ETV Bharat / business

ఇల్లు లేదా ఫ్లాట్​ కొంటున్నారా? ఈ 8 అంశాలను కచ్చితంగా చెక్ చేసుకోండి! - new house buying process

Home Buying Checklist : మీరు మంచి ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇల్లు లేదా ఫ్లాట్​ కొనేముందు ఎలాంచి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే అంశాలు చూసుకోవాలి? అనే విషయాలను ఆ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

new house buying process
Home Buying Checklist
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 6:06 PM IST

Home Buying Checklist : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ప్రస్తుత కాలంలో ఇంటిని కొనుగోలు చేయడం, నిర్మించడం అనేది ఎంత కష్టసాధ్యమైన పనో మనందరికీ తెలిసిందే. కనుక, మన అవసరాలకు సరిపోయే ఇంటిని కొనుగోలు చేయడమే ఉత్తమం. అలాగే, ప్రాపర్టీ కొనుగోలు సమయంలో అడుగడుగునా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. కనుక, ఇంటి కొనుగోలు చేసే ముందే దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. ప్రణాళికను రూపొందించుకోండి
    ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో బడ్జెట్‌ చాలా ప్రధానమైనది. కనుక మీ కలల ఇల్లు కొనుగోలుకు కావాల్సిన బడ్జెట్​ గురించి ముందే ఒక ప్రణాళిక వేసుకోవాలి. కాస్త దూరమైనా సరే మీ బడ్జెట్‌ పరిమితిలోపు, మీ స్థోమతకు తగ్గ ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నప్పుడు అనవసరపు ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి. తద్వారా మీరు అనుకున్న బడ్జెట్​లోనే ఇల్లు కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.
  2. అనువైన ప్రదేశం
    చదువు, ఉపాధి కోసం మనం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాం. కనుక మనం వేగంగా బయటకు వెళ్లి, తిరిగి వేగంగా వచ్చేంత సమీపంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి. రోడ్డు సుదుపాయం, అన్ని రకాల రవాణా సౌకర్యాలు, స్కూల్స్‌, సూపర్​ మార్కెట్స్‌ ఇంటికి దగ్గర్లోనే ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల భవిష్యత్‌లో ఇంటి విలువ బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేయడానికి ముందు, భవిష్యత్​లో బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అక్కడే మీ కలల ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా కట్టుకోవాలి.
  3. కనీస వసతలు
    త్రాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కీలకం. అవి సరిగ్గా లేనప్పుడు విశాలంగా ఉన్న ఇల్లు కూడా సౌకర్యాన్ని ఇవ్వదు. సమృద్ధిగా నీటి వసతి, పవర్‌ బ్యాకప్‌ సౌకర్యాలు ఉన్న ఇంటిని మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం ప్రతి కుటుంబం వారి ఆర్థిక స్థితి మేరకు తగిన మోటారు వాహనాలను కలిగి ఉంటోంది. కనుక, ఇంటిని ఎంచుకునే సమయంలో తగినంత పార్కింగ్‌ ప్రదేశం​ ఉండేలా చూసుకోవాలి. రెసిడెన్షియల్‌ సొసైటీలో ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే పార్కింగ్‌ సౌకర్యం డీల్‌లో భాగంగా వస్తుంది. మీ అవసరం, బడ్జెట్‌ ఆధారంగా అదనపు పార్కింగ్‌ స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఇండిపెండెంట్‌ ఇళ్లకు పార్కింగ్‌ సమస్య ఉంటుంది. కనుక ఇల్లు కొనుగోలు చేసే ముందు పార్కింగ్‌ గురించి కచ్చితంగా అడిగి తెలిసుకోవాలి.
  4. ముందే నిర్ణయించుకోండి
    ఇంటిని కొనుగోలు చేయకముందే, నిర్మాణంలో ఉన్న ఇంటిని తీసుకోవాలా? లేదా సిద్ధంగా ఉన్న ఇంటిని తీసుకోవాలా? అనేది నిర్ణయించుకోవాలి. ఈ రెండింటి విషయంలో ఉన్న లాభనష్టాలను ముందే అంచనా వేసుకోవాలి. ఇంకా నిర్మాణం జరుగుతున్న ఇంటిని కొనుగోలు చేస్తే, మనకు నచ్చినట్లుగా డిజైన్ మార్పులు చేసుకోవచ్చు. అదే నిర్మాణం అయిన ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటే ఇంటికి ఉండే అదనపు ఆకర్షణలు, లోటుపాట్లు వెంటనే తెలిసిపోతాయి. దీంతో ఆ ఇంటిని కొనుగోలు చేయాలా? వద్దా? అనే నిర్ణయం ముందే తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదు పూర్తిగా నిర్మాణం అయిన ఇంటికి జీఎస్​టీ కూడా ఉండదు. ఇది ఆర్థికంగా కలిసి వచ్చే అంశం.
