ETV Bharat / business

ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఐటీ నోటీసు రాకూడదంటే ఎలా? - Gold Storage Limit In India - GOLD STORAGE LIMIT IN INDIA

How Much Gold Can You Keep At Home : బంగారం అంటే ఇష్టపడని భారతీయులు ఎవరుంటారు? అందులోనూ మన దేశ మగువలు బంగారమంటే చాలా ఇష్టపడతారు? అయితే పన్ను లేకుండా మన ఇంట్లో ఎంత బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు? అసలు పసిడి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఎలా విధిస్తారు? అనే అంశాలు తెలుసుకుందాం రండి.

gold storage limit in india
How much gold can you keep at home? (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 5:28 PM IST

How Much Gold Can You Keep At Home : అత్యంత ప్రజాదరణ పొందిన లోహాల్లో బంగారం ఒకటి. దీనిని వ్య‌క్తిగ‌తంగా వాడ‌ుతుంటారు. పెట్టుబ‌డిగానూ వినియోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది చాలు మనోళ్లకు బంగారమంటే ఎంత ఇష్టమో చెప్పటానికి. ముఖ్యంగా మన ఆడపడుచులు పసిడిని ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ లాంటి పండగలు మొదలు పెళ్లి వరకు, సందర్భం ఏదైనా నగల దుకాణానికి వెళ్లాల్సిందే. అయితే మన ఇంట్లో గరిష్ఠంగా ఎంత వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు? పసిడి ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత పన్ను విధిస్తారు? అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Storage Limit In India : సాధారణంగా మన ఇంట్లో ఎంత బంగారం అయినా ఉంచుకోవచ్చు. అయితే ఆ ఆభరణాలు కొనుగోలు చేయడానికి లేదా గోల్డ్ పెట్టుబడులకు ఆదాయం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆదాయ పన్ను శాఖ వారికి చూపించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కచ్చితంగా ఇన్​కం ట్యాక్స్ డిపార్ట్​మెంట్ వారికి పన్ను కట్టాల్సి ఉంటుంది.

ఇక పన్ను కట్టకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చంటే? సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం, పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని అమ్మాయిలు 250 గ్రాములు ఉంచుకోవచ్చు. అదే పురుషులు విషయానికి వస్తే, పెళ్లి అయినా, కాకపోయినా ఎలాంటి ఆధారాలు చూపించకుండా 100 గ్రాముల వరకు బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు.

గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్స్​పై ఎంత పన్ను చెల్లించాలి?
Tax Implications On Gold Investments : ''బంగారాన్ని వ్యక్తిగత అవసరాలకు, పెట్టుబడి పెట్టేందుకు - ఇలా రెండు రకాలుగా కొనుగోలు చేస్తారు. ఏది ఏమైనా పసిడి కొనుగోలుపై ప్రత్యక్ష పన్ను ఉండదు. బంగారంపై పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు 3 శాతం వరకు జీఎస్టీ చెల్లించాలి. అదే మేకింగ్, కంసాలి రుసుముల విషయంలో 5 శాతం వరకు జీఎస్టీ చెల్లించాలి. ఇక విదేశాల నుంచి స్వర్ణం దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, డెవలప్​మెంట్ సెస్, జీఎస్టీ రూపంలో మరింత చెల్లించాల్సి ఉంటుంది.

ఇన్​కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బంగారం సంబంధించిన సమాచారం చూపించాల్సి వస్తుంది. పన్ను చెల్లింపుదారుల ఆదాయం రూ.50 లక్షలకు మించి ఉంటే, వారు ఐటీఆర్​లో దేశీయ ఆస్తుల్లో (డొమెస్టిక్ అసెట్స్) భాగంగా బంగారం నిల్వల వివరాలు చూపించాలి.

గోల్డ్ అమ్మితే టాక్స్ ఉంటుందా?

  • Tax On Physical Gold : హోల్డింగ్ పీరయడ్​ను అనుసరించి బంగారం (ఫిజికల్ గోల్డ్) అమ్మకాలపై పన్ను విధిస్తారు. బంగారాన్ని కొన్న 3 ఏళ్లలోపే, దానిని విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాల కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడు ఏళ్ల తరువాత బంగాన్ని విక్రయిస్తే, లాంగ్​-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఇండెక్సేషన్​ ప్రయోజనంతో 20 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.
  • Tax On Digital Gold : డిజిటల్ గోల్డ్​పై వివిధ రకాలుగా పన్ను విధిస్తారు. అయితే స్వల్పకాలిక లాభాలపై ఎలాంటి పన్ను విధించరు. 3 ఏళ్ల తరువాత డిజిటల్ గోల్డ్ విక్రయిస్తే, లాంగ్​-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఇండెక్సేషన్​ ప్రయోజనంతో 20 శాతం పన్ను విధిస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్స్​ (SGB)
నష్టభయం​ లేని పెట్టుబడులు పెట్టాలని కోరుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్స్ మంచి ఎంపిక అవుతాయి. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే?

  • గరిష్ఠ పెట్టుబడి : మీరు సంవత్సరానికి గరిష్ఠంగా 4 కిలోల వరకు బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.
  • వడ్డీ : సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అయితే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది.
  • పన్ను మినహాయింపు : సావరిన్ గోల్డ్​ బాండ్స్​ను మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు (8 సంవత్సరాలు) విక్రయించకుండా అలానే ఉంచిదే, మీరు పెట్టిన పెట్టుబడిపై ఎలాంటి పన్ను విధించరు.
  • జీఎస్టీ : సావరిన్ గోల్డ్ బాండ్స్​పై వస్తు, సేవల పన్ను విధించరు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు : ఆదాయ పన్ను శాఖ గోల్డ్ ఈటీఎఫ్​లను, మ్యూచువల్ ఫండ్​లను ఫిజికల్ గోల్డ్​ లాగానే పరిగణిస్తుంది. కనుక వీటిని 3 ఏళ్ల తరువాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూల ధనలాభాల కింద 20 శాతం వరకు పన్ను విధిస్తుంది.

బంగారు ఆభరణాలు కొంటున్నారా? గోల్డ్ ప్యూరిటీ గురించి తెలుసుకోండిలా! - How To Check Gold Purity

Cheapest Gold Market In The World : చౌకగా బంగారం కొనాలా?.. ఆ 7 దేశాల్లో డెడ్​ చీప్​గా పసిడి నగలు దొరుకుతాయ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.