How To Choose The Right Two-Wheeler For A Beginner : మీరు మొదటిసారి టూ-వీలర్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని కీలక విషయాలను మదిలో ఉంచుకోవాలి. మార్కెట్లో ఎన్నో రకాల బైక్‌లు, స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో మీకు సరిపోయే బైక్‌ను లేదా స్కూటర్‌ను ఎంచుకోవడం చాలా కష్టం. అందుకే ఈ స్టోరీలో మొదటిసారి ద్విచక్ర వాహనాన్ని కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం.
- ఇంజిన్ కెపాసిటీ : మొదటిసారి బైక్‌ను కొనేవారు 100 సీసీ, 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల మీరు సులువుగా బైక్ నడపగలుగుతారు. తరువాత క్రమంగా పవర్ఫుల్ ఇంజిన్ కలిగిన బైక్‌ను నడపడానికి అలవాటు పడతారు.
- బరువు : బిగినర్స్ చాలా తేలికగా, సులువుగా హ్యాండిల్ చేయగలిగే బైక్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి బైక్‌ను కొనుగోలు చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఈజీగా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది.
- సీటు ఎత్తు : బైక్ సీటు మీకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. అంటే బైక్‌పై మీరు కూర్చొంటే, నేలపై సౌకర్యవంతంగా పాదాలు పెట్టగలగాలి. అప్పుడే దానిని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు.
- ఫీచర్లు : మీ ఎంచుకునే బైకులో ఏబీస్, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్యూయల్ ఇంజెక్షన్ వంటి సెఫ్టీ ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి.
Tips For Buying Your First Bike : మనం కొన్ని టూ-వీలర్స్‌ను ఉదాహరణగా తీసుకుని, మనం ఎలాంటి ఫీచర్లు ఉన్న బైక్‌ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.
1. Honda Activa 6G : హోండా యాక్టివా 6జీ మన దేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటర్లలో ఒకటి. ఇది మంచి ఇంధన సామర్థ్యంతో, బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. పట్టణాల్లో ప్రయాణించేవారికి, తక్కువ దూరం ప్రయాణించేవారికి ఈ స్కూటీ చాలా బాగుంటుంది.
- కాంపాక్ట్ డిజైన్ : హోండా యాక్టివా 6జీ అనేది ఒక కాంపాక్ట్ స్కూటర్. దీన్ని హెవీ ట్రాఫిక్‌లోనూ సులువుగా నడపవచ్చు. దీని సీటు తక్కువ ఎత్తులో ఉంటుంది.
- ఈజీ స్టార్టింగ్ సిస్టమ్ : హోండా యాక్టివా 6జీ ఆటోమేటిక్ కంప్రెషన్ ఇగ్నిషన్ స్టార్టర్ సిస్టమ్‌తో లభిస్తుంది. దీన్ని చల్లని వాతావరణ పరిస్థితుల్లోనూ ఈజీగా స్టార్ట్ చేయవచ్చు.
- సమర్థవంతమైన ఇంజిన్ : యాక్టివా 6జీ 125 సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది 50 కి.మీ/ లీటర్ మైలేజ్ ఇస్తుంది.
- స్టేబుల్ హ్యాండ్లింగ్ : యాక్టివా 6జీపై నగర వీధుల్లో, రద్దీగా ఉండే హైవేలపై సాఫీగా ప్రయాణం చేయవచ్చు.
- విశాలమైన స్టోరేజ్ స్పేస్ : యాక్టివా 6జీలో హెల్మెట్, ఇతర అవసరమైన వస్తువులను ఉంచగలిగే పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉంది.
సెక్యూరిటీ ఫీచర్లు
- ఫ్రంట్ డిస్క్ బ్రేక్ : యాక్టివా 6జీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.
- యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ : యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది సడెన్‌గా బ్రేక్ వేసినా బైక్ జారిపోకుండా కాపాడుతుంది.
- సైడ్ స్టాండ్ స్విచ్ : యాక్టివా 6జీ సైడ్ స్టాండ్ స్విఛ్ను కలిగి ఉంది. సైడ్ స్టాండ్ తీయకుండా స్కూటీని స్టార్ట్ చేయకుండా ఇది ఆపుతుంది.
2. YAMAHA FZ-S FI : రైడింగ్ కోసం బైక్ కొనాలని అనుకునేవారికి యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ మంచి ఆప్షన్ అవుతుంది. దీని ఫీచర్లు ఎలా ఉంటాయంటే?
