5 Upcoming cars in September : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కచ్చితంగా కారు ఉండాల్సిందే. అందుకే చాలా మంది మంచి మైలేజ్ ఇచ్చే కార్లను కొనాలనుకుంటారు. మరి మీరు కూడా కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంచి సీటింగ్‌తో, ఫీచర్స్ & స్పెక్స్ ఉన్న కార్లను హ్యుందాయ్, టాటా వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సెప్టెంబరులో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
1. Tata Curvv : టాటా కర్వ్ ఐసీఈ మోడల్ కారు సెప్టెంబర్ 2న భారత మార్కెట్లో లాంఛ్ కానుంది. ఈ ఏడాది ఆగస్టులో టాటా కర్వ్ ఈవీ విడుదలైంది. ఆ తర్వాత టాటా కంపెనీ నుంచి వస్తున్న కారు ఇదే కావడం వల్ల, ఈ మోడల్‌పై ఆసక్తి ఏర్పడింది. ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు 6- స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీఏ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది.
2. Hyundai Alcazar Facelift : హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ కారు సెప్టెంబర్ 9న భారత మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే హ్యుందాయ్ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ఎస్యూవీ కొత్త డిజైన్, ఏడీఏఎస్, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే సహా మరిన్ని కొత్త ఫీచర్లతో రానుంది. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది.
3. Tata Nexon CNG : టాటా నెక్సాన్ సీఎన్జీ కారు భారత మార్కెట్లోకి సెప్టెంబర్‌లో లాంఛ్ కానుంది. ఈ కారును ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. భారత్‌లో మొదటి టర్బో, పెట్రోల్, సీఎన్జీ ఎస్యూవీ ఇదే కావడం విశేషం.
4. Mercedes Maybach EQS : మెర్సడీస్ బెంజ్ కంపెనీ ఈ కారును సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. దీనిలో 107.8kWh బ్యాటరీ ఉంటుంది. ఈ కారు బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ కారులో గరిష్ఠంగా గంటకు 210 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. కేవలం 4.4 సెకన్లలోనే ఇది గంటకు 0-100 కి.మీల వేగాన్ని అందుకోగలదు.
5. MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ సెప్టెంబర్ 11న లాంఛ్ కానుంది. ఈ కారు 50.6kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 460 కి.మీల రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.