ETV Bharat / business

చైల్డ్ సేఫ్టీలో కియా శభాష్​- మహీంద్రా కారుకు సింగిల్ స్టార్ రేటింగ్- కంపెనీ ఏమందంటే? - Cars NCAP Rating

Global NCAP Crash Test Rating 2024 : కియా కంపెనీకి చెందిన కేరెన్స్ మోడల్ కారు ఇటీవల గ్లోబల్‌ NCAP క్రాష్ టెస్ట్​లో చైల్డ్ ప్రొటెక్షన్‌ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్ విభాగంలో 3స్టార్ రేటింగ్ పొందింది. మరోవైపు, మహీంద్రా బొలెరో నియో రెండు విభాగాల్లో 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ నేపథ్యంలో మహీంద్రా కంపెనీ స్పందించింది.

Global NCAP Crash Test Rating
Global NCAP Crash Test Rating
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 9:32 PM IST

Updated : Apr 25, 2024, 8:40 AM IST

Global NCAP Crash Test Rating 2024 : కియా మోటార్స్‌కు చెందిన కేరెన్స్ మోడల్ భారత మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందింది. డిజైన్‌, లుక్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ పరంగా కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ కంపెనీ ఇటీవలే 2024 కియా కేరెన్స్ మోడల్‌కు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ను నిర్వహించింది. అడల్ట్‌ సేఫ్టీ విభాగంలో 3 స్టార్‌ రేటింగ్‌ను సాధించగా, ఛైల్డ్‌ సేఫ్టీ విభాగంలో 5 స్టార్‌ను స్కోర్ చేసింది కేరెన్స్ మోడల్.

Kia Carens Global Ncap Rating 2024 : అడల్ట్ సేఫ్టీ ప్రొటెక్షన్ విభాగంలో, కియా కేరెన్స్​ 34.00కి గాను 22.07 స్కోర్‌ను సాధించి 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. డ్రైవర్, ప్రయాణికుల తలలకు రక్షణ ఉందని ప్రూఫ్‌ చేసుకుంది. అయినప్పటికీ డ్రైవర్ మెడ రక్షణలో కొంత బలహీనతను గుర్తించారు. కానీ డ్రైవర్, ప్రయాణికుడి ఛాతీకి తగినంత రక్షణను అందించింది. ఫుట్‌వెల్ ప్రాంతం అంతగా అనుకూలంగా లేకపోవడం, బాడీ షెల్‌ అస్థిరంగా గుర్తించారు. ఇక ఛైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ పరంగా కేరెన్స్​ అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. పిల్లల భద్రత విభాగంలో 49.00కి 41.11 స్కోర్‌ను సాధించింది. ఫలితంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. హోండా అమేజ్ పెద్దల భద్రత ప్రమాణాల్లో 2 స్టార్ రేటింగ్, చిన్నారుల సెఫ్టీలో జీరోకు పడిపోయింది.

మహీంద్రా బొలెరోకు నియో వన్ స్టార్ రేటింగ్​
Mahindra Bolero Neo Ncap Rating : మరోవైపు, గ్లోబల్ NCAP రేటింగ్‌లో మహీంద్రా బొలెరో నియో పెద్దలు, పిల్లల భద్రత విభాగంలో 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ముఖ్యంగా సీట్ బెల్ట్ రిమైండర్‌ల (SBRలు) విఫలమవడం వల్ల గ్లోబల్ NCAP ఈ రేటింగ్​ను ఇచ్చింది. పూర్తి టెస్టింగ్‌లో ప్యాసింజర్ హెడ్ ప్రొటెక్షన్ సేఫ్‌గానే ఉన్నా కానీ డ్రైవర్ హెడ్ ప్రొటెక్షన్ అంతంత మాత్రంగానే ఉంది. డ్రైవర్‌ ఛాతీకి రక్షణ కల్పించడంలో ఈ కారు అంతగా నిలదొక్కుకోలేక పోయింది. మోకాలి రక్షణలోనూ ఆందోళనలు తలెత్తాయి. ఫుట్‌వెల్ రక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉండనుంది. బాడీ షెల్ అధిక లోడ్‌లను తట్టుకోలేక పోయింది. ఇక చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ పరంగా చూసుకుంటే బొలెరో నియో 49.00 పాయింట్లకు కేవలం 12.71 స్కోర్ చేసి 1-స్టార్ రేటింగ్‌ను పొందింది.

అయితే వన్ స్టార్ రేటింగ్​పై మహేంద్ర సంస్థ స్పందించింది. సేఫ్టీ స్టాండర్డ్స్‌ను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఉత్పత్తులను మెరుగుపరుస్తున్నామని తెలిపింది. సంస్థ నుంచి ఇటీవల విడుదలైన కార్లలో భద్రతా ఫీచర్లు గణనీయంగా పెంచామని ఇదే ఒరవడిని కొనసాగిస్తూ తమ కస్టమర్లకు హామీ ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించింది. మహీంద్రా నుంచి అనేక రకాల ఎస్‌యూవీలు, ఎక్స్‌యూవీలు, ఇతర కమర్షియల్‌ వాహనాలు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

Last Updated : Apr 25, 2024, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.