- స్టైలిష్ డిజైన్ : యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ బైక్ మోడ్రన్ లుక్, స్టైలిష్ డిజైన్‌తో లభిస్తుంది. ఇది స్పోర్టీ లుక్‌లో ఉంటుంది. ఇది యువ రైడర్లకు మంచి ఆప్షన్ అవుతుంది.
- రెస్పాన్సివ్ ఇంజిన్ : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ 125సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది కొత్త రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.
- ఎజైల్ హ్యాండ్లింగ్ : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐను ట్రాఫిక్‌లోనూ, ఇరుకైన ప్రదేశాల్లోనూ ఈజీగా నడపవచ్చు.
- కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
- ఇంధన సామర్థ్యం : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ బైక్ లీటర్ పెట్రోల్‌కు 45 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది.
సెక్యూరిటీ ఫీచర్లు
- సింగిల్ ఛానల్ ఏబీఎస్ : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది.
- ఎల్ఈడీ హెడ్ లైట్ : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ రాత్రి పూట రైడింగ్ కోసం అద్భుతమైన వెలుతురును అందించే ఎల్ఈడీ హెడ్ లైట్స్‌తో లభిస్తుంది.
- సైడ్ స్టాండ్ స్విఛ్ : ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ సైడ్ స్టాండ్ స్విఛ్ను కలిగి ఉంటుంది. సైడ్ స్టాండ్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఇది బైక్ స్టార్ట్ అవ్వకుండా నివారిస్తుంది.
3. Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లీటరు పెట్రోల్ పోస్తే 60 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. దూర ప్రాంతాలు, రోజువారి ప్రయాణాలు చేసేవారి ఈ బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. బడ్జెట్లో బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. 97.2 సీసీ పవర్ఫుల్ ఇంజిన్‌తో మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఈ బైక్ ఇస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ తేలికగా ఉంటుంది. సిటీలో, హెవీ ట్రాఫిక్‌లో ఈ బైక్‌ను ఈజీగా నడపవచ్చు. తక్కువ ధరలో లభించే బైక్‌లలో ఇదొకటి. అలాగే ఈ బైక్ సస్పెన్షన్ సిస్టమ్ సాఫీగా ప్రయాణం చేసేందుకు ఉపయోగపడుతుంది.
4. Bajaj Pulsar NS200 : బజాజ్ పల్సర్ NS200 అనేది ఒక స్పోర్టీ డిజైన్ బైక్. ఇది మంచి పెర్ఫార్మెన్స్ను ఇస్తుంది. కొత్తగా బైక్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ 200 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 23.5 హెచ్‌పీ పవర్, 18.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌పై సిటీ రోడ్లు, హైవే, ట్రాఫిక్‌లోనూ దూసుకెళ్లిపోవచ్చు. ఈ బైక్ బరువు తక్కువగా ఉంటుంది. అలాగే మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇది ఒక లీటరు పెట్రోల్‌కు 40 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. బజాజ్ పల్సర్ NS200 బైక్ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ బైక్‌లో ఉంది కనుక జారుడు ప్రదేశంలో ఈ బైక్ జారిపోకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే నైట్రోక్స్ సస్పెన్షన్ వల్ల గతుకుల రోడ్లపై కూడా సేఫ్‌గా జర్నీ చేయవచ్చు.
5. TVS Apache RTR 160 4V : టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 1600 4వీ స్పోర్టీ డిజైన్‌తో వస్తుంది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ను ఇస్తుంది. ఇది తొలిసారి బైక్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. 159 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 16.5 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ కూడా లీటర్ పెట్రోల్‌కు 40 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. ఇది మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు దీనిలో ఉంటాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి!
- టూ-వీలర్ నడిపేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
- ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలి.
- సాధ్యమైనంత వరకు నెమ్మదిగా డ్రైవ్ చేయాలి.
- రాత్రివేళ, వాతావరణం బాగోలేనప్పుడు బైక్‌పై ప్రయాణించకపోవడమే మంచిది.
మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొన్నారా? ఈ టాప్-7 మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే!
ఎంతో ఇష్టపడి కొత్త బైక్ కొనుక్కున్నారా? ఈ టాప్-10 మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే! - Bike Maintenance Tips