ETV Bharat / business

మంచి ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాలా? ఈ టాప్​-6 టిప్స్ మీ కోసమే! - How To Choose Best Health Insurance - HOW TO CHOOSE BEST HEALTH INSURANCE

How To Choose Best Health Insurance Policy : మారుతున్న మనుషుల జీవనశైలితో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో వైద్య ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే ఆర్థికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. వైద్య ఖర్చులను తట్టుకునేలా ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందుకే సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Insurance benefits
Health Insurance tips (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 10:57 AM IST

How To Choose Best Health Insurance Policy : ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే దాని గురించి మనం చాలా అధ్యయనం చేస్తాం. ఆ వస్తువు మనకు ఎంత మేర అవసరం? అది సరైన ధరకు వస్తుందా? అనేవి చూస్తుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అంతకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

1. ట్యాక్స్ బెనిఫిట్స్​ కోసం చూసుకోవద్దు!
అవసరం ఏమిటన్నది పట్టించుకోకుండా చాలామంది ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుటుంబం మొత్తానికి వర్తించేలా రూ.5 లక్షల పాలసీ తీసుకున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సరిపోతుందా? అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? ప్రస్తుత కాలంలో వైద్య ఖర్చులు ఎంతగా పెరిగిపోయాయో అందరికీ తెలుసు. అందుకే, ఆరోగ్య బీమా పాలసీని ఎంత విలువకు తీసుకోవాలనే విషయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

2. ఏజ్ ఆధారంగా
వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యం బారిన పడుతుంటాం. చికిత్స ఖర్చులూ పెరుగుతుంటాయి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. పాలసీని క్లెయిం చేసుకునే అవసరమూ అంతగా రాదు. కాబట్టి, నో క్లెయిమ్‌ బోనస్‌ లాంటివి పాలసీల విలువలో జమ అవుతూ ఉంటాయి. 50 ఏళ్ల వయసు వారు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే కనీసం రూ.10లక్షలకు తక్కువ కాకుండా చూసుకోవాలి.

3. ఖర్చు ఎంత?
చాలా మంది ఎప్పుడూ మంచి గురించే ఆలోచిస్తుంటాం. ఇది మంచిదే. కానీ, అనుకోని సమస్య ఎదురైతే ఏం చేయాలన్నదీ ఆలోచించుకోవాలి. ఒకవేళ కుటుంబంలోని ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చవుతుంది అనే విషయాన్ని అంచనా వేసుకోవాలి. దీనికోసం మీ దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రిలో చికిత్స ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఆరోగ్య బీమా పాలసీ ఎంత ఉంటే బాగుంటుందనే విషయంలో స్పష్టత వస్తుంది.

4. చరిత్ర తెలుసుకోవాలి
మీ కుటుంబంలోని వ్యక్తులకు తీవ్ర వ్యాధులకు సంబంధించిన చరిత్ర ఉంటే, మీరూ ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోక తప్పదు. అనుకోని పరిస్థితుల్లో అలాంటి తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు ఎంత ఖర్చు అవుతుందన్నది చూసుకొని, బీమా మొత్తంపై నిర్ణయం తీసుకోవాలి.

5. కుటుంబ సభ్యులకు పాలసీ
కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలను ఎంచుకోవాలనుకుంటే, మొత్తం సభ్యుల ఆధారంగా పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ కుటుంబంలోని వ్యక్తులందరికీ వర్తిస్తుంది. అందరి వయసులు, ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్‌ అవసరాల్లాంటివి చూసుకోవాలి. నలుగురిలో ఒకరు ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, మొత్తం పాలసీ ఖర్చవకుండా ఉండాలి. మిగతా ముగ్గురికీ అవసరమైనప్పుడు పాలసీ కవరేజీ అందుబాటులో ఉండాలి.

6. సమీక్షించడం తప్పనిసరి
ఆరోగ్య, వైద్య చికిత్సల ద్రవ్యోల్బణం ఏటా 12-15 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మీ ఆరోగ్య బీమా పాలసీ విలువను ప్రతి రెండేళ్లకోసారి సమీక్షించుకోవడం బెటర్. అప్పుడే వైద్య ఖర్చులను తట్టుకునేలా మీ పాలసీ ఉందా లేదా అనేది అర్థమవుతుంది.

బోనస్ టిప్​ : మీరు తీసుకున్న పాలసీ కొన్ని వైద్య చికిత్సలకు సరిపోకపోవచ్చు. ఉదాహరణకు గుండె వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యంలాంటి వాటికి చికిత్సలు ఎంతో ఖరీదైనవి. ప్రాథమిక పాలసీ ఇలాంటప్పుడు సరిపోకపోవచ్చు. కాబట్టి, మీ పాలసీకి అనుబంధంగా సూపర్‌ టాపప్‌ పాలసీని తీసుకోవాలి. క్రిటికల్‌ ఇల్​నెస్‌ పాలసీలూ అవసరమే. ఇవి ఏదైనా తీవ్ర వ్యాధి బారినపడినప్పుడు ఒకేసారి పరిహారం చెల్లిస్తాయి. అనుకోకుండా వైకల్యం బారిన పడినా, ఆర్థికంగా ఆదుకునేలా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని తీసుకోవాలి. మీ ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకం. అది సరైన మొత్తానికి తీసుకున్నప్పుడే ఆరోగ్య అత్యవసరాల్లో మిమ్నల్ని కాపాడుతుంది.

ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్​లైన్​లో అప్లై చేసుకోండిలా! - International Driving Licence

RBI మన బంగారాన్ని విదేశాల్లో స్టోర్ చేస్తుంటుంది - ఎందుకో తెలుసా? - Indias Gold Reserves In Foreign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.