  5. బిల్డర్ల గత ప్రాజెక్టులను పరిశీలించండి
    ఇంటి కొనాలని నిర్ణయం తీసుకున్న తరువాత, డెవలపర్‌ విశ్వసనీయతను కూడా పరిశీలించాలి. ముఖ్యంగా వేర్వేరు బిల్డర్లు చేపట్టిన గత ప్రాజెక్టులను పరిశీలించాలి. వాటి నాణ్యత బాగుందా? లేదా? చెక్​ చేసుకోవాలి. సదరు బిల్డర్ల వద్ద ఇంతకు ముందు ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తులను సంప్రదించాలి. అప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. సాధారణంగా బిల్డర్లు ప్రాజెక్ట్‌ పనుల్లో జాప్యం చేస్తుంటారు. కనుక మీ బిల్డర్​ గతంలో అలాంటి జాప్యాలు చేశాడా? పైగా జాప్యం జరిగిన దానికి ఫైన్ కట్టాడా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. కాస్త ఖర్చు ఎక్కువైనా మార్కెట్‌లో 'గుడ్‌విల్‌' ఉన్న బిల్డర్‌నే ఎంచుకోవాలి.
  6. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్
    మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్ట్‌కు RERA(రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్‌ ఉండాలి. అందుకే వెబ్‌సైట్‌లో దాని రెరా అప్రూవల్​ ఉందో లేదో పరిశీలించాలి. నిర్మాణ అడ్వర్టయిజ్​మెంట్లలో కూడా రియల్​ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నంబర్‌ ఉండాలి. RERA తన వెబ్‌సైట్‌లో చాలా సమాచారాన్ని అందిస్తుంది. కనుక డెవలపర్​కు సంబంధించిన సమాచారం, ప్రాజెక్ట్‌ స్థితితో సహా ముఖ్యమైన వివరాలను మీరు యాక్సెస్‌ చేయొచ్చు. ఇందులో రిజిష్టర్‌ అయిన డెవలపర్లు ప్రతి మూడు నెలలకు ఓసారి నిర్మాణ పురోగతిని అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ రిపోర్ట్​లను అప్‌లోడ్‌ చేయకపోతే డెవలపర్లకు పెనాల్టీ తప్పదు. దీనివల్ల పారదర్శకతతో పాటు, కొనుగోలుదారులకు భద్రత లభిస్తుంది.
  7. అదనపు ఖర్చులు
    ఇల్లు లేదా ఫ్లాట్​​ విలువ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఆయా ప్రదేశాలను అనుసరించి మారుతూ ఉంటాయి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న లొకేషన్‌ ఆధారంగా ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు. ఆస్తి కొనుగోలు విషయంలో నిపుణుల సూచనలు పాటించడం చాలా మంచిది. ఇది చాలా నష్టాలు, అవాంతరాలను నివారించడానికి, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకుగాను రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీలకు, ల్యాండ్‌ సర్వేయర్‌, హోమ్‌ ఇన్‌స్పెక్టర్‌లకు కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. అంతేకాకుండా ఆస్తి కొనుగోలులో అనేక లీగల్​ సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన అన్ని చట్టాల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి. ఇందుకుగాను నోటరీలకు, లాయర్లకు, రియల్ ఎస్టేట్ నిపుణులకు కూడా డబ్బు చెల్లించాలి. నిర్మాణంలో ఉన్న ఇంటికి జీఎస్‌టీని చెల్లించాలి. యూనిట్‌ ధర రూ.45 లక్షలు లోపు ఉంటే 1%, రూ.45 లక్షలు దాటితే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి యాజమానిగా, హక్కుదారుడిగా ప్రతి ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లించాలి.
  8. సేల్‌ డీడ్ చాలా ముఖ్యం
    మీరు కొనుగోలు చేసిన ఆస్తికి ముఖ్యమైన ఆధారం సేల్​డీడ్​. ఇది ఆస్తి యాజమాన్య బదిలీని స్పష్టంగా పేర్కొంటూ విక్రేత ద్వారా కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడు ఆస్తికి చట్టబద్ధమైన యజమాని అవుతారు. ఈ పత్రం సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వద్ద నమోదవుతుంది. హోమ్‌లోన్‌ తీసుకున్నసమయంలో, రీ-సేల్‌ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కనుక దాన్ని సురక్షితంగా భద్రపరచాలి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఆర్థికపరమైన అంశాలే కాకుండా, అనేక న్యాయపరమైన అంశాలు కూడా ఉంటాయి. కొనుగోలుకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణుల నుంచి, ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేసినవారి నుంచి సలహాలు, సూచనలు పొందడం చాలా మంచిది.

అద్దె ఇళ్లు కంటే సొంతిల్లు బెటర్​​! ఎందుకో తెలుసా?

ఇల్లు కట్టుకోవాలా, కొనుక్కోవాలా? ఏది మేలు​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.