ETV Bharat / business

ఆధార్ కార్డ్​లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Aadhaar Update

Date Of Birth Update In Aadhaar : మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? దానిని మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎలా అప్​డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Aadhaar Update
Date of Birth Update in Aadhaar
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 5:21 PM IST

Date Of Birth Update In Aadhaar : భారత పౌరులకు ఆధార్ కార్డు ఒక నిత్యావసరంగా మారింది. ఆసుపత్రులు, రేషన్ దుకాణాలు, కాలేజీల వరకు, సిమ్ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంక్ రుణం పొందడం వరకు ప్రతి దగ్గరా ఆధార్ కార్డు అవసరం ఉంటోంది. అందుకే ఆధార్ కార్డులోని వివరాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. పొరపాటున ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సరిచేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.

ఒకే ఒక్క ఛాన్స్​
2019లో ఆధార్ కార్డు సవరణలకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు వివరాలను అప్​డేట్ చేసుకునే విషయంలో కొన్ని పరిమితులను విధించింది. దీని ప్రకారం, పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పాన్ కార్డు, జనన ధ్రువపత్రం, పాస్​పోర్టు, బ్యాంక్ పాస్​బుక్ లేదా మార్క్ షీట్లో, ఏదో ఒక పత్రాన్ని సమర్పించి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు.

ఆధార్​ కార్డ్​లో పుట్టిన తేదీ ఎలా మార్చుకోవాలంటే?
How To Change Date Of Birth In Aadhar Card :

  • మీ సమీపంలోని ఆధార్ ఎన్​రోల్మెంట్​ సెంటర్​కు వెళ్లి అక్కడ అప్​డేట్/కరెక్షన్ ఫారమ్​ తీసుకోవాలి.
  • ఫారమ్​లో మీరు అప్​డేట్ చేయాలని అనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  • దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా అందించాలి.
  • బయోమెట్రిక్ వివరాలు అందించాలి.
  • పుట్టిన తేదీ మార్చేందుకు రూ.50 రుసుము చెల్లించాలి.
  • మీరు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి, ధ్రువీకరించుకున్నాక, మీ పుట్టిన తేదీని అప్​డేట్ చేస్తారు.
  • ఆధార్ కార్డులో మార్పుకోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ కేంద్రం వాళ్లు మీకు ఒక స్లిప్ ఇస్తారు.
  • ఈ స్లిప్​లోని వివరాల సాయంతో మీ ఆధార్​ అప్​డేట్​ను ట్రాక్ చేసుకోవచ్చు.
  • మీ పుట్టిన తేదీ వివరాలు అప్​డేట్ అయ్యాక, UIDAI వెబ్​సైట్​ నుంచి మీరే స్వయంగా ఆధార్​ కార్డ్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • ఆధారకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఉడాయ్ హెల్ప్​లైన్ నంబర్​ 1947ను సంప్రదించవచ్చు.
  • లేదా help@uidai.gov.inకు మెయిల్ చేయవచ్చు.

అప్​డేటెడ్​ ఆధార్ కార్డ్​ను డౌన్​లోడ్ చేసుకోండిలా!

  • ఆధార్ సెంటర్​కు వెళ్లి, మీ ఫొటో, బయోమెట్రిక్స్​ అప్​డేట్​ చేసుకున్న తరువాత, UIDAI అధికారిక పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • హోమ్ పేజ్​లోని My Aadhar సెక్షన్​లోకి వెళ్లాలి.
  • Download Aadharపై క్లిక్ చేయాలి. తరువాత,
  • ఆధార్ నంబర్​ లేదా ఎన్​రోల్​మెంట్ ఐడీ నమోదు చేయాలి.
  • అక్కడ ఉన్న క్యాప్చాను కూడా ఎంటర్​ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది.
  • ఈ ఓటీపీని నమోదు చేసిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్​ అవుతుంది. తరువాత,
  • మీ లేటెస్ట్ ఈ-ఆధార్​ కార్డ్​ కనిపిస్తుంది. దానిని సింపుల్​గా డౌన్​లోడ్​ చేసుకోవాలి.

ఈ ఆధార్​ కార్డుకు పాస్​వర్డ్ ప్రొటక్షన్ ఉంటుంది. కనుక దీనిని ఓపెన్ చేయాలంటే, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్ లెటర్స్​లో నమోదు చేయాలి. అలాగే మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్​ చేయాలి. అప్పుడే మీ ఆధార్​ కార్డు వివరాలు కనిపిస్తాయి.

నోట్​ : మీరు కావాలనుకుంటే, వర్చువల్ ఆధార్ కార్డును కూడా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

బేబీ మిలియనీర్​ - 5 నెలల వయస్సులోనే రూ.4.2 కోట్ల సంపాదన​ - ఇంతకీ అతను ఎవరో తెలుసా? - Ekagrah Rohan Murty Networth

వెండి కొనాలా? సిల్వర్ ఈటీఎఫ్​ల్లో ఇన్వెస్ట్ చేయాలా? ఏది బెటర్ ఆప్షన్​! - How To Invest In Silver

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.