‌తో తాజా అడ్రస్​ను అప్‌డేట్‌ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో చిరునామా ఇలా మార్చుకోండి..

ఆదాయపు పన్ను విభాగం ప్రకారం.. పాన్‌కార్డుదారులు తమ అడ్రస్​ను ఫ్రీగా మార్పు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రికార్డుల్లో చిరునామాను అప్‌డేట్‌ చేసేందుకు.. ఆధార్‌ కార్డు నుంచి సమాచారాన్ని తీసుకుంటారు. ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్​ చేసుకున్న వారు, ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆధార్‌ ప్రకారం పాన్‌ డేటాబేస్‌లో అడ్రస్​ను మార్చుకోవచ్చు.

ఈ లింకుల ద్వారా పాన్‌కార్డుదారులు తమ చిరునామాను అప్‌డేట్‌ చేసుకోమని పన్ను విభాగం చెబుతోంది.

1) ఎన్‌ఎస్‌డీఎల్‌ (NSDL) జారీ చేసిన పాన్‌ కలిగిన వారు

https:///www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html

2) యూటీఐ ఐటీఎస్‌ఎల్‌ (ITSL) జారీ చేసిన పాన్‌కార్డు కలిగినవారు

https:///www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange

  • పాన్‌కార్డులను జారీ చేసేందుకు ప్రోటీయన్‌ (ఇంతకు ముందు NSDL), యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (యూటీఐఐటీఎస్‌ఎల్‌) సంస్థలకు ఇన్​కమ్ ట్యాక్స్​ విభాగం అనుమతి ఇచ్చింది. పాన్‌కార్డు వెనుక వైపు కార్డు జారీ చేసిన సంస్థ పేరు ఉంటుంది.

ఇలా అప్​డేట్​ చేసుకోండి..

  • ముందుగా పైన చెప్పిన రెండు లింకుల్లో ఒకదాన్ని క్లిక్​ చేయండి.
  • తర్వాత ఆ వెబ్‌పేజ్‌లో పాన్, ఆధార్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. ఆధార్‌ ఆధారిత అనుమతి కోసం బాక్స్‌లో టిక్‌ పెట్టి సబ్మిట్‌ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు ఒక కొత్త వెబ్‌పేజ్‌ స్క్రీన్​ పైన ఓపెన్‌ అవుతుంది. ఆధార్‌తో లింక్​ అయి ఉన్న మొబైల్, ఇ-మెయిల్‌ ఐడీకి వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది.
  • OTP తో ఆధార్‌ ఆధారిత ఇ-కేవైసీని జనరేట్‌ చేయొచ్చు. తర్వాత 'కంటిన్యూ విత్‌ ఇ-కేవైసీ' ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు మొబైల్‌/ఇ-మెయిల్‌ ఐడీకి వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్‌ మీద క్లిక్‌ చేయండి.
  • ఇక్కడ ఆదాయపు పన్ను రికార్డుల్లో ఉన్న మొబైల్‌ నెంబర్​, ఇ-మెయిల్‌ ఐడీని అప్‌డేట్‌ చేసే సదుపాయం కనిపిస్తుంది. మీరు మార్చుకోవాలనుకుంటే తాజా వివరాలను ఎంటర్​ చేయాలి. మళ్లీ మీ మొబైల్‌/ఇమెయిల్‌కు వచ్చిన OTP ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు.
  • ఆధార్‌లో ఉన్న చిరునామా వివరాలు మాస్క్‌డ్ రూపంలో కనిపిస్తాయి. వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో చెక్​ చేసుకున్న తర్వాత 'వెరిఫై' మీద క్లిక్‌ చేయాలి.
  • ఒక కొత్త వెబ్‌పేజ్‌ స్క్రీన్​పైన ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ మీ కొత్త చిరునామాను ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత మీ కొత్త చిరునామా ఫ్రీగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

QR కోడ్​తో అందరికీ ఫ్రీగా కొత్త PAN కార్డ్- కేంద్రం కొత్త ప్రాజెక్ట్- పాతవి చెల్లుతాయా?

ఒక్కరోజులోనే పాన్​కార్డు కావాలా?- ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.