How To Avoid Tyre Burst : మనలో చాలా మంది కొత్త కారు కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ బాగానే చేస్తారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత కనీసం వెహికిల్ కండీషన్‌లో ఉందా లేదా అని కూడా పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా? అయితే.. అలర్ట్‌గా ఉండాల్సిందే అంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు. ఎందుకంటే రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో.. రహదారులపై స్పీడ్‌గా ప్రయాణించేటప్పుడు కారు టైర్లు ఒత్తిడికి గురై పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు టైర్లు ఎందుకు పేలుతాయి? టైర్ పేలినప్పుడు కారును ఏ విధంగా కంట్రోల్ చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారు టైర్లు పేలడానికి కారణాలు :
- కారు టైర్లలో గాలి తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా కూడా పేలిపోయే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. అందుకే యూజర్ మాన్యువల్ బుక్‌లో సూచించిన విధంగా టైర్లలో గాలి నింపాలి.
- అలాగే ఎండకాలంలో రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టైర్లు వేడెక్కుతాయి. ఇలా టైర్లలో పీడనం ఎక్కువైతే కూడా పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
- హై స్పీడ్‌గా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా టైర్లు పేలుతాయి.
- రోడ్డుపై గుంతులు ఉండటం వల్ల కూడా టైర్లు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
- అలాగే టైర్లు పాతగా మారిపోయినవి వాడటం వల్ల కూడా పేలిపోయే ప్రమాదం ఉందట.
మీ కారు మంచి ధరకు అమ్ముడుపోవాలంటే - ఇలా చేయండి!
టైర్ పేలితే ఇలా చేయండి :
- కారు టైర్ పేలినప్పుడు ఆందోళన చెందకండి. భయపడకుండా ప్రశాంతంగా ఉండేలా మైండ్‌ను సెట్ చేసుకోండి.
- కార్ టైర్ పేలితే అది ఒకే వైపు స్టీరింగ్ తిరిగేలా చేస్తుంది. కాబట్టి, రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలను ఢీ కొట్టకుండా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోండి.
- కారు వేగాన్ని మెల్లిగా తగ్గిస్తూ ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కన నిలపండి.
- అలాగే వెనక నుంచి వస్తున్న వాహనాలకు సిగ్నల్‌గా హజర్డ్ లైట్‌ను ఆన్ చేయండి.
- సడన్‌గా బ్రేక్ వేయవద్దని గుర్తుంచుకోండి.
ఇలా చెక్ చేసుకోండి :
- ప్రతీ వారం టైర్లలో గాలి సరిగా ఉందో లేదో చెక్ చేయండి.
- ముఖ్యంగా వేసవి కాలంలో కార్ బయటకు తీస్తున్నప్పుడు టైర్లలో రోజూ గాలిని చెక్ చేసుకోండి.
- టైర్లలో గరిష్ఠంగా గాలిని ఎంత నింపాలో యూజర్ మ్యాన్యువల్ బుక్ ద్వారా తెలుసుకోండి.
- లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తే కారు టైర్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
- రోడ్డుపై గుంతలు ఉంటే వాటిని తప్పిస్తూ నడపండి.
- ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు టైర్లు పేలకుండా ఉంటాయని నిపుణులంటున్నారు.
టైర్లలో రకాలు తెలుసా?
- చూడటానికి కారు టైర్లు అన్నీ ఒకేలా కనిపించినా కూడా అందులో వేగాన్ని బట్టి వివిధ రకాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
- కారు టైర్ పై 'S' సింబల్ ఉంటే అది స్టాండర్డ్ అని అర్థం. ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.
- కారు టైర్ పై 'H' సింబల్ ఉంటే అది హై స్పీడ్ అని అర్థం. ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 230 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.
- కారు టైర్ పై 'V' సింబల్ ఉంటే అది వెరీ హై స్పీడ్ అని అర్థం. ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 230 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో కూడా నడపవచ్చు.
కారు కొనుగోలు చేస్తున్నారా? - ఈ సేఫ్టీ ఫీచర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోండి!