ETV Bharat / business

మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలా? సరైన బీమా​ పాలసీని ఎంచుకోండిలా! - How To Choose Best Insurance Policy - HOW TO CHOOSE BEST INSURANCE POLICY

How To Choose Best Insurance Policy : కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఉన్నంత వరకు అన్నీ సవ్యంగానే ఉంటాయి. అనుకోకుండా అతను/ఆమె దూరమైనప్పుడు బతుకు చీకటైపోతుంది. చుట్టూ అవసరాలు, అప్పులు పోగవుతాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటప్పుడే ఇన్సూరెన్స్‌ పాలసీ అండగా నిలుస్తుంది. అందుకే సరైన బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

life insurance policy for family
Why is Insurance Needed for a Family
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 12:00 PM IST

How To Choose Best Insurance Policy : అందరూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత అవసరాలకు వాడుకుని, మరి కొంత పొదుపు చేస్తుంటారు. లేదా అధిక రాబడిని ఇచ్చే స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఇలా పోగు చేసిన డబ్బుతో భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలు తీర్చుకోవచ్చని భావిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అత్యవసరాలకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. కానీ జీవితంలో అన్నీ అనుకున్న విధంగానే జరగవు. అనుకోని ప్రమాదాలు ఏరోజైనా తలుపు తట్టవచ్చు. దురదృష్టవశాత్తు కుటుంబానికి ఆధారమైన ఇంటి పెద్ద మరణించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అప్పటి వరకు కన్న కలలు వృథా అవ్వాల్సిందేనా? అందరూ ఆర్థిక భారం మోయాల్సిందేనా? వాస్తవానికి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవచ్చు. సరైన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే ఈ కష్టాల నుంచి కుటుంబాన్ని రక్షించవచ్చు. అందుకే మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే సరైన బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్‌ కీలకం
ఇన్సూరెన్స్‌ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఆరోగ్య అవసరాలు, రోడ్డు ప్రమాదాలు, అకాల మరణం నుంచి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఇన్సూరెన్స్‌ తీసుకున్న వ్యక్తి మృతి చెందితే, నామినీకి పరిహారం అందుతుంది. ఈ పరిహారం మొత్తం కుటుంబ అవసరాలకు, అప్పులు తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు.

ఇన్సూరెన్స్‌ రైడర్లు
ఇన్సూరెన్స్‌ రైడర్లు అనేవి ఇప్పటికే ఉన్న పాలసీకి ఆప్షనల్ యాడ్-ఆన్‌లు. ఇవి అడిషినల్‌ కవరేజీని అందించి, అత్యవసర పరిస్థితుల నుంచి రక్షణ అందిస్తాయి. ఏదైనా ప్రత్యేక ప్రయోజనాల కోసం కొత్త పాలసీని కొనుగోలు చేయడం కంటే, కావలసిన రైడర్‌ను యాడ్‌ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. పాలసీలకు యాక్సిండెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌, ప్రీమియం వేవర్‌ లాంటి రైడర్స్‌ ఉంటాయి. వీటిని యాడ్‌ చేసుకునేందుకు కొంత ప్రీమియం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత పాలసీ అవసరం?
ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునే ముందు ఆర్థిక లక్ష్యాలు, బాధ్యతలు, ఆధారపడిన వారు, ఆదాయం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా ఇన్సూరెన్స్‌ కంపెనీని సెలక్ట్‌ చేసుకునే ముందు చెల్లించాల్సిన ప్రీమియం మాత్రమే చూడొద్దు. ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్‌ ఇస్తోంది? క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో/ హిస్టరీ ఎలా ఉంది? కస్టమర్ల సమస్యలకు స్పందన ఎలా ఉంది? మొదలైన అంశాలను పరిశీలించాలి.

ఎలాంటి పాలసీ అవసరం?
కొన్ని ఇన్సూరెన్స్‌ పాలసీలు పరిహారం ఇవ్వడం వరకే పరిమితం అవుతాయి. కానీ కొన్ని పాలసీలు ప్రొటెక్షన్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ కూడా అందిస్తాయి. మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పాలసీని సెలక్ట్‌ చేసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక నిపుణులను సంప్రదించడం మేలు.

తగిన ఇన్సూరెన్స్‌ పాలసీ
చాలామంది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కేవలం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ భారాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే ఆప్షన్‌గా చూస్తుంటారు. పన్ను మినహాయింపు పొందాలనే లక్ష్యంతో పాలసీ తీసుకుంటే, కుటుంబానికి సరైన ఆర్థిక రక్షణ లభించకపోవచ్చు. కాబట్టి ముందు తగిన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-12 రెట్లు బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

దీర్ఘకాలిక లక్ష్యం
ఇన్సూరెన్స్‌ పాలసీలు సాధారణంగా లాంగ్‌ టెన్యూర్‌తో వస్తాయి. ముందుగానే పాలసీని సరెండర్‌ చేసినా, ప్రీమియం చెల్లించడం ఆపేసినా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పాలసీని తీసుకునేటప్పుడే అన్ని నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక నిర్ణయం - EMI భారం యథాతథం! - RBI Monetary Policy April 2024

మీ క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉందా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి! - Tips To Maintain Good Credit Score

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.