Gold Rate Today October 14, 2024 : దేశంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,364 ఉండగా, సోమవారం నాటికి రూ.99 తగ్గి రూ.78,265కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.93,444 ఉండగా, సోమవారం నాటికి రూ.759 తగ్గి రూ.92,685కు చేరింది.
- Gold Price In Hyderabad October 14, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,265గా ఉంది. కిలో వెండి ధర రూ.92,685గా ఉంది.
- Gold Price In Vijayawada October 14, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,265గా ఉంది. కిలో వెండి ధర రూ.92,685గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 14, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,265గా ఉంది. కిలో వెండి ధర రూ.92,685గా ఉంది.
- Gold Price In Proddatur October 14, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,265గా ఉంది. కిలో వెండి ధర రూ.92,685గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లు ఉండగా, సోమవారం కూడా 2656 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.29 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 14, 2024 : సోమవారం కూడా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.42,50,000 |
ఇథీరియం | రూ.1,58,000 |
టెథర్ | రూ.76.55 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,000 |
సొలోనా | రూ.8,250 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today October 14, 2024 : వరుస నష్టాల నుంచి కోలుకుని దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. ప్రధాన కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఈ వారం ప్రకటించనున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాంటి బడా కంపెనీల త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 420 పాయింట్లు లాభపడి 81,793 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 126 పాయింట్లు వృద్ధిచెంది 25,090 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలివర్
రూపాయి విలువ
Rupee Open October 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.06గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices October 14, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices October 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 1.09 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 78.18 డాలర్లుగా ఉంది.