How To Check PAN Card Fraud : నేటి కాలంలో మనం చేసే ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డ్ తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డు దుర్వినియోగం సహజమే. అందుకే మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందో, లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి.
పాన్ నంబర్ అంటే ఏమిటి?
PAN కార్డ్ అనేది భారత ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. దీనిని లామినేటెడ్ కార్డ్ రూపంలో ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. పన్ను ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలకు PAN కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది.
అయితే కొన్ని కీలకమైన పనుల కోసం పాన్ కార్డు జిరాక్సు కాపీలను ఇవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
How To Check PAN Card Misuse : పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవాలంటే, మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాలను తరచుగా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్లను, రసీదులను పరిశీలించాలి. ఏవైనా తప్పుడు లావీదేవీలు జరిగాయా, లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా ఏమేమి పరిశీలించాలంటే?
ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ : మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చూడాలి. వాటిలో ఏవైనా అనుమానాస్పద లేదా అనధికార ఆర్థిక లావాదేవీలు జరిగాయా, లేదా అనేది ఓసారి చెక్ చేసుకోవాలి.
సిబిల్ : క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ రిపోర్టు కాపీని తీసుకోండి. మీ పాన్ కార్డ్‌తో అనుసంధానం అయిన ఏవైనా ఫేక్ అకౌంట్స్ లేదా క్రెడిట్ అప్లికేషన్‌లు ఉన్నాయా లేదా అనేది చూడండి. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే, వెంటనే క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి.
ఐటీ రిపోర్టు : ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి. మీ పన్ను ఫైలింగ్‌లను చెక్ చేయండి. ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఉదాహరణకు, మీరు ఫారమ్ 26ASలో వివరాలను తెలుసుకోవచ్చు.
మీ బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు : మీరు ఏదైనా మోసపూరిత లేదా అనుమానాస్పద లావాదేవీలను గమనించినట్లయితే, వెంటనే మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయండి. వారు అనధికారిక యాక్సెస్‌ను బ్లాక్ చేసి, మీ ఖాతాలను సంరక్షిస్తారు.
పోలీసులకు ఫిర్యాదు చేయండి : మోసపూరిత ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు చౌర్యం లేదా అనధికారిక యాక్సెస్ వంటి పాన్ కార్డ్ దుర్వినియోగాన్ని గుర్తిస్తే, వెంటనే మీ దగ్గరల్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. వారికి పాన్ కార్డ్ ఫ్రాడ్‌కు సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలు అందజేయండి.
ఆదాయపు పన్ను శాఖను సంప్రదించండి : ఆదాయపు పన్ను శాఖ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి. మీ పాన్ కార్డు దుర్వినియోగానికి సంబంధించిన వివరాలు, ఆధార పత్రాలు అందించండి.
How To Report On PAN Misuse :
పాన్ కార్డ్ దుర్వినియోగంపై రిపోర్ట్ చేయండిలా!
- ముందుగా TIN NSDL అధికారిక పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కస్టమర్ కేర్ విభాగం సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
- డ్రాప్-డౌన్ మెనూలోని Complaints/ Queries (ఫిర్యాదులు/ ప్రశ్నలు)పై క్లిక్ చేయండి.
- వెంటనే ఓ ఫిర్యాదు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- ఫిర్యాదు ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలు నమోదు చేయండి.
- క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి. అంతే సింపుల్!
నకిలీ జీఎస్టీ బిల్లులను ఎలా గుర్తించాలి? ఎలా రిపోర్ట్ చేయాలి? - How To Identify A Fake GST Bill
వాహనదారులకు గుడ్ న్యూస్ - సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త టోల్ ఛార్జీలు! - Toll Tax Relief