ETV Bharat / business

పేటీఎం FASTagను డీయాక్టివేట్​ చేయాలా? రీఫండ్ కూడా కావాలా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - how to get refund from Paytm Fastag

How To Deactivate Paytm Fastag : పేటీఎం ఫాస్టాగ్​లు ఈ మార్చి 15 తరువాత పనిచేయవు. అందువల్ల యూజర్లు మరో బ్యాంక్ ఫాస్టాగ్​ను తీసుకోవడం మంచిది. ఇందుకోసం ప్రస్తుతమున్న పేటీఎం ఫాస్టాగ్​ను మరో బ్యాంకుకు పోర్ట్ చేసుకోవచ్చు. లేదా మీ పేటీఎం ఫాస్టాగ్​ను డీయాక్టివేట్​ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

paytm fastag deactivation process
how to deactivate paytm fastag
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 12:25 PM IST

How To Deactivate Paytm Fastag : దేశం మారుతోంది, దేశంలోని రోడ్లూ మారుతున్నాయి. మంచి రోడ్ల నిర్వహణ కోసం అక్కడక్కడ టోల్ గేట్స్ ఏర్పాటు చేసి టోల్ ఛార్జ్​ చేయడం అందరికీ తెలిసిందే. అయితే గతంలో నగదు రూపంలో ఈ టోల్ ఛార్జ్ చేసేవారు. అయితే దానిని డిజిటలైజ్ చేసి ఫాస్టాగ్‎లను తీసుకురావడం జరిగింది. దేశంలోని వివిధ బ్యాంకులు ఈ ఫాస్టాగ్‎లను జారీ చేసేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. దేశంలో ఫాస్టాగ్‎లను జారీ చేస్తున్న బ్యాంకుల జాబితాలో పేటీఎం పేమెంట్ బ్యాంక్ కూడా ఒకటి.

అయితే పేటీఎం పేమెంట్ బ్యాంక్ నిబంధనలకు లోబడి పని చేయడం లేదంటూ ఆర్​బీఐ అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా మార్చి 15, 2024 తరువాత పేటీఎం ఫాస్టాగ్​లు పనిచేయవని స్పష్టం చేసింది. అందువల్ల పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ పొందిన వాళ్లు కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. అలాగే పాత ఫాస్టాగ్​ను డీయాక్టివేట్ చేసుకుని​ రీఫండ్ కూడా పొందాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఫాస్టాగ్ రీఫండ్ ఇలా పొందండి:

  • ముందుగా పేటీఎం ఫాస్టాగ్ కస్టమర్ కేర్ నంబర్ 1800-120-4210కు కాల్ చేయండి.
  • భాషను ఎంచుకోవడం ద్వారా IVR మెనూలోకి వెళ్లి, ఆపై 'ఫాస్టాగ్'ను ఎంచుకోండి.
  • తరువాత ఆటోమేటెడ్ వాయిస్ సిస్టమ్​లో ‘క్లోజ్ ఫాస్టాగ్’ ను ఎంచుకోండి.
  • తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‎కు మెసేజ్ రూపంలో ఒక లింక్ వస్తుంది.
  • లింక్ పై క్లిక్ చేయగానే పేటీఎం యాప్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ పేటీఎం ఫాస్టాగ్ ఉన్న మీ రిజిస్టర్డ్ వెహికల్స్​ వివరాలన్నీ కనిపిస్తాయి.
  • వెహికల్ నంబర్​పై క్లిక్ చేసి ‘క్లోజ్ ఫాస్టాగ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • దీని తరువాత ‘మీ రిఫండ్ ప్రారంభించబడింది’ అని పాప్-అప్ మెసేజ్ వస్తుంది.
  • 7-10 రోజుల్లో రీఫండ్ వస్తుందని పేటిఎం బ్యాంక్ నుంచి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
  • రీఫండ్ పూర్తయిన తర్వాత కస్టమర్లకు రీఫండ్ పూర్తైనట్లు మరో మెసేజ్ వస్తుంది.
  • అయితే ఇది మీ ఒరిజినల్ పేమెంట్ సోర్స్ లేదా పేటీఎం వాలెట్‎కు వెళుతుందో స్పష్టంగా తెలియదు.
  • ఒకవేళ పేటీఎం వాలెట్‎కి వచ్చినట్లైతే, యాప్‎లోకి వెళ్లి ఆ డబ్బును మీ బ్యాంకు అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు.

2024లో లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్ ఇవే!​ ఫీచర్స్​ అదుర్స్​ - ధర ఎంతో తెలుసా?

అమెరికాలో గూగుల్ పే బంద్! మరి భారత్​ సంగతేంటి? మన డబ్బు భద్రమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.