Gold Rate Today February 28th 2024 : దేశంలో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,148 ఉండగా, బుధవారం నాటికి రూ.39 తగ్గి రూ.64,109కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.71,484 ఉండగా, బుధవారం నాటికి రూ.31 పెరిగి రూ.71,515కు చేరుకుంది.
- Gold Price In Hyderabad February 28th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
- Gold Price In Vijayawada February 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
- Gold Price In Vishakhapatnam February 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
- Gold Price In Proddatur February 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,109గా ఉంది. కిలో వెండి ధర రూ.71,515గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2032 డాలర్లు ఉండగా, బుధవారం కూడా 2032 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.48 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 28th 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.47,14,483 |
ఇథీరియం | రూ.2,68,685 |
టెథర్ | రూ.82.95 |
బైనాన్స్ కాయిన్ | రూ.32,828 |
సొలోనా | రూ.8,905 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 28th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడుతున్నా, దేశీయ మార్కెట్లు కాస్త మెరుగ్గానే ట్రేడవుతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 73,184 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 21 పాయింట్లు వృద్ధి చెంది 22,220 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, టైటాన్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఏసియన్ పెయింట్స్, విప్రో, మారుతి సుజుకి, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ
రూపాయి విలువ
Rupee Open February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices February 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices February 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.40 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.30 డాలర్లుగా ఉంది.
2024 మార్చి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!
అన్నదాతలకు గుడ్‌న్యూస్ - ఫిబ్రవరి 28న 'పీఎం కిసాన్ నిధులు' రిలీజ్ - ఎలా చెక్ చేసుకోవాలంటే?