ETV Bharat / business

ఆరోగ్య బీమాపై GST తగ్గింపు నిర్ణయం వాయిదా! క్యాన్సర్ మందులపై తగ్గిన ట్యాక్స్​ - GST Council Meeting 2024

GST Council Meeting 2024 : జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్​టీ తగ్గింపు విషయంలో జీఎస్​టీ కౌన్సిల్‌లో నిర్ణయం వాయిదా పడింది. ఇదే అంశంపై ప్రతిపాదనలను పరిశీలించేందుకు జీఓఎంను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. క్యాన్సర్ మందులపై జీఎస్​టీని 12 శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ GST కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

GST Council Meeting 2024
GST Council Meeting 2024 (ANI, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 8:02 PM IST

Updated : Sep 9, 2024, 9:07 PM IST

GST Council Meeting 2024 : జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్​టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి, ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమావేశంలో క్యాన్సర్‌ ఔషధాలపై, నమ్కీన్స్​పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. కౌన్సిల్‌ సమావేశం అనంతరం సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి వెల్లడించారు.

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్​టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ, ఈ జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి, మంత్రుల బృందానికి(GoM) ఆ బాధ్యతను అప్పగించింది. బిహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలో జీఎస్​టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికే ఈ బాధ్యతనూ కట్టబెట్టంది. కొంతమంది కొత్త సభ్యులు ఈ బృందంలో చేరతారని, అక్టోబర్‌ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనిపై నవంబర్‌లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

క్యాన్సర్‌ ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. స్నాక్స్‌పై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్​టీని తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2026 మార్చి తర్వాత జీఎస్​టీ పరిహార సెస్సు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎస్​టీ రేట్ల హేతుబద్ధీకరణ, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీ అంశాలపైనా చర్చించినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, కాసినోలపై వచ్చే ఆదాయం 6 నెలల్లో 412% పెరిగి రూ. 6909 కోట్లకు చేరుకుందని నిర్మలా తెలిపారు.

'కేంద్ర సర్కార్​ పన్ను విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి - సర్‌ ఛార్జీలు, సెస్‌లు 10 శాతానికి మించకూడదు' - Union Budget Preparatory

ఆరోగ్య బీమా మరింత భారం - 15% పెరగనున్న ప్రీమియం! కారణం ఏంటంటే? - Health Insurance

Last Updated : Sep 9, 2024, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.