ETV Bharat / business

నంబర్​ ప్లేట్​తో బండి ఓనర్ వివరాలు తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check Vehicle Owner Details - HOW TO CHECK VEHICLE OWNER DETAILS

How To Check Vehicle Owner Details By Number Plate : మీ వాహనాన్ని ఎవరో ఢీకొట్టి వెళ్లిపోయారా? డోంట్ వర్రీ. మీ వాహనాన్ని ఢీకొట్టిన వెహికల్ నంబర్​ ప్లేట్ ఫొటో ఉంటే చాలు. చాలా ఈజీగా దాని యజమానిని గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Vehicle Number plate
Car Number plate (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 3:35 PM IST

How To Check Vehicle Owner Details By Number Plate : ప్రస్తుత కాలంలో హిట్ అండ్ రన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాన్ని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయి చాలా మంది తప్పించుకుంటున్నారు. అందుకే ఇలాంటి సందర్భాల్లో మీ వాహనాన్ని ఢీకొట్టిన వెహికల్ నంబర్ ప్లేట్​ను ఫొటో తీయాలి. లేదా దాన్ని గుర్తు పెట్టుకోవాలి. దీని వల్ల ఆ బండి యజమాని వివరాలను చాలా సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు కూడా నంబర్ ప్లేట్ ఆధారంగా నిజమైన యజమాని వివరాలను గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

హిట్ అండ్ రన్ : మీ వాహనాన్ని ఢీకొట్టి వేరొక వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడని అనుకుందాం. అప్పుడు హిట్ అండ్ రన్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే మిమ్మల్ని ఢీకొట్టిన వాహనదారుడి కచ్చితమైన వివరాలు అవసరం అవుతాయి. అందుకే ఎవరైనా మీ వాహనాన్ని ఢీకొడితే, వెంటనే వారి నంబర్​ ప్లేట్లను ఫొటో తీయాలి. ఆ నంబర్ ప్లేట్ ద్వారా మిమ్మల్ని ఢీకొట్టిన వాహన యజమాని వివరాలను పొందవచ్చు.

సెకెండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు : మనలో చాలా మందికి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ కొత్త వాహనం కొనేంత డబ్బులు మన దగ్గర ఉండకపోవచ్చు. అటువంటి సమయాల్లో మన చేతిలో ఉన్న ఏకైక ఆప్షన్, ఎవరైనా సెకెండ్ హ్యాండ్​ వాహనాన్ని అమ్మితే దానిని కొనుగోలు చేయడం. సెకెండ్​ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, దాని యజమాని ప్రామాణికమైన వివరాలను తెలుసుకోవాలి. మీరు కొనే వాహనంపై ఏవైనా కేసులు ఉన్నాయా? వాహనంపై ఏవైనా చలాన్లు పెండింగ్​లో ఉన్నాయా? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు కొనుగోలు చేయబోయే వాహనం నంబర్ ప్లేట్ ఉపయోగించి, దాని అసలైన యజమాని వివరాలు కూడా చూడాలి. అప్పుడే మోసానికి గురికాకుండా ఉంటాం.

పరివాహన్‌ వెబ్​సైట్​లో తనిఖీ చేసుకోండిలా?

  • ముందుగా పరివాహన్ వెబ్​సైట్​​ను ఓపెన్ చేయండి.
  • 'Informational Services' పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత కింద ఉన్న 'Know Your Vehicle Details' ఆప్షన్​ను ఎంచుకోండి.
  • మీరు ఇప్పటికే యూజర్ అయితే మీ వివరాలతో లాగిన్ అవ్వండి. లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
  • వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్​ను ఎంటర్ చేయండి. 'VAHAN Search'పై క్లిక్ చేయండి. అంతే సింపుల్​!
  • సదరు వాహన యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి.

వాహనాలకు 'BH' సిరీస్ నంబర్ ప్లేట్లు- ఎలా అప్లై చేయాలి? లాభాలేంటి?

వాహనాల నంబర్​ ప్లేట్ల రంగులు​.. వాటి ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.