How To Recover Aadhaar-linked Mobile Number : మనకు నిత్యం అవసరమయ్యే డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను ప్రతి ఒక్కరూ ఏదో ఒక మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకుని ఉంటారు. అయితే చాలా మంది తమది కాకుండా, వేరే ఎవరిదో మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు యాడ్ చేస్తుంటారు. మరికొందరు ఎప్పటికప్పుడు తమ మొబైల్ నంబర్లను మారుస్తూ ఉంటారు. అలాంటి వారు తమ ఆధార్‌తో ఏ నంబర్‌ను లింక్ చేశారో కూడా మరిచిపోతుంటారు. ఇలాంటి వారు ఆధార్ ఓటీపీ తెలుసుకోవాలంటే, చాలా కష్టంగా మారుతుంది. అసలు ఏ నంబర్ ఇచ్చాను? ఎవరిది ఇచ్చాను? అనే ప్రశ్నలతో సతమతమవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఉడాయ్‌లో ఒక ప్రత్యేక సదుపాయం ఉంది. దీంతో మీ ఆధార్- లింక్డ్ మొబైల్ నంబర్‌ను చాలా సులువుగా తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ తెలుసుకోండిలా!
- ముందుగా మీరు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- స్క్రీన్‌పై కనిపించే ‘My Aadhaar’ వెబ్‌సైట్‌కు వెళ్లి ‘Aadhaar Services’ని ఎంచుకొని ‘Verify Email/Mobile Number’పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేసి 'Enter' పై క్లిక్ చేయాలి.
- ఒక వేళ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటే, నంబర్ లింక్ అయినట్లు సందేశం వస్తుంది. ఒక వేళ కాకపోతే లింక్ కాలేదని స్క్రీన్‌పైనే డిస్‌ప్లే అవుతుంది. ఇలా మీ వద్ద ఉన్న మొబైల్ నంబర్‌లలో దేనికి ఆధార్ కార్డ్ లింక్ అయ్యుందో తెలుసుకోవచ్చు.
మీ ఇంట్లో అద్దెకుండేవారి ఆధార్ అడిగారా? ఒరిజినలో కాదో ఎలా చెక్ చేయాలో తెలుసా?
ప్రస్తుత కాలంలో అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా, స్కూల్, కాలేజీ అడ్మిషన్లు ఇలా ప్రతి విషయానికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన ఆధార్ కార్డులో బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సమాచారం ఉంటుంది. అందుకే ఇల్లును అద్దెకు ఇచ్చేవారు, భూముల రిజిస్ట్రేషన్ సమయంలో యజమానులు ఆధార్ కార్డు అడుగుతారు. అప్పుడు విక్రయదారులు ఇచ్చిన ఆధార్ కార్డు ఒరిజినల్‌దో, కాదో తెలుసుకోవడం ఎలాగో తెలుసా?
ఇంటి యజమానికి కొందరు నకిలీ ఆధార్ కార్డును ఇస్తారు. మరికొందరు డూప్లికేట్ కార్డులను సృష్టించి మోసం చేస్తారు. ఇలాంటివి అరికట్టాలంటే వారు ఇచ్చిన ఆధార్ కార్డు అసలైనదో, కాదో తెలుసుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను పడాల్సి ఉంటుంది. అందుకే మీ మొబైల్‌తోనే మీ ఇంట్లో అద్దెకు ఉండేవారు ఇచ్చిన ఆధార్ కార్డు ఒర్జినలా, కాదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటంటే?
- మొదట మీ ఫోన్‌లో యూఐడీఏఐ అభివృద్ధి చేసిన mAadhaar యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఆధార్ సంబంధిత సేవలను పొందడానికి ఉపయోగపడుతుంది.
- ఆ తర్వాత ఆధార్ కార్డును వెరిఫై చేయడానికి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా, మరొకటి ఆధార్ నంబర్‌ను మాన్యువల్‌గా నమోదు చేయడం ద్వారా వెరిఫై చేసుకోవచ్చు.
- ఆధార్ కార్డ్‌ను ధ్రువీకరించడానికి అత్యంత సులువైన మార్గం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం. అందుకే యాప్ డ్యాష్ బోర్డ్ నుంచి QR కోడ్ స్కానర్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు నిజమైనదా, కాదా అని నిర్ధరిస్తూ దానికి సంబంధించిన వివరాలను చూపుతుంది.
- మీరు ఆధార్ నంబరును నేరుగా ధ్రువీకరించడానికి మొదట మీరు బ్రౌజర్లో UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత 12 అంకెల ప్రత్యేక సంఖ్యను ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డు వెరిఫై అవుతుంది.
- ఈ దశలను అనుసరించడం ద్వారా, మీ ఇంట్లో అద్దెకు ఉండేవారు అందించిన ఆధార్ కార్డ్ నిజమైనదో, కాదో తెలుసుకోవచ్చు.