ETV Bharat / business

మీ 'హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ'ని మరో సంస్థకు మార్చాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Health Insurance Portability

Health Insurance Portability Pros And Cons : మీరు ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేకపోవచ్చు. లేదా బీమా సంస్థ పనితీరు మీకు నచ్చకపోవచ్చు. లేదా తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ దొరకవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్య బీమా పాలసీని మరో సంస్థకు మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ఇన్సూరెన్స్​ పరిభాషలో 'పోర్టబిలిటీ' అంటారు.

health insurance portability
health insurance portability (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 11:57 AM IST

Health Insurance Portability Pros And Cons : ఆరోగ్య బీమా పాలసీ మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేకపోవచ్చు. లేదా సదరు ఇన్సూరెన్స్ కంపెనీ పనితీరు మీకు నచ్చకపోవచ్చు. లేదా తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ దొరకవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్య బీమా పాలసీని మరో సంస్థకు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీన్నే బీమా పరిభాషలో 'పోర్టబిలిటీ' అంటారు. మరి మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మరో సంస్థకు మార్చాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. హెల్త్​ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీలో ఉన్న ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Health Insurance Portability Benefits : భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీని మరో సంస్థకు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడం, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ పోర్టబిలిటీ సదుపాయాన్ని తీసుకువచ్చింది. అంటే మీ ఆరోగ్య బీమా పాలసీని A అనే సంస్థ నుంచి B అనే మరో సంస్థకు మార్చుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా ఇప్పటి వరకు పాత పాలసీ అందించిన అన్ని ప్రయోజనాలు, వ్యవధిని కొనసాగిస్తూ, కొత్త సంస్థ నుంచి అదనపు ప్రయోజనాలతో పాలసీని తీసుకునేందుకు వీలవుతుంది.

ఎప్పుడు పోర్ట్ చేయాలి?
ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే, పాలసీ పునరుద్ధరణకు 45 రోజుల ముందే అవసరమైన అన్ని చర్యలు ప్రారంభించాలి. ఇప్పుడు చాలా సంస్థలు రెన్యువల్​కు ఒక రోజు ముందు, అలాగే గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పాలసీని పోర్ట్‌ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మంచిది. తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత, కొత్త సంస్థ మీకు పాలసీని ఇవ్వకుంటే తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఏ సందర్భాల్లో

  • మీ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు, షరతులు మీకు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే సంస్థను మార్చుకునేందుకు ప్రయత్నించాలి.
  • పాలసీ విలువ తక్కువగా ఉన్నప్పుడు, అదే ప్రీమియానికి ఇతర సంస్థలు అధిక రక్షణను ఇస్తున్న సందర్భాల్లోనూ పోర్ట్ చేసుకోవచ్చు.
  • మీకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రులు బీమా సంస్థ నెట్‌వర్క్‌ జాబితాలో లేనప్పుడు, ఆ సంస్థను మార్చుకునే విషయాన్ని పరిశీలించాలి.

కచ్చితంగా పరిగణించాల్సిన అంశాలు ఇవే!
పాలసీని మరో సంస్థకు మార్చాలని అనుకున్నప్పుడు 'ఇన్సూరెన్స్ అమౌంట్' గురించి కచ్చితంగా చూసుకోవాలి.​ ఉదాహరణకు మీకు A అనే బీమా సంస్థలో రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50 లక్షలు అయ్యింది. కానీ మీరు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారి రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బీమా సంస్థ రూ.7.5 లక్షల పాత పాలసీని అట్టే ఉంచి, మిగతా రూ.2.5 లక్షలను మాత్రమే కొత్త పాలసీగా చూస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వేచి ఉండే వ్యవధి, ఇతర షరతులు కూడా వర్తిస్తాయి. కనుక పాలసీ విలువ పెంచుకోవాలని, కొత్త సంస్థకు మారేటప్పుడు కచ్చితంగా ఇన్సూరెన్స్ అమౌంట్​ గురించి, ప్రయోజనాల గురించి కచ్చితంగా ఆలోచించాలి.

వివరాలు దాచవద్దు!
కొత్త బీమా సంస్థకు మారేటప్పుడు, ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిముల వివరాలు స్పష్టంగా చెప్పాలి. మీ ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించి వివరించాలి. పాలసీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయంతో చాలా మంది ఈ విషయాలు చెప్పరు. కానీ, పాలసీ ఇచ్చిన తర్వాత ఇవి బయటపడితే మీకు పరిహారం లభించదు. పైగా పాలసీని మొత్తానికే రద్దు చేయవచ్చు కూడా.

ఇవీ చూడండి!
కొత్త ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు తప్పనిసరిగా దాని క్లెయిము చెల్లింపుల నిష్పత్తిని చూడాలి. తక్కువ ప్రీమియం అనే ఒకే ఒక్క అంశం పోర్ట్​ కావడానికి కారణం కాకూడదు. బీమా విలువ, పరిహారం చెల్లించే తీరు, ఉప పరిమితులు, సహ-చెల్లింపులు లాంటి నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. ప్రతి ఆరోగ్య బీమా పాలసీకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. పాత పాలసీలో మీరు ఏమి వదిలేస్తున్నారో, కొత్త దాంట్లో అదనంగా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తున్నాయో చూసుకోవాలి. ఇందు కోసం రెండు పాలసీలను సరిపోల్చి చూసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలి.

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ రిజెక్ట్ అయ్యిందా? కారణాలు ఇవే - ఇలా చేస్తే సమస్యకు చెక్​! - Health insurance claim

'అన్​లిమిటెడ్' హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​ - ఎన్ని సార్లైనా, ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు! - Unlimited Health Insurance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.