ETV Bharat / business

స్టార్టప్‌లకు ఆశాకిరణాలు ఏంజెల్ ఇన్వెస్టర్స్​- దేశంలో ప్రముఖ నెట్‌వర్క్‌లు ఇవే! - Angel Networks In India

Angel Networks In India : స్టార్టప్‌ల యుగం ఇది. మన దేశంలో గత పదేళ్లలో పెద్దసంఖ్యలో స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి. పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్న యువ ఎంట్రప్రెన్యూర్లు పరిశీలించదగిన గొప్ప మార్గం 'ఏంజెల్ ఇన్వెస్టర్లు'. ఈ రకం ఇన్వెస్టర్లు మంచి పెట్టుబడి అవకాశాల కోసం వెతుకుతుంటారు. సరైన స్టార్టప్ కనిపిస్తే తప్పక ఇన్వెస్ట్ చేస్తారు.

Angel Networks In India
Angel Networks In India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 3:39 PM IST

Angel Networks In India : వ్యాపారం పెట్టాలనే ఆలోచన చేసే వాళ్లంతా 'ఏంజెల్ ఇన్వెస్టర్' అనే పదం గురించి చాలాసార్లు వినే ఉంటారు. ఏంజెల్ అంటే దైవదూత. దైవదూతలా వచ్చి సహాయం చేస్తారనే అర్థం వచ్చేలా 'ఏంజెల్ ఇన్వెస్టర్' అనే పదం ఏర్పడింది. వ్యాపారంలో కొంత వాటాను తీసుకొని దానికి బదులుగా పెట్టుబడిని సమకూర్చడం 'ఏంజెల్ ఇన్వెస్టర్' ప్రత్యేకత. మంచి పెట్టుబడి అవకాశాల కోసం ఏంజెల్ ఇన్వెస్టర్లు నిత్యం వెతుకుతుంటారు. తాము ఎంచుకునే కంపెనీలకు వారు పెట్టుబడితో పాటు మెంటార్‌షిప్‌ను కూడా అందిస్తారు.

ప్రస్తుతం మన దేశంలో 125కుపైగా యాంజెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఏంజెల్ నెట్‌వర్క్‌లు దాదాపు 540 ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్లలో పాల్గొని, దాదాపు 470కిపైగా స్టార్టప్‌లను మద్దతును ప్రకటించాయి. అయితే పెట్టుబడుల సమీకరణ కోసం ఏంజెల్ ఇన్వెస్టర్లను ఎలా కనెక్ట్ కావాలో తెలియక చాలామంది యువ ఎంట్రప్రెన్యూర్లు సతమతం అవుతుంటారు. ఏంజెల్ ఇన్వెస్టర్లతో కనెక్ట్ చేసే దేశంలోని ప్రఖ్యాత ఏంజెల్ నెట్‌వర్క్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్టార్టప్‌లకు సాయం చేసే ప్రఖ్యాత ఏంజెల్ నెట్‌వర్క్స్​
వీ ఫౌండర్ సర్కిల్ (We Founder Circle) : వీ ఫౌండర్ సర్కిల్ (WFC)లో 9వేల మందికిపైగా ఇన్వెస్టర్లు ఉన్నారు. దీన్ని 2020 సంవత్సరంలో నీరజ్ త్యాగి, గౌరవ్ వీకే సింఘ్వి, భావనా భట్నాగర్, వికాస్ అగర్వాల్, సౌరభ్ దేవ్ స్థాపించారు. దాదాపు 100కుపైగా ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్‌లో ఈ నెట్‌వర్క్‌కు చెందిన ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. భారత్‌తో పాటు అమెరికా, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో కూడా ఈ నెట్‌వర్క్ విస్తరించి ఉంది.

ఆహ్ వెంచర్స్ (ah! Ventures) : ఆహ్ వెంచర్స్ అనే ఏంజెల్ నెట్‌వర్క్‌ను 2012లో అభిజీత్ కుమార్, హర్షద్ లహోటీ స్థాపించారు. ఇందులో 3వేల మందికిపైగా ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. దాదాపు 62వేల మంది ఎంట్రప్రెన్యూర్లు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఆహ్ వెంచర్స్ ఇప్పటివరకు 121 స్టార్టప్‌లలో 183 పెట్టుబడులను పెట్టింది. దీని ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ రూ.394 కోట్లు. ఇప్పటిదాకా 16 ఎగ్జిట్‌లు నమోదయ్యాయి.

హైదరాబాద్ ఏంజెల్స్ : హైదరాబాద్ ఏంజెల్స్ అనే ఇన్వెస్టర్ల నెట్‌వర్క్ ప్రధానంగా టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతుంటుంది.

ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ : ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్‌కు మనదేశంలో ఎంతో పేరుంది. ఇందులో ఎంతోమంది సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్లు, బిజినెస్‌మెన్లు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. కొత్తగా ఏర్పడే స్టార్టప్‌లకు పెట్టుబడిని అందించి వాటికి మెంటార్‌షిప్‌ను అందించడం ఈ నెట్‌వర్క్ ప్రత్యేకత. టెక్నాలజీ రంగ స్టార్టప్‌లకు సహాయం చేయడంపై ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ ఫండ్ ఫోకస్ చేస్తుంటుంది.

