ETV Bharat / business

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women - GOLD INVESTMENT TIPS FOR WOMEN

Gold Investment Tips For Women : అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సంప్రదాయం ప్రకారం, బంగారు నగలు కొనడం మామూలే. అయితే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్​లు, సావరిన్ గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్​ లాంటి ఇతర పెట్టుబడి మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ సురక్షిత ఇన్వెస్ట్​మెంట్​ల గురించి పూర్తి వివరాలు మీ కోసం.

Gold Investment options
Gold Investment Tips For Women (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 10:16 AM IST

Gold Investment Tips For Women : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం శుభప్రదమని భారతీయ మహిళలు భావిస్తుంటారు. అందుకోసమే బంగారు నగలు కొంటూ ఉంటారు. బంగారం ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. అత్యవసరాలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం నేడు అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక స్వేచ్ఛ!
పెట్టుబడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు దీర్ఘకాలిక భద్రతను అందిస్తుంది. పైగా ఇది మహిళా సాధికారతకు దారితీస్తుంది. అంతేకాకుండా కుటుంబానికి అవసరమైన సంపదను సృష్టిస్తుంది. బంగారంలో పెట్టుబడి ఆర్థిక నష్టాల నుంచి, ద్రవ్యోల్బణ ప్రమాదాల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం ఎఫ్​డీ, బంగారం, బాండ్లు లాంటి వివిధ రకాల స్థిరమైన పెట్టుబడులను ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారు మ్యూచువల్​ ఫండ్స్, ఈక్విటీ షేర్స్​ లాంటి పెట్టుబడులను కూడా ఎంచుకోవచ్చు. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టిన పెట్టుబడులకు నష్టభయం ఎక్కువగా ఉంటుంది.

రిస్క్ లేని పెట్టుబడి
బంగారం స్పష్టమైన విలువ గల ఒక ఆస్తి. ఇతర ఆస్తుల మాదిరిగా అధిక తరుగుదల లేదా అస్థిరత ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక భద్రత చేకూరుతుంది. పైగా ఆర్థిక నష్టాలు వచ్చినప్పుడు, మీ బంగారం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అదే సమయంలో సులభంగా డబ్బును చేసుకోవడానికి (లిక్విడిటీ) వీలవుతుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

భౌతిక బంగారం Vs డిజిటల్ బంగారం
చాలా మంది కాయిన్స్​ లేదా కడ్డీలు లాంటి భౌతిక బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమే. ఇలాంటి భౌతిక బంగారం ఇంట్లో ఉన్నప్పుడు, అవసరమైన సందర్బాల్లో అది మనకు అక్కరకు వస్తుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు చేసుకోవడానికి వీలవుతుంది. లేదా బ్యాంక్​లో కుదువపెట్టి, తక్కువ వడ్డీకే సులభంగా రుణం తీసుకోవడానికి వీలవుతుంది. పైగా కాలం గడిచిన కొలదీ మీ బంగారం విలువ పెరుగుతుంది. అయితే ఆధునిక కాలంలో భౌతిక బంగారంతోపాటు డిజిటల్ బంగారంపైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలుగుతోంది. దీని వల్ల దొంగలభయం ఉండదు. భౌతికంగా వాటికి కాపాలా ఉండాల్సిన అవసరం ఉండదు. పైగా మార్కెట్​కు అనుగుణంగా దానిపై వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది.

చూశారుగా, మరి మీరు కూడా బంగారంపై పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఉన్న టాప్​-3 గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సావరిన్​ గోల్డ్​ బాండ్లు
Sovereign Gold Bonds : ప్రభుత్వం జారీచేసిన ఈ బాండ్లు బంగారం అంతర్లీన విలువను కలిగి ఉంటాయి. పైగా వీటిపై ప్రభుత్వ హామీతో రాబడి కూడా వస్తుంది. ఇది ప్రభుత్వ పథకం కనుక ఎలాంటి రిస్క్​ ఉండదు. 8 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్​తో కనిష్ఠంగా 1గ్రాము నుంచి 20కేజీల వరకు వాటి నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.5% ఫిక్సడ్​ రేటుతో వడ్డీని పొందవచ్చు. ఈ గోల్డ్​ బాండ్ల​ సర్టిఫికెట్​ను భౌతిక బంగారంగానూ మార్చుకోవచ్చు.

గోల్డ్ ఎక్స్ఛేంజ్​​ ట్రేడెడ్​ ఫండ్స్​
Gold Exchange Traded Funds : ఇవి బంగారం ధరను ట్రాక్ చేసే మ్యూచువల్​ ఫండ్స్​. దీనిలో అధిక లిక్విడిటీ సౌకర్యం ఉంటుంది. కనుక మీకు నచ్చినప్పుడు వీటిని అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు. స్టాక్​ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు జరపవచ్చు. దాచుకోవడం, భద్రతా సమస్యలు లాంటివి ఉండవు. అయినప్పటికీ సావరిన్​ గోల్డ్​ బాండ్ల వలె రాబడికి గ్యారంటీ ఉండదు. బంగారం ధరలో మార్పులను ఆధారంగా చేసుకొని వీటి విలువలో మార్పులు జరుగుతాయి. అంటే రిస్క్, రివార్డ్ రెండూ అధికంగానే ఉంటాయి.

డిజిటల్​ గోల్డ్​
Digital Gold : ఆన్​లైన్​లో​ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీనినే డిజిటల్​ గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్​ అంటారు. సిప్​ విధానంలో రూ.500 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా పెట్టి డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. EMI పద్ధతిలో చాలా చిన్న పరిణామాలలో కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఈ పద్ధతిలో సులభంగా ఫిజికల్​ గోల్డ్​ను లిక్విడేట్ చేయడానికి వీలుంటుంది. బంగారం కొనాలనుకునే మహిళలు సురక్షితమైన ప్లాట్​ఫామ్స్ ద్వారా డిజిటల్ గోల్డ్​పై ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే డిజిటల్​ బంగారం భద్రత అనేది, మనం ఎంచుకునే ప్లాట్​ఫామ్​ విశ్వనీయత మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్లాట్​ఫామ్​లు నిల్వ ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి. అయితే ఈ ఛార్జీలు చాలా నామమాత్రంగా ఉంటాయి. అలాగే ఈ డిజిటల్​ గోల్డ్​పై సంపాదించే రాబడికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

నోట్​ : మహిళలు ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నా, ముందుగా వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లాభ, నష్టాలను బేరీజు వేసుకోవాలి. ఒక వేళ మీకు దీనిపై సరైన అవగాహన లేకపోతే, మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఎల్‌ఐసీ పాలసీ కొంటున్నారా? క్లెయిమ్​​ సెటిల్‌మెంట్ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే! - LIC Claims Settlement Procedure

బెస్ట్ స్కీమ్​ - రోజుకు రూ.13 కడితే చాలు - జీవితాంతం నెలకు రూ.5000 పెన్షన్! - Atal Pension Yojana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.