ETV Bharat / business

మీ పిల్లల పేరుతో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - fixed deposit for children - FIXED DEPOSIT FOR CHILDREN

Fixed Deposit For Child In India : మీ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? పిల్లల భవిష్యత్తు కోసం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మంచిదే. అయినప్పటికీ ఎఫ్​డీ చేసేముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ వివరాలు మీకోసం.

Fixed Deposit For Children
Fixed Deposit For Child In India
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 4:35 PM IST

Fixed Deposit For Child In India : పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు. దీని వల్ల వారికి మున్ముందు అవసరమైన డబ్బును కూడబెట్టుకునేందుకు వీలు ఉంటుంది.

దీర్ఘకాలం పాటు సురక్షితమైన పథకాల్లో మదుపు చేయాలనుకున్నప్పుడు ఎఫ్​డీలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా ఎఫ్​డీలు ప్రారంభిస్తే, భవిష్యత్​లో మంచి (కార్పస్)​​ నిధిని జమ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అది వారి చదువులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి బ్యాంకూ పిల్లల కోసం ఎఫ్​డీలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఆన్​లైన్​లోనే ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఎఫ్​డీ చేసేందుకు మీ పిల్లల పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పాన్, చిరునామా వివరాల్లాంటివి బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది.

ఎఫ్​డీ ఎప్పుడు ప్రారంభించాలి?
పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం మంచిది. ఇలా చేస్తే దీర్ఘకాలంలో మీ డబ్బులు కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల బాగా పెరుగుతాయి. అయితే మీరు చేసే డిపాజిట్లను క్రమం తప్పకుండా సమీక్షించాలి. వడ్డీ రేటు పెరిగినప్పుడు పాత డిపాజిట్లను రద్దు చేసి, ఎక్కువ వడ్డీ రేటును ఇస్తున్న ఎఫ్​డీలో పొదుపు చేయాలి. దీని వల్ల అదనపు వడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి ట్యాక్స్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, తగిన ప్రణాళికలు వేసుకోవాలి.

ఫిక్స్​డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఎప్పటికప్పుడు వెనక్కు తీసుకోకూడదు. దానికి బదులుగా క్యుములేటివ్ ఎఫ్​డీలను ఎంచుకోవాలి. దీని ద్వారా టెన్యూర్ తీరిన తర్వాత అధిక మొత్తంలో చేతికి డబ్బులు వస్తాయి. ఏటా కొంత మొత్తం కచ్చితంగా ఎఫ్​డీ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. పిల్లల ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా మెచ్యూరిటీ వ్యవధులను నిర్ణయించుకోవాలి. దీని ద్వారా అనుకున్న సమయంలో డబ్బులు చేతికి అందుతాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకే టెన్యూర్​పై పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. దీనికి బదులుగా ఎఫ్​డీ ల్యాడర్ పద్ధతి ఉపయోగించడం మంచిది. అధిక వడ్డీ అందించే తక్కువ టెన్యూర్ కలిగిన స్కీమ్స్​ను ఎంచుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఈవిధంగా పలు టెన్యూర్లపై ఎఫ్​డీ చేయడం ద్వారా లిక్విడిటీ పెరుగుతుంది. అంటే మీ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. మీ అవసరాలకు వాడుకుని, మళ్లీ వాటిని ఎఫ్డీ చేసేందుకు వీలు కలుగుతుంది. అలాగే ద్వారా ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

FD కంటే అధిక వడ్డీ + ట్యాక్స్ బెనిఫిట్స్​ కావాలా? ఈ స్కీమ్​పై ఓ లుక్కేయండి! - National Savings Certificate Scheme

ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​ - మరోసారి 'అమృత్​ కలశ్​' గడువు పెంపు - వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే? - SBI Amrit Kalash scheme Deadline

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.