లీడ్ ఏంజెల్స్ : భిన్న విభిన్న రంగాల స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడమే లీడ్ ఏంజెల్స్ నెట్‌వర్క్ లక్ష్యం. ఇది కూడా ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు చేదోడు అందిస్తుంటుంది.

చెన్నై ఏంజెల్స్ : విభిన్న రంగాల స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడం చెన్నై ఏంజెల్స్ లక్ష్యం. అయితే వీరి ప్రధాన ఫోకస్ టెక్నాలజీ స్టార్టప్‌లపై ఉంది.

లెట్స్ వెంచర్ : లెట్స్ వెంచర్‌ను శాంతి మోహన్, సంజయ్ ఝా కలిసి 2013లో స్థాపించారు. వారు ఇప్పటివరకు 930 ఇన్వెస్ట్‌మెంట్లు చేశారు. వాటి విలువ దాదాపు రూ.92వేల కోట్లు ఉంటుందని అంచనా. లెట్స్ వెంచర్ నెట్‌వర్క్‌లో దాదాపు 19,530 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు.

కోల్‌కతా ఏంజెల్స్ నెట్‌వర్క్ : ఈ నెట్‌వర్క్ కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. తూర్పు భారత దేశంలోని స్టార్టప్‌లకు సాయంపై ఈ ఫండ్ ఫోకస్ చేస్తుంటుంది.

వెంచర్ క్యాటలిస్ట్స్ : 2016లో వెంచర్ క్యాటలిస్ట్స్ ఏర్పాటైంది. దీన్ని అనిల్ జైన్, అనుజా గోలేచా, అపూర్వ రంజన్ శర్మ, గౌరవ్ జైన్ స్థాపించారు. దీని నుంచి ఇప్పటివరకు 176 వ్యాపారాలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ పెట్టుబడుల మొత్తం విలువ దాదాపు రూ.25వేల కోట్లు ఉంటుంది.

చండీగఢ్ ఏంజెల్స్ నెట్‌వర్క్ : ఈ ఏంజెల్స్ నెట్‌వర్క్ చండీగఢ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఉత్తర భారతదేశంలోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంపై ఈ నెట్‌వర్క్ ఫోకస్ చేస్తుంటుంది.

కీరెట్సు ఫోరమ్ : ఏంజెల్ ఇన్వెస్టర్లకు చెందిన మరో ప్రఖ్యాత నెట్‌వర్క్ పేరు కీరెట్సు ఫోరమ్. కొత్తగా ఏర్పాటయ్యే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంపై ఈ ఫోరమ్ ఫోకస్ చేస్తుంటుంది.

ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ : ఇది కూడా ఒక ఏంజెల్ ఇన్వెస్టర్ల నెట్‌వర్క్. స్టార్టప్‌లకు పెట్టుబడులు ఇవ్వడంతో పాటు మహిళా ఎంట్రప్రెన్యూర్లకు చేయూత ఇవ్వడంపై ఇది ఫోకస్ చేస్తుంది. వారిని సరైన ఇన్వెస్టర్లతో కనెక్ట్ చేసేందుకు ఈ నెట్‌వర్క్​ ప్రయత్నిస్తుంది.

ఎమర్జింగ్ ఇండియా ఏంజెల్స్ : ప్రస్తుత మార్కెట్ల సమస్యలకు పరిష్కారాలను చూపించే స్టార్టప్‌లకు ఈ నెట్‌వర్క్ చేదోడును అందిస్తుంది. వారికి తగిన పెట్టుబడిని, సలహాలను అందించి ప్రోత్సహిస్తుంది.

దిల్లీ స్టార్టప్ నెట్‌వర్క్ : ఈ నెట్‌వర్క్ దిల్లీ కేంద్రంగా పనిచేస్తుంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే స్టార్టప్‌లకు అవసరమైన నిధులను ఇది సమకూరుస్తుంది.

హిమాలయ ల్యాబ్స్ : హిమాలయన్ ప్రాంతంలోని స్టార్టప్‌లకు నిధులను అందించడమే హిమాలయ ల్యాబ్స్‌లోని ఏంజెల్ ఇన్వెస్టర్ల లక్ష్యం.

పెట్టుబడుల సమీకరణకు ఉత్తమ మార్గం
స్టార్టప్‌లు కొత్త ఆలోచనలతో ఏర్పడతాయి. అవి విజయం సాధించాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటివరకు వాటి నిర్వహణకు నిధులు కావాలి. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు వెంటనే స్టార్టప్‌లను విశ్వసించవు. అందుకే ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరించడంపై యువ ఎంట్రప్రెన్యూర్లు ఫోకస్ చేయడం బెటర్. ఆకర్షణీయమైన లాభాల కోసం, స్టార్టప్‌లలో పెట్టుబడుల కోసం ఏంజెల్ ఇన్వెస్టర్లు నిధులను సమకూరుస్తుంటాయి. అయితే ఆ స్టార్టప్ వ్యాపార ఐడియా నడుస్తుందా? నడవదా? అనే దానిపై శాస్త్రీయ అంచనాకు వచ్చిన తర్వాతే పెట్టుబడి అందించే విషయంపై ఏంజెల్ ఇన్వెస్టర్లు ఒక నిర్ణయం తీసుకుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.